Asia Cup 2025: అలా అయితే ఆసియ్ కప్‌లో భారత్‌దే గెలుపు.. సెహ్వాగ్ కీలక వ్యాఖ్యలు
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, ఆసియా కప్ 2025 ముందు వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లకు ఇది అత్యంత అవసరమని, వారు ఫిట్‌గా ఉంటే భారత్ పెద్ద టోర్నీల్లో విజయావకాశాలు పెరుగుతాయని ఆయన చెప్పారు.

బౌలర్లకు వర్క్‌లోడ్ అవసరమా?
ఇటీవలే ముగిసిన ఆండర్సన్–తెండూల్కర్ ట్రోఫీ అనంతరం వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. జస్ప్రీత్ బుమ్రా కేవలం మూడు టెస్టుల్లో మాత్రమే ఆడగా, మహ్మద్ సిరాజ్ ఐదు టెస్టులు ఆడటంపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. బ్యాట్స్‌మెన్‌కి వర్క్‌లోడ్ పెద్ద సమస్య కాదని, కానీ ఫాస్ట్ బౌలర్లకు మాత్రం ఇది కీలకం అని చెప్పారు. సరైన విధంగా నిర్వహిస్తే వారు ఎక్కువ కాలం ఆడగలరని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇండియాకు గేమ్‌చేంజర్స్ ఎవరు?
సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ కోసం బుమ్రా అందుబాటులో ఉండరనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే అతను స్క్వాడ్‌లో ఎంపిక కావడంతో ఆ ఊహాగానాలు ముగిశాయి. బుమ్రాతో పాటు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి భారత్‌కి గేమ్‌చేంజర్స్ అవుతారని సెహ్వాగ్ అభిప్రాయపడ్డారు.
Game-changers, workload management and more... 👀
Sehwag breaks it all down ahead of the #ACCMensAsiaCup2025 🤩
Catch all the action LIVE from Sept 9 on Sony Sports Ten 1, Sony Sports Ten 3 (Hindi), Sony Sports Ten 4 (Tamil & Telugu), Sony Sports Ten 5 & Sony LIV.… pic.twitter.com/3tw1h7nYL9— Sony Sports Network (@SonySportsNetwk) August 26, 2025
బుమ్రా, అభిషేక్, చక్రవర్తిపై దృష్టి
గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. 15 వికెట్లు తీసి, భారత్‌కి టైటిల్ గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మరోవైపు రోహిత్ శర్మ టీ20ల నుంచి రిటైర్ అయిన తర్వాత ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ 17 మ్యాచ్‌ల్లో 535 పరుగులు సాధించి తన ప్రతిభ చూపించాడు. రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు కొట్టి, 193 స్ట్రైక్‌రేట్‌తో ఆకట్టుకున్నాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఇటీవల తన బౌలింగ్‌లో మంచి ప్రతిభ కనబరిచి భారత్‌కి ప్రధాన వికెట్ టేకర్‌గా నిలుస్తున్నారు.
ఆసియా కప్‌లో భారత్ ప్రయాణం
భారత్ ఆసియా కప్ 2025లో గ్రూప్ Aలో ఉంది. యుఏఈ, పాకిస్తాన్, ఒమాన్ జట్లతో పోటీ పడనుంది. సెప్టెంబర్ 10న యుఏఈతో తొలి మ్యాచ్ ఆడుతుంది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్‌తో హై వోల్టేజ్ పోరు ఉండగా, సెప్టెంబర్ 19న ఒమాన్‌తో గ్రూప్ దశ చివరి మ్యాచ్ ఆడనుంది.
భారత్ జట్టు (ఆసియా కప్ 2025)
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకూ సింగ్.