బాక్సింగ్ డే ట్రిపుల్ డోస్.. ఒకటి కాదు ఆరు జట్లు.. భారత్, పాకిస్థాన్ ల మ్యాచ్ పై ఉత్కంఠ
Boxing Day Test: మెల్‌బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియాలు బాక్సింగ్ డే టెస్టు ఆడనున్నాయి. అలాగే, పాకిస్తాన్-సౌతాఫ్రికాలు కూడా బాక్సింగ్ డే టెస్టు ఆడనున్నాయి. భారత్, పాకిస్థాన్ ల మ్యాచ్ లపై ఉత్కంఠ నెలకొంది.
Boxing Day Test, Rohit Sharma, Babar Azam, Rashid Khan,
Boxing Day Test: 2024 క్రికెట్ అభిమానులకు బాక్సింగ్ డే రోజు గొప్ప ట్రీట్ సిద్ధంగా ఉంది. క్రిస్మస్ సెలవుల్లో ప్రతిరోజూ క్రికెట్ చూసే అవకాశంతో పాటు మూడు బాక్సింగ్ డే అంతర్జాతీయ మ్యాచ్ లను చూడవచ్చు. డబుల్ ధమాకాకు బదులు ఈ సారి ట్రిఫుల్ డోస్ సిద్ధంగా ఉంది. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, జింబాబ్వే జట్లు బాక్సింగ్ డే టెస్టులు ఆడనున్నాయి. దీంతో క్రికెట్ లవర్స్ కు ఈ సారి బాక్సింగ్ డే మరింత గొప్ప పండగనే చెప్పాలి. ఈ మ్యాచ్ ల గురించిన వివరాలు మీకోసం.
భారత్, ఆస్ట్రేలియా మధ్య బిగ్ ఫైట్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు జరిగాయి. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించగా, ఆస్ట్రేలియా అడిలైడ్‌లో జరిగిన రెండో మ్యాచ్ లో కంగారు టీమ్ గెలిచింది. ఈ విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది.
ఇప్పుడు మెల్‌బోర్న్ వేదికగా బ్యాక్సింగ్ డే రోజున నాల్గో టెస్టు జరగనుంది. ఈ కీలక మ్యాచ్ ఉత్కంఠను పెంచింది. టెస్ట్ మొదటి రోజు అండే డిసెంబర్ 26న దాదాపు 1 లక్ష మంది అభిమానులు మ్యాచ్ చూడటానికి స్టేడియంకు రానున్నారు. అన్ని టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ దృష్ట్యా ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం.
Jasprit Bumrah-Travis Head
భారత్-ఆస్ట్రేలియా బాక్సిండ్ డే టెస్టు మ్యాచ్ వివరాలు:
మ్యాచ్: భారత్ vs ఆస్ట్రేలియా 4వ టెస్ట్
వేదిక: మెల్బోర్న్ ఎంసీజీ స్టేడియం
తేదీ,సమయం: 2024 డిసెంబర్ 26, 5AM IST.
మీరు మ్యాచ్‌ను ఎక్కడ చూడవచ్చు: స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+ హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో చూడవచ్చు.
పాకిస్థాన్-దక్షిణాఫ్రికా బాక్సింగ్ డే టెస్టు
పాకిస్థాన్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఆఫ్రికా జట్టు కైవసం చేసుకుంది. పాకిస్థాన్ వన్డే సిరీస్‌లో పునరాగమనం చేసి 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగాల్సి ఉంది. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే దక్షిణాఫ్రికా పటిష్టంగా కనిపిస్తున్నా పాకిస్థాన్ జట్టు మాత్రం ఎప్పుడూ ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది. మరి ఈ మ్యాచ్‌లో ఏం జరుగుతుందో చూడాలి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ సమీకరణాన్ని పరిగణనలోకి తీసుకుంటే, భారత అభిమానులు తమకు ఇష్టం లేకపోయినా ఈ సిరీస్‌ను పాకిస్తాన్ గెలవాలని కోరుకుంటున్నారు. ఇలాంటి ఫలితం టీమిండియాకు పాయింట్ల పట్టికలో లాభం చేకూరుస్తుంది.
పాకిస్తాన్-సౌతాఫ్రికా బాక్సింగ్ డే టెస్టు వివరాలు:
మ్యాచ్: దక్షిణాఫ్రికా vs పాకిస్థాన్ 1వ టెస్ట్
స్థలం: సెంచూరియన్, సౌతాఫ్రికా
తేదీ,సమయం: 2024 డిసెంబర్ 26, 1:30 PM IST.
మీరు మ్యాచ్‌ను ఎక్కడ చూడవచ్చు: భారతదేశంలో టీవీలో స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్, జియో సినిమా యాప్, వెబ్‌సైట్‌లో మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో చూడవచ్చు.
Rashid Khan
జింబాబ్వే-ఆఫ్ఘనిస్తాన్ బాక్సింగ్ డే టెస్టు
3 టీ20ల సిరీస్‌తో పాటు 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌ల కోసం ఆఫ్ఘనిస్థాన్ జట్టు జింబాబ్వే పర్యటనలో ఉంది. హరారేలో టీ20, వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఈ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్‌ను 2-1తో, వన్డే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇప్పుడు రెండు టెస్టులు బులవాయోలో జరగనున్నాయి. అఫ్గానిస్థాన్ ఫామ్ అద్భుతంగా ఉన్నప్పటికీ టెస్టుల్లో తమను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ ఫార్మాట్‌లో జట్టు అద్భుతంగా ఇప్పటివరకు ఏమీ చేయలేకపోయింది. జింబాబ్వేతో జరిగే ఈ మ్యాచ్ అంత సులభం కాదు. ఈ మ్యాచ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పరిధిలో లేదు.
జింబాబ్వే-ఆఫ్ఘనిస్తాన్ బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్ వివరాలు
మ్యాచ్: జింబాబ్వే vs ఆఫ్ఘనిస్తాన్ 1వ టెస్ట్
స్థలం: బులవాయో
తేదీ, సమయం: 2024 డిసెంబర్ 26, 1:30 PM IST
మీరు మ్యాచ్‌ను ఎక్కడ చూడవచ్చు: మ్యాచ్‌ను ఆన్‌లైన్‌లో ఫ్యాన్‌కోడ్ యాప్, వెబ్‌సైట్‌లో చూడవచ్చు.