MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • hat trick in T20 Blast: బెన్ సాండర్సన్ సునామీ.. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు

hat trick in T20 Blast: బెన్ సాండర్సన్ సునామీ.. ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు

hat trick in T20 Blast: విటాలిటీ బ్లాస్ట్‌లో బెన్ సాండర్సన్ ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో 6 వికెట్లు తీసి నార్తాంప్టన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 09 2025, 03:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బ్యాటర్స్ ను చెడుగుడు ఆడుకున్న బెన్ సాండర్సన్
Image Credit : X/@NorthantsCCC

బ్యాటర్స్ ను చెడుగుడు ఆడుకున్న బెన్ సాండర్సన్

hat trick in T20 Blast: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న విటాలిటీ బ్లాస్ట్ 2025 టోర్నమెంట్‌లో నార్తాంప్టన్‌షైర్ బౌలర్ బెన్ సాండర్సన్ అదిరిపోయే బౌలింగ్ ప్రదర్శనతో మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. వార్సెస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో బెన్ సాండర్స్ ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీశాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హ్యాట్రిక్ తో పాటు మొత్తం 6 వికెట్లు తీసిన బెన్ సాండర్సన్
Image Credit : X/@NorthantsCCC

హ్యాట్రిక్ తో పాటు మొత్తం 6 వికెట్లు తీసిన బెన్ సాండర్సన్

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నార్తాంప్టన్‌షైర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో దిగిన వార్సెస్టర్‌షైర్ జట్టు 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించినది బెన్ సాండర్సన్. ఒక హ్యాట్రిక్ తో పాటు ఒకే ఓవర్ లో 4 వికెట్లు తీసుకున్నాడు.

35
బెన్ సాండర్సన్ అద్భుత బౌలింగ్
Image Credit : X/@NorthantsCCC

బెన్ సాండర్సన్ అద్భుత బౌలింగ్

బెన్ సాండర్సన్ తన నాలుగు ఓవర్ల బౌలింగ్ లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 6 వికెట్లు తీసుకున్నాడు. అతని అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టుకు దడపుట్టించాడు.

వార్సెస్టర్‌షైర్ బ్యాటర్లను సాండర్సన్ తన సూపర్ బౌలింగ్‌తో దెబ్బకొట్టాడు. ముఖ్యంగా 19వ ఓవర్‌లో జరిగిన సంఘటన క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరిచింది.

45
ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన బెన్ సాండర్సన్
Image Credit : X/@NorthantsCCC

ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన బెన్ సాండర్సన్

ఈ మ్యాచ్ లో బెన్ సాండర్సన్ ఒకే ఓవర్ లో నాలుగు వికెట్లు తీసకున్నాడు. 19 ఓవర్ తొలి బంతికి టామ్ హీన్లీ ఔట్ చేశాడు. రెండో బంతికి ఒక రన్ వచ్చింది. మూడో బంతి డాట్ బాల్ అయింది. నాలుగవ బంతికి బెన్ డ్వార్షుయిస్ ఔట్ అయ్యాడు. ఐదవ బంతికి ఆడమ్ ఫించ్ ఔట్ అయ్యాడు. దీంతో స్టేడియంలో ఒకటే ఉత్కంఠ. హ్యాట్రిక్ వస్తుందా అని. అనుకున్నట్టుగానే అద్భుతమైన ఆరవ డెలివరీతో జాకబ్ డఫీని అవుట్ చేసి బెన్ సాండర్సన్ హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

ఈ విధంగా ఒకే ఓవర్‌లో వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టి హ్యాట్రిక్‌ సాధించిన బెన్ సాండర్సన్.. నార్తాంప్టన్‌షైర్‌కు అద్భుత విజయం అందించాడు.

55
సాండర్సన్ vs వార్సెస్టర్‌షైర్: మ్యాచ్ స్కోర్ బోర్డ్
Image Credit : X/@NorthantsCCC

సాండర్సన్ vs వార్సెస్టర్‌షైర్: మ్యాచ్ స్కోర్ బోర్డ్

• నార్తాంప్టన్‌షైర్: 190/8 (20 ఓవర్లు)

• వార్సెస్టర్‌షైర్: 159 ఆలౌట్

• ఫలితం: నార్తాంప్టన్‌షైర్ 31 పరుగులతో గెలిచింది

ఈ విజయం తర్వాత, బెన్ సాండర్సన్ ప్రదర్శనపై అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విటాలిటీ బ్లాస్ట్‌లో ఇది ఇప్పటివరకు కనిపించిన అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనల్లో ఒకటిగా గుర్తింపు పొందుతోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇంటర్నేషనల్ క్రికెట్లో 35,117 బంతులు, 5850 ఓవర్లు.. కెరీర్లో ఒక్క నోబాల్ వేయని స్టార్ బౌలర్, ఎవరో తెలుసా?
Recommended image2
IND vs WI 3rd T20: వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. సిరీస్‌లో టీమిండియా ఆధిక్యం
Recommended image3
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Related Stories
Recommended image1
IND vs ENG: గిల్ కెప్టెన్సీలో యంగ్ ప్లేయర్లతో కొత్త ఉత్సాహం.. ఇంగ్లాండ్‌ను టీమిండియా మట్టికరిపిస్తుందా?
Recommended image2
india: టీ20 ప్రపంచకప్‌ 2026కు యంగ్ ప్లేయర్లతో భారత జట్టు.. స్టార్లకు షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved