MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs PAK : టీమిండియాను చూస్తే పాక్ వెన్నులో వణుకు.. అందుకే నో మ్యాచ్ : ఒప్పుకున్న పాక్ మాజీ క్రికెటర్

IND vs PAK : టీమిండియాను చూస్తే పాక్ వెన్నులో వణుకు.. అందుకే నో మ్యాచ్ : ఒప్పుకున్న పాక్ మాజీ క్రికెటర్

ICC T20 World Cup 2026 : టీమిండియా ఫామ్ ని చూసి పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టింది… అందుకే మ్యాచ్ ను బహిష్కరించిందని అందరికీ తెలుసు. ఇదే అభిప్రాయాన్ని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ కూడా వ్యక్తం చేశాడు.  

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 03 2026, 12:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాక్ ది కచ్చితంగా భయమే..!
Image Credit : stockPhoto

పాక్ ది కచ్చితంగా భయమే..!

ICC T20 World Cup 2026 : టీమిండియాను చూసి పాకిస్థాన్ భయపడుతోందా..? అందుకే టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టుతో ఆడబోమని అంటోందా..? అంటే భారత అభిమానుల నుండి అవును అనే సమాధానమే వస్తుంది. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉంది ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి... సాధారణంగానే టీమిండియాపై గెలవలేం... ప్రస్తుతం ఈ టీం అరివీర భయంకరంగా ఉంది కాబట్టి గెలుపు అసాధ్యం... ఆడి అవమానపడటం కంటే బహిష్కరించడమే మేలు అనుకుంటున్నట్లున్నారు పాక్ ఆటగాళ్లు. అందుకే ఏవేవో కారణాలు చెప్పి టీమిండియాతో టీ20 మ్యాచ్ ను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు.

25
భారత్ తో ఆడకపోవడం పాక్ కే నష్టం
Image Credit : Getty

భారత్ తో ఆడకపోవడం పాక్ కే నష్టం

అయితే ఈ మ్యాచ్ బహిష్కరణ నిర్ణయం పాకిస్థాన్ కు చాలా కాస్ట్లీదిగా మారనుంది... డబ్బులే కాదు ప్రపంచ దేశాల ముందు పరువు తీసేలా ఉంది. ఈ మాట స్వయంగా ఓ పాకిస్థాని మాజీ క్రికెటర్ అంటున్నాడు. ''టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయం మన క్రికెట్‌కే ఎక్కువ నష్టం చేస్తుంది'' అని మాజీ పాక్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు.

భారత్‌ను ఎదుర్కోవడానికి పాకిస్థాన్‌కు భయమనే తప్పుడు సంకేతాన్ని ఈ బహిష్కరణ నిర్ణయం ప్రపంచానికి పంపుతుందని కనేరియా అన్నాడు. భారత్‌లో అడుగు పెట్టబోమని పాకిస్థాన్ అంటేనే ఐసిసి శ్రీలంకలో మ్యాచ్‌ను ఏర్పాటు చేసింది. అలాంటప్పుడు బహిష్కరణలో అర్థం లేదని కనేరియా అభిప్రాయపడ్డాడు.

Related Articles

Related image1
ICC Men's T20 World Cup 2026 : భారత్ లేకుంటే బంగ్లాదేశ్ ఎక్కడిది.. బిసిసిఐ లేకుంటే బిసిబి ఎక్కడిది..! ఇదీ చరిత్ర
Related image2
Now Playing
No India vs Pakistan Match? | Huge Financial Loss for ICC | Asianet News Telugu
35
టీమిండియాకు పాక్ భయపడుతోంది..
Image Credit : ANI

టీమిండియాకు పాక్ భయపడుతోంది..

''భారత్‌ను ఎదుర్కోవడానికి పాకిస్థాన్ భయపడుతోంది, అందుకే వారు ఆడటానికి నిరాకరిస్తున్నారని ప్రజలు అనుకోవడానికి ఇది కారణమవుతుంది. ప్రపంచకప్ అన్ని దశల్లోనూ భారత్ పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ బహిష్కరణ పాకిస్థాన్ సెమీ ఫైనల్ అవకాశాలను మరింత కష్టతరం చేస్తుంది'' అని ఐఏఎన్ఎస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కనేరియా స్పష్టం చేశాడు.

45
ఏం పాకిస్థాన్.. ఫైనల్లోనూ భారత్ తో ఆడరా..?
Image Credit : ANI

ఏం పాకిస్థాన్.. ఫైనల్లోనూ భారత్ తో ఆడరా..?

''గ్రూప్ దశలో బహిష్కరిస్తారు సరే... కానీ రేపు సెమీ ఫైనల్ లేదా ఫైనల్‌లో భారత్‌ను ఎదుర్కోవాల్సి వస్తే... అప్పుడేం చేస్తారు. అప్పుడు కూడా ఇలాగే ఆడమని చెప్పి కిరీటాన్ని భారత్‌కు వదిలేస్తారా? మైదానంలోకి దిగి పోరాడి గెలవాలి. అదే అసలైన ప్రతీకారం. అంతేగానీ బహిష్కరించడం వల్ల ఎలాంటి మార్పు రాదు.'' అని కనేరియా చెప్పాడు.

55
భారత్ మ్యాచ్ బహిష్కరణ పాక్ క్రికెటర్లకు ఇష్టం లేదా..?
Image Credit : Insta/indiancricketteam

భారత్ మ్యాచ్ బహిష్కరణ పాక్ క్రికెటర్లకు ఇష్టం లేదా..?

''టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన బంగ్లాదేశ్‌కు సపోర్ట్ ఇవ్వడానికే ఈ నిర్ణయం అని పాకిస్థాన్ అనుకోవచ్చు. కానీ ఇతరుల కోసం నిర్ణయాలు తీసుకునే బదులు, తమ సొంత క్రికెట్ అభివృద్ధిపై వారు దృష్టి పెట్టాలి. భావోద్వేగంతో తీసుకునే ఇలాంటి నిర్ణయాలు తీవ్ర పరిణామాలకు దారితీస్తాయి. పాకిస్థాన్ జట్టులోని చాలా మంది ఆటగాళ్లకు ఈ నిర్ణయంపై అసంతృప్తి ఉండి ఉంటుంది.. కానీ దాన్ని బయటకు చెప్పలేని పరిస్థితిలో వారు ఉన్నారు'' అని పాక్ మాజీ క్రికెటర్ కనేరియా అభిప్రాయపడ్డారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
పాకిస్తాన్
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup లో సిక్సర్ల సునామీ.. అత్యధిక సిక్సర్లు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే
Recommended image2
Tilak Varma : వచ్చేశాడు.. ఉతికేస్తున్నాడు! వరల్డ్ కప్‌ ముందు తిలక్ వర్మ విశ్వరూపం
Recommended image3
Pakistan : పాకిస్థాన్ తన గొయ్యి తానే తవ్వుకుంది.. గల్లీ క్రికెట్ ఆడుకోవాల్సిందే !
Related Stories
Recommended image1
ICC Men's T20 World Cup 2026 : భారత్ లేకుంటే బంగ్లాదేశ్ ఎక్కడిది.. బిసిసిఐ లేకుంటే బిసిబి ఎక్కడిది..! ఇదీ చరిత్ర
Recommended image2
Now Playing
No India vs Pakistan Match? | Huge Financial Loss for ICC | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved