AUS vs IND: బాక్సింగ్ డే టెస్ట్.. బుమ్రాకు భయపడలేదు.. అతను 'ప్రపంచంలోని బెస్ట్ బ్యాటర్' : గ్రెగ్ చాపెల్
IND vs AUS: ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ vs ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లో మొదటి మూడు టెస్టుల్లో రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో 409 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు.
Jasprit Bumrah-Travis Head
AUS vs IND: మెల్‌బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియాలు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాల్గో టెస్టు మ్యాచ్ ను ఆడనున్నాయి. కీలకమైన ఈ మ్యాచ్ కు ముందు ఆసీస్ లెజెండరీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ట్రావిస్ హెడ్‌ను చాపెల్ "ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాటర్" అని ప్రశంసించాడు. అతని భయంలేని అద్భుతమైన బ్యాటింగ్ విధానాన్ని కొనియాడాడు. మరీ ముఖ్యంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కొన్న తీరును ప్రశంసించాడు.
Travis head Hundred
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్లు ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడుతున్నాయి. మొదటి మూడు టెస్టు మ్యాచ్ లు పూర్తియ్యాయి. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించగా, ఆస్ట్రేలియా అడిలైడ్‌లో విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న నాలుగో మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకం కావడంతో ఈ మ్యాచ్ ఉత్కంఠ రేపుతోంది.
తొలి మూడు మ్యాచ్ లలో ట్రావిస్ హెడ్ రెండు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీతో 409 పరుగులు చేసి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఒక టెస్ట్ బ్యాటర్‌గా హెడ్ విజయానికి అతని ముక్కుసూటి టెక్నిక్, ఏ బౌలింగ్ అయినా సరే భయం లేకుండా దూకుడుగా ఆడే మనస్తత్వమే కారణమని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ చాపెల్ పేర్కొన్నాడు.
Travis Head Batting
"ఈ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రాపై హెడ్ ప్రదర్శనలు అతని నిర్భయ బ్యాటింగ్ విధానాన్ని ఉదహరించాయి. చాలా మంది బ్యాట్స్‌మెన్ బుమ్రా అసాధారణమైన, పదునైన పేస్ బౌలింగ్ కారణంగా భయపడిపోతున్నారు. కానీ, ట్రావిస్ హెడ్ ఇతర బౌలర్‌ల మాదిరిగానే బుమ్రా బౌలింగ్ ను ఏదుర్కొన్నాడని" అని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌లో చాపెల్ పేర్కొన్నాడు.
Travis Head
ట్రావిస్ హెడ్ అద్భుతమైన నైపుణ్యాలు సాధించి ప్రస్తుతం ప్రపంచంలోని టాప్ క్రికెటర్ గా ఎదిగాడని చాపెల్ పేర్కొన్నాడు. "అతని కథ కేవలం సవాళ్లను అధిగమించడం గురించి కాదు, కానీ అతని ముఖ్య లక్షణం చెప్పాలంటే బ్యాటింగ్ శైలిలో మార్పు.. సరళతను స్వీకరించడం. 2021-22 సిరీస్‌లో ఇంగ్లండ్‌పై హెడ్ చేసిన 152 పరుగులను తన కెరీర్‌లో "టర్నింగ్ పాయింట్"గా చాపెల్" అభివర్ణించాడు.
Mitchell Marsh-Travis Head
"2021 యాషెస్‌లో టర్నింగ్ పాయింట్ వచ్చింది. బ్రిస్బేన్‌లో హెడ్ 152 పరుగులతో ఎదురుదాడికి దిగడం అద్భుతమైన ఇన్నింగ్స్. 195/5 పరుగులతో ఉండగా, అతను సుడిగాలి ఇన్నింగ్స్‌తో గేమ్‌ను మార్చాడు, ప్రత్యర్థి బౌలర్లను చిత్తుచేసి ఆస్ట్రేలియాకు అనుకూలంగా మ్యాచ్ ను తీసుకువచ్చాడు" అని తెలిపాడు.
Image Credit: Getty Images
అప్పటి నుంచి ట్రావిస్ హెడ్ బలమైన క్రికెటర్ గా మారాడనీ, ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన బ్యాట్స్‌మెన్‌లలో ఒకడిగా పరిణామం చెందాడని తెలిపాడు. 2022 నుండి అతని ఇన్నింగ్స్ లు ఇదే నొక్కి చెబుతున్నాయన్నారు. 56.25 సగటుతో 1800 పరుగులు, 75.6 స్ట్రైక్ రేట్‌తో ఆరు సెంచరీలు ఇవి కేవలం ఆకట్టుకునే గణాంకాలు మాత్రమే కాదు, ఒత్తిడిలో రాణించగల అతని సామర్థ్యానికి నిదర్శనమని చాపెల్ తెలిపాడు. అలాగే, ట్రావిస్ గత మూడు సంవత్సరాలలో ప్రపంచ క్రికెట్‌లో అత్యంత మెరుగైన బ్యాటర్ అని తాను నమ్ముతున్నానని చెప్పాడు.