- Home
- Sports
- Cricket
- Champions Trophy 2025: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందే రోహిత్ శర్మ రికార్డు
Champions Trophy 2025: భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ ప్రారంభానికి ముందే రోహిత్ శర్మ రికార్డు
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక మ్యాచ్ ప్రారంభానికి ముందే రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.

Rohit Sharma and Mohammad Rizwan (Photo: X/@TheRealPCB)
Champions Trophy 2025: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐసీసీ పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఉత్కంఠభరితమైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మొదలైంది. క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోవడంతో భారత్ మొదట బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డు సాధించాడు.
India vs Pakistan
టాస్ ఓడిపోవడంలో రోహిత్ శర్మ రికార్డు
ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 5వ మ్యాచ్ లో భారత్ పాకిస్తాన్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే రోహిత్ శర్మ రికార్డు సాధించాడు. రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయాడు. దీంతో వరుసగా అత్యధిక సార్లు టాస్ ఓడిపోయిన కెప్టెన్ గా రోహిత్ శర్మ రికార్డు సాధించాడు. 2023 ప్రపంచ కప్ ఫైనల్స్ నుండి భారతదేశం వరుసగా 12 టాస్‌లను కోల్పోయింది. వన్డేల్లో ఒక జట్టుకు ఇదే అత్యధికం. అంతకు ముందు ఈ రికార్డు నెదర్లాండ్స్ (మార్చి 2011 & ఆగస్టు 2013 మధ్య 11 టాస్‌లు ఓడిపోయింది) పేరిట ఉంది.
Rohit Sharma
రోహిత్ శర్మ ఏం చెప్పాడంటే?
టాస్ ఓడిపోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాడు. "ఏం ఫరవాలేదు, వారు టాస్ గెలిచారు కాబట్టి మేము మొదట బౌలింగ్ చేస్తాం. చూడ్డానికి గత మ్యాచ్ మాదిరిగానే పిచ్ స్లోగా ఉంది. బ్యాటింగ్ లో మాకు అనుభవజ్ఞులైన యూనిట్ ఉంది కాబట్టి పిచ్ స్లో గా ఉంటే ఏం చేయాలో మాకు తెలుసు. బ్యాట్, బాల్ తో భారత్ మంచి ప్రదర్శన ఇస్తుంది. గత మ్యాచ్ నుంచి బాగానే తెలుసుకున్నాం. ఇక్కడ టీమ్ కు బాగుందని" రోహిత్ చెప్పారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భారత్-పాకిస్తాన్ జట్ల ప్లేయింగ్ 11 వీరే
భారత్ (ప్లేయింగ్ XI):
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్
పాకిస్తాన్ (ప్లేయింగ్ XI):
ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(కెప్టెన్, వికెట్ కీపర్), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్