IND vs PAK: ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు
india vs pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫిబ్రవరి 23న భారత్-పాకిస్తాన్ తలపడతాయి. అయితే, ఈ మ్యాచ్ ఎప్పుడు, ఏ టైమ్ కు మొదలవుతుంది, ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
india vs pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత జట్టు గెలుపుతో ప్రారంభించింది. ఈ ఐసీసీ టోర్నమెంట్‌లోని 2వ మ్యాచ్‌లో భారత జట్టు బంగ్లాదేశ్ తో తలపడింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ రోహిత్ సేన బంగ్లాదేశ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఇప్పుడు తన రెండవ మ్యాచ్‌లో భారత జట్టు తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.
IND vs PAK
భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులతో పాటు క్రికెట్ లవర్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. చాలా సంవత్సరాలుగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. ఈ రెండు జట్లు కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడుతున్నాయి. దీంతో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే యావత్ ప్రపంచ దేశాలు మరింత ఆసక్తిని చూపుతాయి. ఈ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు అనే వివరాలు ఇలా ఉన్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత-పాకిస్తాన్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత క్రికెట్ జట్టు-పాకిస్తాన్ క్రికెట్ జట్టు లీగ్ మ్యాచ్ ఫిబ్రవరి 23, ఆదివారం జరుగుతుంది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ మధ్యాహ్నం 2 గంటలకు వేస్తారు.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో జరిగే ఐదో మ్యాచ్ లో భారత్-పాకిస్తాన్ జట్లు తలపడాతాయి. ఈ మ్యాచ్ యూఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ను ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ ను టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడవచ్చు. అలాగే, మొబైల్ యాప్ జియో హాట్‌స్టార్ లో చూడవచ్చు. జియో హాట్ స్టార్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. మీరు ఏసియా నెట్ న్యూస్ తెలుగులో లైవ్ అప్‌డేట్‌లు, మ్యాచ్‌కు సంబంధించిన అన్ని ఇతర వార్తలను చదవవచ్చు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్-పాకిస్తాన్ జట్లు:
టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్.
పాకిస్తాన్: ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, మొహమ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్, మొహమ్మద్ హస్నైన్, ఉస్మాన్ ఖాన్, కమ్రాన్ గులాం, ఫహీమ్ అష్రఫ్.