- Home
- Sports
- Cricket
- Champions Trophy: భారత్ vs న్యూజిలాండ్.. టీంలో 4 మార్పులు.. వీరులు వచ్చేస్తున్నారు !
Champions Trophy: భారత్ vs న్యూజిలాండ్.. టీంలో 4 మార్పులు.. వీరులు వచ్చేస్తున్నారు !
IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత జట్టులో 4 మార్పులు జరగనున్నాయి. ఆదివారం జరిగే ఈ మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి.

India vs New Zealand: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తమ చివరి గ్రూప్ మ్యాచ్ లో భారత్-న్యూజిలాండ్‌లు తలపడనున్నాయి. ఆదివారం దుబాయ్ లో జరిగే ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో పలు కీలక మార్పులు కనిపించనున్నాయి. దుబాయ్ లో జరిగే మ్యాచ్‌లో సిక్సర్ల వీరుడు రిషబ్ పంత్ బరిలోకి దిగనున్నాడు. దీంతో పాటు భారత జట్టులో 4 మార్పులు జరగనున్నాయి.
పాకిస్థాన్, దుబాయ్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ చివరి దశకు చేరుకుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ రేపు జరగనుంది. భారత జట్టు బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లను ఓడించి సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. న్యూజిలాండ్ కూడా పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లను ఓడించి సెమీఫైనల్‌కు వచ్చింది.
ఛాంపియన్స్ ట్రోఫీ
రోహిత్, షమీలు ఆడటం కష్టమేనా.. !
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలుస్తుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్ గా మారింది. భారత జట్టు విషయానికొస్తే పాకిస్థాన్‌పై చిన్న గాయంతో బాధపడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ, న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడకపోవచ్చని క్రికెట్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది.
దీంతో శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని సమాచారం. కానీ రోహిత్ శర్మ నిన్న తీవ్రంగా నెట్ ప్రాక్టీస్ చేశాడు. మరీ అతను తర్వాతి మ్యాచ్ లో ఆడతాడా లేదా అనేది చూడాలి. అలాగే, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కాలు నొప్పి కారణంగా బాధపడిన మహ్మద్ షమీ న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో అతను ఆడటం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో షమీ స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చే అవకాశముంది.
రిషబ్ పంత్
భారత జట్టులోకి రిషబ్ పంత్, వరుణ్ చక్రవర్తిలు వస్తారా?
గత రెండు మ్యాచ్‌ల్లో అవకాశం రాని ఆటగాళ్లకు న్యూజిలాండ్ మ్యాచ్‌లో అవకాశం ఇస్తారని సమాచారం. ఇదే జరిగితే కేఎల్ రాహుల్ స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ జట్టులోకి వస్తాడు. అలాగే, కుల్దీప్ యాదవ్ స్థానంలో తమిళనాడు ఆటగాడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఆడనున్నాడు. అదేవిధంగా అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఆడించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.
భారత్-న్యూజిలాండ్ మ్యాచ్
న్యూజిలాండ్ vs టీమిండియా ప్లేయింగ్ 11:
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ యథావిధిగా ఓపెనింగ్‌లో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్‌లో ఆడనున్నారు. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి ముగ్గురు స్పిన్నర్లు బరిలోకి దిగనున్నారు. హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా ఫాస్ట్ బౌలింగ్‌లో రాణించనున్నారు.
భారత జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.
Virat Kohli: విరాట్ కోహ్లీ 300వ వన్డే.. టీమిండియా స్టార్ టాప్-5 రికార్డులు