అశ్విన్ 8 ఏళ్ల రికార్డు బ్రేక్.. ఐసీసీ ర్యాంకింగ్స్ లో దుమ్మురేపుతున్న బుమ్రా
Jasprit Bumrah: భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన బౌలింగ్ తో ఆసీస్ ను కంగారెత్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొత్త సంవత్సరంలో రవిచంద్రన్ అశ్విన్ 8 ఏళ్ల రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు.
Jasprit Bumrah
Jasprit Bumrah: అద్భుతమైన బౌలింగ్ లో భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా క్రికెట్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. దుమ్మురేపే ఇన్నింగ్స్ లతో 2024 ఏడాదిని ముగించిన అతను కొత్త సంవత్సరం 2025 లో మరో ఘనత సాధించాడు. నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్న బుమ్రా.. 8 ఏళ్ల భారత మాజీ స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డును బద్దలు కొట్టాడు.
ఐసీసీ టెస్టు ర్యాకింగ్స్ లో నెంబర్ 1 బౌలర్ జస్ప్రీత్ బుమ్రా
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా నంబర్ 1 బౌలర్‌గా కొనసాగుతున్నాడు. స్టార్ బౌలర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో అద్భుతమైన బౌలింగ్ తో ఆస్ట్రేలియా ప్లేయర్లను కంగారెత్తిస్తున్నాడు. ఈ సిరీస్ లో వికెట్ల వేటలో అందరికంటే ముందున్నాడు. దీంతో కొత్త సంవత్సరం 2025 తొలిరోజే అందరికీ గుడ్ న్యూస్ చెప్పాడు. బుమ్రా 8 ఏళ్ల రవిచంద్రన్ అశ్విన్ రికార్డును బద్దలు కొట్టాడు. అత్యధిక ICC రేటింగ్ సాధించిన భారత బౌలర్‌గా బుమ్రా ఘనత సాధించాడు. ఐసీసీ బుధవారం తాజా టెస్టు ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో బుమ్రా టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు.
Jasprit Bumrah-Akash Deep
ఆస్ట్రేలియాలో అత్యుత్తమ బౌలింగ్ తో అదరగొడుతున్న బుమ్రా
ఆస్ట్రేలియా టూర్‌లో బుమ్రా టీమిండియాకు వెన్నుదన్నుగా నిలిచాడు. అద్భుతమైన ప్రదర్శనలతో భారత బౌలింగ్ విభాగం భారాన్ని మోస్తున్నాడు. ఇప్పటి వరకు కేవలం 4 మ్యాచ్‌ల్లోనే బుమ్రా 30 వికెట్లు తీశాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన నాల్గవ టెస్టులో తన అద్భుత ప్రదర్శనతో 9 వికెట్లు తీసుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సూపర్ బౌలింగ్ తో బుమ్రా కొత్త రికార్డును సృష్టించాడు. ఈ స్టార్ ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు 907 ఐసీసీ రేటింగ్‌తో నంబర్-1 బౌలర్ గా నిలిచాడు. అలాగే, అత్యధిక ఐసీసీ రేటింగ్ పాయింట్స్ సాధించిన భారత బౌలర్ గా కూడా ఘనత సాధించాడు. ప్రపంచంలో అత్యధిక ఐసీసీ రేటింగ్ సాధించిన బౌలర్ల జాబితాలో బుమ్రా 907 రేటింగ్ పాయింట్లతో ఇంగ్లండ్ ఆటగాడు డెరెక్ అండర్‌వుడ్‌తో కలిసి 17వ స్థానంలో ఉన్నాడు.
Jasprit Bumrah
అశ్విన్ రికార్డు బ్రేక్ చేసిన బుమ్రా
భారత్-ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా టీమిండియా స్టార్ స్పిన్ మాస్టర్ రవిచంద్రన్ అశ్విన్ ఎవరూ ఊహించని విధంగా అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. 8 ఏళ్ల క్రితం అంటే 2016లో ఐసీసీ 904 రేటింగ్ సాధించి భారత్ తరఫున అత్యధిక రేటింగ్ సాధించిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు. అయితే, ఇప్పుడు అశ్విన్ రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు. ఈ ఫాస్ట్ బౌలర్ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. దీంతో ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసింది. చివరి టెస్టు ముసిగిన తర్వాత ఇంకా ఎక్కువ రేటింగ్‌లు సాధించవచ్చు. భారత్-ఆస్ట్రేలియా జట్లు జనవరి 3న సిడ్నీలో ఈ సిరీస్‌లో చివరి టెస్టు ఆడనున్నాయి. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఎన్ని వికెట్లు తీయగలడనేది ఆసక్తికరంగా మారింది.
Jasprit Bumrah
2024 ను ఘనంగా ముగించిన బుమ్రా
జస్ప్రీత్ బుమ్రాకు ప్రతి నెల, ప్రతి టోర్నమెంట్, ప్రతి మ్యాచ్ 2024 సంవత్సరంలో ప్రత్యేకం అని చెప్పాలి. ఈ ఏడాది ఎప్పటికీ గుర్తుండిపోయే అనేక క్షణాలను అందించింది. బుమ్రా అద్భుత బౌలింగ్ 2024లో టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను చాంపియన్‌గా నిలిపింది. టీ20 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ (POTT)గా నిలిచాడు.
ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కెప్టెన్‌గా బుమ్రా అద్భుతం చేశాడు. అతని నాయకత్వంలో జట్టు క్లిష్టమైన మ్యాచ్‌లో విజయం సాధించింది. తన అద్భుత బౌలింగ్ తో భారత్ కు విజయాన్ని అందించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు అంటే 2024లో వన్డే, టీ20, టెస్టుతో సహా మూడు ఫార్మాట్లలో బుమ్రా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. బుమ్రా తన టెస్టు కెరీర్‌లో 200 టెస్టు వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా ఎంపికయ్యాడు.