MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ఫాస్టెస్ట్ హండ్రెడ్ చేశాడు.. ఐపీఎల్‌కు వస్తాడా..? పుజారాపై టీమిండియా వికెట్ కీపర్ కామెంట్స్

ఫాస్టెస్ట్ హండ్రెడ్ చేశాడు.. ఐపీఎల్‌కు వస్తాడా..? పుజారాపై టీమిండియా వికెట్ కీపర్ కామెంట్స్

BANvsIND: బంగ్లాదేశ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా మిస్టర్ డిపెండెబుల్ ఛతేశ్వర్ పుజారా  తన కెరీర్ లో మూడున్నరేండ్ల తర్వాత  సెంచరీ చేశాడు.  తొలి ఇన్నింగ్స్ లో మిస్ అయినా రెండో ఇన్నింగ్స్ లో శతకం బాదాడు పుజారా. 

2 Min read
Author : Srinivas M
Published : Dec 17 2022, 01:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

2019  జనవరి తర్వాత  మళ్లీ  మూడంకెల స్కోరు చేసిన ఛతేశ్వర్  పుజారా తన కెరీర్ లోనే అత్యంత  వేగంగా  సెంచరీ చేశాడు.   బంగ్లాదేశ్ తో  జరుగుతున్న తొలిటెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో పది పరుగుల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్న పుజారా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా  ఆడాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రెండో ఇన్నింగ్స్ లో  పుజారా.. 130 బంతుల్లో సెంచరీ చేశాడు. తన అంతర్జాతీయ  క్రికెట్ కెరీర్ లో పుజారా ఇన్ని తక్కువ బంతులలో సెంచరీ  చేయడం ఇదే ప్రథమం. అతడికి ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ.  తొలి ఇన్నింగ్స్ లో 90 పరుగులు చేసిన  పుజారా.. రెండో ఇన్నింగ్స్ లో 102 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 

36

పుజారా సెంచరీ తర్వాత  టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్   ఈ సౌరాష్ట్ర బ్యాటర్ పై ప్రశంసలు కురిపించాడు. పుజారా ఐపీఎల్ కెరీర్ గురించి  కార్తీక్ మాట్లాడాడు.  క్రిక్ బజ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  కార్తీక్ మాట్లాడుతూ..  ‘వాస్తవంగా చెప్పాలంటే  పుజారా ఐపీఎల్ కు వస్తాడని నేనైతే అనుకోవడం లేదు.  గతంలో పలుమార్లు ఐపీఎల్ ఆడేందుకు యత్నించాడు.. 

46

అయితే   ఈ తరహా క్రికెట్ తనకు సూట్ కాదని పుజారా రియలైజ్ అయ్యాడు.  అందుకే దాని గురించి పెద్దగా ఆలోచించడు. ఈ ఏడాది చాలాకాలం పుజారా ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడేందుకు సమయం వెచ్చించాడు. ఇండియా ఆటగాళ్లంతా ఐపీఎల్ లో బిజీగా ఉంటే   పుజారా మాత్రం  తన స్కిల్స్ మెరుగుపరుచుకున్నాడు. 

56

ఈ వయసులో పుజారా ప్రత్యేకించి నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. మనం ఎక్కడ ఆటను ఆస్వాదిస్తున్నామనేదే   ముఖ్యమైనది. ఇంగ్లాండ్ లో కౌంటీ ఆడుతూ తన కుటుంబాన్ని కూడా అక్కడికే తీసుకెళ్లాడు పుజారా. అందుకే అతడు ఐపీఎల్ కు దూరంగా ఉన్నాడు..’ అని చెప్పాడు. 

66

ఈ ఏడాది స్వదేశంలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్ లో పుజారాకు చోటు దక్కలేదు. దీంతో పుజారా.. కౌంటీలకు ఆడాడు.  కౌంటీలలో సస్సెక్స్ తరఫున ఆడిన నయా వాల్.. 8 మ్యాచ్ లలో 1,094 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు కూడా ఉన్నాయి.  కౌంటీ డివిజన్ 2 ఛాంపియన్షిప్ లో  మెరుపులు మెరిపించిన పుజారా..

About the Author

SM
Srinivas M
భారత దేశం
 

Gold & Metal Rates

Loading rates…

All cities ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Mumbai Indians Captains: సచిన్ నుంచి రోహిత్ వరకు.. ముంబై ఇండియన్స్‌ను ఏలిన కెప్టెన్ల పూర్తి లిస్ట్ ఇదే
Recommended image2
India vs New Zealand: టీమిండియాకు హెన్రీ, జేమిసన్ షాక్.. క్రైస్ట్‌చర్చ్ టెస్టులో కష్టాల్లో టీమిండియా
Recommended image3
Rohit Sharma: ముంబై ఇండియన్స్ అభిమానులకు పూనకాలే.. మళ్లీ కెప్టెన్‌గా రోహిత్ శర్మ రీఎంట్రీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved