Virat Kohli: విరాట్, రోహిత్ విషయంలో.. బీసీసీ తీరుపై అసంతృప్తి.
భారత క్రికెట్‌లోని ఇద్దరు దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉన్నపలంగా ఇద్దరు స్టార్ క్రికెటర్లు గుడ్ బై చెప్పడం అభిమానులను మాత్రమే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. వీరిద్దరి రిటైర్మెంట్‌పై తాజాగా అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశారు.

Virat and Rohith
విరాట్, రోహిత్ రిటైర్మెంట్ వ్యవహారం అందరినీ షాక్‌కి గురి చేసింది. కేవలం ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు స్టార్ క్రికెటర్లు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఇది ఇండియన్ బ్యాటింగ్ లైనప్‌లో గ్యాప్‌ను తీసుకొచ్చింది. మరీ ముఖ్యంగా జూన్‌లో ప్రారంభమయ్యే ఇంగ్లండ్ టూర్ ముందు ఈ నిర్ణయం తీసుకోవడం ఇబ్బందికర అంశంగానే చెప్పొచ్చు.
anil kumble
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, BCCI తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు అభిమానుల మధ్య ఫీల్డ్‌లో సరైన వీడ్కోలు పొందాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
Virat Kohli (Photo: ICC)
“రోహిత్ శర్మ, తరువాత విరాట్ కోహ్లీ టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పారు. వీళ్లిద్దరికీ మైదానంలో గొప్ప వీడ్కోలు దక్కాల్సింది. ఇది సోషల్ మీడియా యుగమే అయినా, అభిమానులు ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉండాల్సింది. అలాంటి తరుణం వారికి దక్కకపోవడంపై సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది,” అని కుంబ్లే అన్నారు.
ఇది కేవలం వీడ్కోలే కాక, భారత జట్టులో ఒక పెద్ద శూన్యతకు దారి తీసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్ పర్యటన భారతదేశానికి గత దశాబ్ద కాలంగా ఒక సవాలుగా మారిందని, ఇప్పుడు ఇద్దరు కీలక ఆటగాళ్లు లేనప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని అన్నారు.
“విరాట్ భారత టెస్ట్ జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్. రోహిత్ కూడా కొన్నాళ్లుగా నాయకత్వం వహించారు. వీరిలో కనీసం ఒకరు జట్టులో ఉండాల్సింది. సెలెక్టర్లు కూడా ఈ నిర్ణయానికి ఆశ్చర్యపోయి ఉండొచ్చు,” అని అన్నారు. ఇప్పుడు శుభ్‌మన్ గిల్ జట్టు నూతన కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. జూన్ 20 నుంచి మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి.