MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • Champions Trophy: 100, 100, 100, 100 వరుస సెంచరీలతో దంచికొడుతున్న రచిన్ రవీంద్ర

Champions Trophy: 100, 100, 100, 100 వరుస సెంచరీలతో దంచికొడుతున్న రచిన్ రవీంద్ర

Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బంగ్లాదేశ్ ను చిత్తుచేసి న్యూజిలాండ్ సెమీస్ చేరుకుంది. కీవీస్ యంగ్ ప్లేయర్ ర‌చిన్ ర‌వీంద్ర ఛాంపియన్స్ ట్రోఫీలో తన తొలి మ్యాచ్ లోనే సెంచ‌రీతో దుమ్మురేపాడు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 24 2025, 11:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Champions Trophy 2025: ర‌న్ మిష‌న్ అంటే ప్రపంచ క్రికెట్ లో మొద‌ట గుర్తుకు వ‌చ్చే పేరు భార‌త క్రికెట్ జ‌ట్టు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ. గ్రౌండ్ లోకి అడుగుపెడితే చాలు ప‌రుగుల వ‌ర‌ద పారాల్సిందే. అయితే, ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలోకి కొత్త  ర‌న్ మిష‌న్ వచ్చేసింది. అత‌నే భార‌త సంత‌తికి చెందిన న్యూజిలాండ్ యంగ్ ప్లేయ‌ర్ ర‌చిన్ ర‌వీంద్ర‌. ఐసీసీ టోర్న‌మెంట్లు అంటే దంచికొట్టే ర‌చిన్.. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా తనదైన ముద్ర వేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత‌మైన‌ బ్యాటింగ్‌తో సెంచ‌రీ కొట్టి సంచలనం సృష్టించాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఐసీసీ టోర్న‌మెంట్ల‌లో దంచి కొట్టే ర‌చిన్ ర‌వీంద్ర ! 

రచిన్ రవీంద్ర ప్ర‌స్తుతం ప‌రుగుల వ‌ర‌దపారిస్తున్నాడు. 2023 ప్రపంచ కప్‌లో అద్భుత‌మైన ఆట‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సాధించాడు. ర‌చిన్ ర‌వీంద్ర ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో దుమ్మురేపాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కూడా తొలి మ్యాచ్ లోనే అద‌ర‌గొట్టాడు. ర‌చిన్ తన తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడి సెంచరీ సాధించాడు. జ‌ట్టుకు విజ‌యాన్ని అందించాడు. 

34

11 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు కొట్టిన ర‌చిన్ ర‌వీంద్ర

ఐసీసీ టోర్నమెంట్‌లో రచిన్ రవీంద్ర ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడాడు. అతను 2023 వ‌న్డే ప్రపంచ కప్‌లో 10 మ్యాచ్‌లు ఆడాడు. మొదటి మ్యాచ్ నుండే గొప్ప ఫామ్‌లో కనిపించాడు. అక్క‌డ 3 సెంచరీ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. దీంతో ఐసీసీ ఈవెంట్లలో అత‌ని సెంచరీల సంఖ్యను 4కు చేరింది. అతను ఇప్పటివరకు 11 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలతో 690 పరుగులు చేశాడు. 

44
Image Credit: Getty Images

Image Credit: Getty Images

మార్చి 2న భారత్ త‌ల‌ప‌డున్న న్యూజిలాండ్

బంగ్లాదేశ్‌పై రచిన్ రవీంద్ర 112 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో 1 సిక్స్, 12 ఫోర్లు బాదాడు. అత‌ని ఇన్నింగ్స్ తో బంగ్లాదేశ్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీ-ఫైనల్స్‌కు ముందు, న్యూజిలాండ్ భారత్‌తో తలపడనుంది. దీంతో ర‌చిన్ ర‌వీంద్ర ఇప్పుడు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ కానున్నాడు. ఆ మ్యాచ్‌లో ఏం చేస్తాడో చూడాలి. కాగా, ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మన్‌గా రచిన్ రవీంద్ర రికార్డు సాధించాడు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
పాకిస్తాన్

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved