MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Sports
  • Cricket
  • Virat Kohli: విరాట్ కోహ్లీ 300వ వన్డే.. టీమిండియా స్టార్ టాప్-5 రికార్డులు

Virat Kohli: విరాట్ కోహ్లీ 300వ వన్డే.. టీమిండియా స్టార్ టాప్-5 రికార్డులు

Champions Trophy 2025: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 2008లో భారత్ తరపున వన్డేల్లోకి అడుగుపెట్టి, ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా రికార్డులు మోత మోగిస్తున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 01 2025, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Virat Kohli's 300th ODI Records: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 300వ ODI ఆడనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఇది జరగనుంది. దీంతో పలు రికార్డులు బద్దలుకొట్టనున్నాడు. 

మొహమ్మద్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, ధోనీ తర్వాత 300 ODIలు ఆడుతున్న ఏడో భారత ఆటగాడిగా కోహ్లీ నిలవనున్నాడు. కోహ్లీ 2008లో తన వన్డే  కెరీర్ మొదలుపెట్టి ప్రపంచ క్రికెట్ లో అనేక రికార్డులు సాధించాడు. విరాట్ కోహ్లీ 300వ మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా, అతను సాధించిన కొన్ని రికార్డులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Virat Kohli's 300th ODI: Look at 5 major records achieved by Team India star batter Champions Trophy 2025

Virat Kohli's 300th ODI: Look at 5 major records achieved by Team India star batter Champions Trophy 2025

1. వేగంగా 4000 నుంచి 14,000 వన్డే పరుగులు చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ

2008లో అరంగేట్రం చేసినప్పటి నుంచి కోహ్లీ ODI క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. లక్ష్యాలను ఛేదించడంలో, పరిస్థితులకు తగ్గట్టు ఆడటంలో కోహ్లీకి ఎవరూ సాటిలేరు. 4000 నుంచి 14,000 పరుగుల మైలురాయిని వేగంగా చేరుకున్న ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. లెజెండరీ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర సరసన నిలిచాడు. 

36

2. 55+ సగటుతో 10000+ పరుగులు చేసిన ఏకైక ఆటగాడు కోహ్లీ 

విరాట్ కోహ్లీ ODI క్రికెట్ చరిత్రలో 55 సగటుతో 10,000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డు సాధించాడు. 299 మ్యాచ్‌లలో 58.20 సగటుతో 14085 పరుగులు చేశాడు. ధోనీ 50.57 సగటుతో 10,773 పరుగులు చేశాడు. విదేశాల్లో కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడటం కోహ్లీ ప్రత్యేకత.

46
Virat Kohli's 300th ODI: Look at 5 major records achieved by Team India star batter Champions Trophy 2025

Virat Kohli's 300th ODI: Look at 5 major records achieved by Team India star batter Champions Trophy 2025

3. విజయాల్లో 10,000+ ODI పరుగులు చేసిన యాక్టిక్ ప్లేయర్ కోహ్లీ 

విరాట్ కోహ్లీ ODI క్రికెట్‌లో విజయాల్లో 10,000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడు. మొత్తం మీద లెజెండరీ ప్లేయర్లు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ తర్వాత కోహ్లీ ఉన్నాడు. 36 ఏళ్ల కోహ్లీ 184 మ్యాచ్‌లలో 75.20 సగటుతో 10,228 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 169 మ్యాచ్‌లలో 58.58 సగటుతో 7851 పరుగులు చేశాడు. కోహ్లీ గొప్ప మ్యాచ్ విన్నర్ అని చెప్పడానికి ఇదే నిదర్శనం.

56
చిత్ర సౌజన్యం: గెట్టి ఇమేజెస్

చిత్ర సౌజన్యం: గెట్టి ఇమేజెస్

4. అత్యధిక ODI సెంచరీలు సాధించిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ 

విరాట్ కోహ్లీ ODI క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు (51) చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వన్డే ప్రపంచ కప్ 2023లో న్యూజిలాండ్‌పై 117 పరుగులు చేసి సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. పాకిస్థాన్‌పై 111 బంతుల్లో 100 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఒత్తిడిలో కూడా సెంచరీలు చేయగల సత్తా కోహ్లీ సొంతం.

66
Virat Kohli's 300th ODI: Look at 5 major records achieved by Team India star batter Champions Trophy 2025

Virat Kohli's 300th ODI: Look at 5 major records achieved by Team India star batter Champions Trophy 2025

5. అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు 

యాక్టివ్ ప్లేయర్లలో విరాట్ కోహ్లీ ODI క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. 299 ODI మ్యాచ్‌లలో 42 అవార్డులు అందుకున్నాడు. షకీబ్ అల్ హసన్ 27 అవార్డులతో రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య వరుసగా 62, 48 అవార్డులతో ముందున్నారు. కోహ్లీ అన్ని పరిస్థితుల్లోనూ రాణించగలడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
భారత దేశం
పాకిస్తాన్
రోహిత్ శర్మ
శుభ్‌మన్ గిల్
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved