MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • టీమ్ ఇండియా మొద‌టి మ్యాచ్ ఎప్పుడు ఆడింది.? క్రికెట్‌కి సంబంధించి ఎవ‌రికీ తెలియ‌ని ఆస‌క్తిక‌ర విష‌యాలు

టీమ్ ఇండియా మొద‌టి మ్యాచ్ ఎప్పుడు ఆడింది.? క్రికెట్‌కి సంబంధించి ఎవ‌రికీ తెలియ‌ని ఆస‌క్తిక‌ర విష‌యాలు

Cricket Facts: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడల్లో క్రికెట్ ఒకటి. ముఖ్యంగా భారతదేశంలో ఈ ఆటకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే ప్రతి క్రికెట్ ప్రేమికుడికి ఆటపై ఆసక్తి ఉన్నప్పటికీ, దాని హిస్టరీ గురించి తెలిసిన వారు మాత్రం తక్కువ.  

2 Min read
Author : Narender Vaitla
Published : Jul 04 2026, 07:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రపంచంలో తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది?
Image Credit : Gemini AI

ప్రపంచంలో తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగింది?

చాలామంది తొలి అంతర్జాతీయ మ్యాచ్ అంటే ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌నే అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. క్రికెట్ హిస్టరీలో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ 1844 సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు అమెరికా, కెనడా జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని సెయింట్ జార్జ్ క్రికెట్ క్లబ్ మైదానంలో నిర్వహించారు. ఈ పోటీలో కెనడా 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కేవలం క్రికెట్‌లోనే కాదు, ప్రపంచ క్రీడల హిస్టరీలో రెండు దేశాల మధ్య జరిగిన తొలి అంతర్జాతీయ క్రీడా పోటీగా కూడా గుర్తింపు పొందింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మొదటి అధికారిక టెస్టు మ్యాచ్ ఎప్పుడు జరిగింది?
Image Credit : Getty

మొదటి అధికారిక టెస్టు మ్యాచ్ ఎప్పుడు జరిగింది?

టెస్టు క్రికెట్‌కు శ్రీకారం చుట్టింది మాత్రం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లే. ఈ రెండు జట్లు 1877 మార్చి 15 నుంచి 19 వరకు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో తొలి అధికారిక టెస్టు మ్యాచ్ ఆడాయి. ఈ హిస్టారికల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 45 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. అప్పటి నుంచి టెస్టు క్రికెట్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ఫార్మాట్‌గా కొనసాగుతోంది.

Related Articles

Related image1
ఒకే రైల్వే స్టేషన్.. రెండు రాష్ట్రాలు.. ఒక బెంచ్‌పై కూర్చుంటే ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నట్టే!
Related image2
IT: ఇక హైద‌రాబాద్‌, చెన్నై వెళ్లాల్సిన ప‌నిలేదు.. సాఫ్ట్‌వేర్‌కి అడ్డాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మ‌రో న‌గ‌రం
35
ప్రపంచకప్, ఐసీసీ ఆవిర్భావం ఎలా జరిగింది?
Image Credit : Getty

ప్రపంచకప్, ఐసీసీ ఆవిర్భావం ఎలా జరిగింది?

క్రికెట్ ప్రపంచకప్ తొలిసారిగా 1975లో ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చింది. ఆ టోర్నీలో వెస్టిండీస్ జట్టు విజేతగా నిలిచి తొలి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ప్రపంచకప్ నాలుగేళ్లకోసారి నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయ క్రికెట్ నిర్వహణ బాధ్యతలు చూసే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రారంభం 1909లో జరిగింది. మొదట దీనిని ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ పేరుతో ఏర్పాటు చేశారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ప్రతినిధులు కలిసి ఈ సంస్థను స్థాపించారు. 1965లో దీనికి ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్ అని పేరు మార్చగా, 1989లో ప్రస్తుతం ఉన్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) అనే పేరును స్వీకరించింది. ప్రస్తుతం ఐసీసీ ప్రధాన కార్యాలయం దుబాయ్‌లో ఉంది.

45
టీమ్ ఇండియా తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు ఆడింది?
Image Credit : Getty

టీమ్ ఇండియా తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఎప్పుడు ఆడింది?

భారత జట్టు తన తొలి అధికారిక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌ను 1932 జూన్ 25న ఇంగ్లాండ్‌తో ఆడింది. ఈ మ్యాచ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత జట్టుకు సీకే నాయుడు కెప్టెన్‌గా వ్యవహరించారు. తొలి మ్యాచ్‌లో భారత్ 158 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ, అదే భారత క్రికెట్ హిస్టరీకి తొలి అడుగుగా నిలిచింది.

55
భారత్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఎక్కడ జరిగింది?
Image Credit : X/BCCI

భారత్‌లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఎక్కడ జరిగింది?

భారత్ గడ్డపై జరిగిన తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ 1933లో ముంబైలో నిర్వహించారు. ఇందులో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌తో భారతదేశం అంతర్జాతీయ క్రికెట్ ఆతిథ్య దేశంగా కూడా గుర్తింపు పొందింది. నేడు ప్రపంచ క్రికెట్‌లో భారత్ అత్యంత శక్తివంతమైన జట్లలో ఒకటిగా నిలవడానికి ఈ హిస్టారికల్ ప్రయాణమే పునాది అయింది. 1844లో ప్రారంభమైన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణం నేడు కోట్లాది అభిమానులను అలరిస్తూ ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన క్రీడల్లో ఒకటిగా కొనసాగుతోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
క్రికెట్
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 Final: ఇంగ్లాండ్ విశ్వరూపం.. వరల్డ్ కప్ ఫైనల్లోకి లయన్సెస్.. కంగారులతో బిగ్ ఫైట్
Recommended image2
ICC Rankings 2026 : వరల్డ్ క్రికెట్లో హైదరబాద్ హవా.. ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన పట్నం పోటుగాళ్లు
Recommended image3
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Related Stories
Recommended image1
ఒకే రైల్వే స్టేషన్.. రెండు రాష్ట్రాలు.. ఒక బెంచ్‌పై కూర్చుంటే ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నట్టే!
Recommended image2
IT: ఇక హైద‌రాబాద్‌, చెన్నై వెళ్లాల్సిన ప‌నిలేదు.. సాఫ్ట్‌వేర్‌కి అడ్డాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని మ‌రో న‌గ‌రం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved