టీ20 వరల్డ్ కప్ 2024 లో ఈ ఐదుగురు భారత ప్లేయర్లపైనే అందరికన్ను.. !
T20 World Cup 2024 : అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జరిగే టీ20 వరల్డ్ కప్ 2024 లో సత్తా చాటాలని చూస్తోంది భారత్. ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలనుకుంటున్న భారత జట్టులోని యంగ్ ప్లేయర్లు ఎలా రాణిస్తారనే ఆసక్తి నెలకొంది.
T20 World Cup 2024 : 2024లో జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను దక్కించుకోవాలని చూస్తోంది భారత్. 2007 ఎంఎస్ ధోని కెప్టెన్సీ విజేతగా నిలిచి టీమిండియా.. ఇప్పుడు ఈ మెగా టోర్నీ టైటిల్ ను దక్కించుకోవాలని రోహిత్ శర్మ కెప్టెన్సీలో అమెరికా చేరుకుంది. అయితే, ఈ ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు పలువురు ప్లేయర్లు ఏలా రాణిస్తారనేది ఆసక్తికరంగా ఉంది. మరీ ముఖ్యంగా ఐదురుగు ప్లేయర్లపైనే అందరి కన్ను పడింది. వారిలో..
Cricketer Yashasvi Jaiswal Buys Rs Five Crore Flat In Mumbai
యశస్వి జైస్వాల్:
టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌పై అద్భుతమైన ప్రదర్శనతో దుమ్మురేపిన భారత యంగ్ ప్లేయర్, ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈ టీ20 ప్రపంచ కప్ లోనూ తనదైన ముద్రవేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో జైస్వాల్ స్ట్రైక్ రేట్ 161.93, కాగా మొత్తంగా టీ20 కెరీర్ లో దాదాపు 150కి పైగా స్ట్రైక్ రేటుతో పరుగులు చేస్తున్నాడు. ఐపీఎల్ జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, గెరాల్డ్ కోయెట్జీ వంటి స్టార్ల బౌలింగ్ ను చీల్చిచెండాడుతూ 60 బంతుల్లో సెంచరీ (104* పరుగులు) చేసి జైపూర్‌లో ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇప్పుడు వరల్డ్ కప్ లో భారత జట్టు జైస్వాల్ పై భారీగా అంచనాలు పెట్టుకుంది.
రిషబ్ పంత్:
డిసెంబర్ 2022లో జరిగిన ఘోర కారు ప్రమాదం తర్వాత అంటే దాదాపు 17 నెలల తర్వాత భారత జట్లు తరఫున రిషబ్ పంత్ బరిలోకి దిగబోతున్నాడు. ప్రమాదం తర్వాత అతని కుడి మోకాలికి మూడు శస్త్రచికిత్సలు అవసరం అయినప్పటికీ పంత్ క్రికెట్ పునరావాసం అద్భుతంగా ఉంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్ లో వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా మంచి ప్రదర్శన చేశాడు. 13 మ్యాచ్‌లలో 155.40 స్ట్రైక్ రేట్ కొనసాగిస్తూ.. మూడు అర్ధశతకాలతో 446 పరుగులు చేశాడు పంత్.
സഞ്ജു സാംസണ്?
సంజు శాంసన్:
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అయిన సంజూ శాంసన్ భారత్ తరఫున అనేక అవకాశాలు దక్కించుకున్నాడు కానీ, అందుకు తగిన అంచనా ఫలితాలు రాబట్టలేకపోయాడు. అయితే, ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న సంజూ శాంసన్ వరల్డ్ కప్ లో సత్తా చాటాలని చేస్తున్నాడు. ఐపీఎల్ 2024లో రాజస్తాన్ రాయల్స్ ను అద్భుతంగా ముందుకు నడిపించిన సంజూ శాంసన్ కెప్టెన్ గా, బ్యాటర్ గా అద్భుత ప్రదర్శన చేశాడు. ఐపీఎల్ లో శాంసన్ 15 మ్యాచ్‌లలో 153 కంటే ఎక్కువ స్ట్రైక్ రేటుతో 531 పరుగులు చేశాడు. తుది జట్టులో చోటుదక్కితే ఎలా రాణిస్తాడనేది చూడాలి.
kuldeep yadav 1.
కుల్దీప్ యాదవ్:
కుల్దీప్ యాదవ్ 34 ఇన్నింగ్స్‌లలో 35 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 6.75 ఎకానమీ రేటుతో 59 వికెట్లు పడగొట్టాడు. స్పిన్ బౌలింగ్‌లో అతని నైపుణ్యం కారణంగా, అతను ప్రత్యర్థులకు ప్రమాదకరమైన బౌలర్. ఆట వేగాన్ని మార్చగల బౌలర్, అలాగే, బ్యాటన్ తో రాణించగలడు. అతని స్పిన్ బౌలింగ్ అమెరికాలో నిర్మించిన తాత్కాలిక స్టేడియాల పిచ్‌లపై అనుకూల ఫలితాలు సాధిస్తుందని భారత జట్టుకు అంచనాలు ఉన్నాయి.
జస్ప్రీత్ బుమ్రా:
భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన ప్రత్యర్థులను సులువుగా మట్టికరిపించగల బౌలర్. టీమ్ ఇండియా కోసం అనేక మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిచిపించాడు. 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అద్భుతమైన బౌలింగ్ తో మరోసారి మెరిశాడు. బుమ్రా యూఎస్ఏ, వెస్టిండీస్‌లో తక్కువ సంఖ్యలో అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆడాడు. కాబట్టి అతను అక్కడి పరిస్థితులను ఎలా అనుకూలంగా మార్చుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.