MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • India vs Sri Lanka: భారత్ vs శ్రీలంక తొలి టెస్ట్.. టీమిండియా తుది జట్టులో సంచలన మార్పులు !

India vs Sri Lanka: భారత్ vs శ్రీలంక తొలి టెస్ట్.. టీమిండియా తుది జట్టులో సంచలన మార్పులు !

India vs Sri Lanka: శ్రీలంకతో శనివారం నుంచి ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత్ బరిలోకి దిగుతోంది. తుది జట్టులో మార్పులు చాలానే ఉంటాయని క్రికెట్ సర్కిల్ లో చర్చ సాగుతోంది. కొత్త ప్లేయర్లు కూడా అరంగేట్రం చేసే అవకాశముంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 13 2026, 03:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భారత్ vs శ్రీలంక: గాలె టెస్ట్‌లో భారత్ సంచలన నిర్ణయాలు
Image Credit : X/BCCI

భారత్ vs శ్రీలంక: గాలె టెస్ట్‌లో భారత్ సంచలన నిర్ణయాలు

శ్రీలంక పర్యటనలో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య శనివారం నుంచి గాలెలో తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, యంగ్‌స్టర్స్‌తో కూడిన టీమిండియా బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలో గాలె టెస్ట్ కోసం భారత్ అంచనా తుది జట్టు ఎలా ఉండబోతుందో వివరంగా చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్
Image Credit : insta/yashasvijaiswal28

ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్

టీమిండియా వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ టెస్ట్ ఫార్మాట్‌లో ఓపెనర్‌గా కొనసాగనున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో అఫ్గానిస్తాన్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రాహుల్ సెంచరీ సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతనికి జోడీగా రాజస్థాన్ రాయల్స్ యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు. యశస్వికి ఇది తొలి శ్రీలంక పర్యటన కావడం విశేషం.

Related Articles

Related image1
Mitchell Starc: టెస్టుల్లో మిచెల్ స్టార్క్ ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్
Related image2
Steve Smith: ప్రిన్సెస్ లాగా బిల్డప్ ఇవ్వకు బ్రో.. స్టీవ్ స్మిత్‌ను ఆటాడుకున్న క్రికెట్ లవర్స్ !
36
మిడిలార్డర్‌లో పడిక్కల్, గిల్, పంత్
Image Credit : X/BCCI

మిడిలార్డర్‌లో పడిక్కల్, గిల్, పంత్

గాయపడిన సాయి సుదర్శన్ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ దేవదత్ పడిక్కల్ నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. కొలంబోలో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో పడిక్కల్ 142 పరుగులు చేసి అద్భుత ఫామ్‌ను ప్రదర్శించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కూడా ఇది తొలి శ్రీలంక టూర్. గిల్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో తన 3000 పరుగులను పూర్తి చేసుకోవాలని భావిస్తున్నాడు. మరోవైపు వైస్ కెప్టెన్సీ కోల్పోయిన వికెట్ కీపర్ రిషబ్ పంత్, తన బ్యాటింగ్‌పైనే పూర్తి దృష్టి పెట్టి ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు.

46
వికెట్ కీపర్ ధృవ్ జురెల్, ఆల్రౌండర్లు
Image Credit : Getty

వికెట్ కీపర్ ధృవ్ జురెల్, ఆల్రౌండర్లు

ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను పక్కనబెట్టి రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్‌ను నంబర్ 6 స్థానంలో కొనసాగించే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో ముల్లాన్‌పూర్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌కి విశ్రాంతి తీసుకున్న ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి తుది జట్టులోకి వస్తున్నాడు. అతనికి తోడుగా గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండర్ మానవ్ సుతార్ రెండో స్పిన్-బౌలింగ్ ఆల్రౌండర్‌గా ఆడనున్నాడు. సుతార్ అఫ్గానిస్తాన్‌పై తన అరంగేట్రం మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.

56
స్పిన్ విభాగం, గుర్నూర్ బ్రార్ టెస్ట్ అరంగేట్రం
Image Credit : AFP

స్పిన్ విభాగం, గుర్నూర్ బ్రార్ టెస్ట్ అరంగేట్రం

లక్నో సూపర్‌జెయింట్స్ చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ఈ శ్రీలంక పర్యటనలో భారత్‌కు ప్రధాన స్పిన్నర్‌గా వ్యవహరిస్తాడు. ఇక బౌలింగ్ విభాగంలో గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ టెస్ట్ అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో శ్రీలంకపై ఇండియా 'ఎ' తరఫున ఆడిన బ్రార్, తన ప్రతిభతో ఆకట్టుకుని సీనియర్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

66
శ్రీలంకతో తొలి టెస్ట్‌కు భారత్ అంచనా తుది జట్టు
Image Credit : ANI

శ్రీలంకతో తొలి టెస్ట్‌కు భారత్ అంచనా తుది జట్టు

కెరీర్‌లో ఇప్పటివరకు 46 టెస్టుల్లో 140 వికెట్లు తీసిన గుజరాత్ టైటాన్స్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ భారత్ బౌలింగ్ విభాగాన్ని ముందండి నడిపించనున్నాడు.

భారత తుది జట్టు

1. కేఎల్ రాహుల్

2. యశస్వి జైస్వాల్

3. దేవదత్ పడిక్కల్

4. శుభ్‌మన్ గిల్ (కెప్టెన్)

5. రిషబ్ పంత్

6. ధృవ్ జురెల్ (వికెట్ కీపర్)

7. రవీంద్ర జడేజా

8. మానవ్ సుతార్

9. కుల్దీప్ యాదవ్

10. గుర్నూర్ బ్రార్

11. మహమ్మద్ సిరాజ్

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Related Stories
Recommended image1
Mitchell Starc: టెస్టుల్లో మిచెల్ స్టార్క్ ఆల్ టైమ్ వరల్డ్ రికార్డ్
Recommended image2
Steve Smith: ప్రిన్సెస్ లాగా బిల్డప్ ఇవ్వకు బ్రో.. స్టీవ్ స్మిత్‌ను ఆటాడుకున్న క్రికెట్ లవర్స్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved