MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • ఇదేం విధ్వంసంరా బాబూ... అభిషేక్ పిచ్చకొట్టుడుకు ఈ రికార్డులన్నీ షేక్

ఇదేం విధ్వంసంరా బాబూ... అభిషేక్ పిచ్చకొట్టుడుకు ఈ రికార్డులన్నీ షేక్

అభిషేక్ శర్మ పంజాబ్ కింగ్స్‌పై వేగవంతమైన సెంచరీతో అదరగొట్టాడు. ఈ ఒక్క సెంచరీతో అతడు చాలా రికార్డులు బద్దలు కొట్టాడు. అలా అభిషేక్ దెబ్బకు షేక్ అయిన ఆ రికార్డులేంటో తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : Apr 13 2025, 04:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Abhishek Sharma

Abhishek Sharma

Abhishek Sharma Records : ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 247 పరుగులు చేసి విజయం సాధించింది. 247 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. వరుస ఓటముల తర్వాత సన్ రైజర్స్ కు మంచి విజయం దక్కింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
అభిషేక్ శర్మ రికార్డులు

అభిషేక్ శర్మ రికార్డులు

ఓపెనర్ ట్రావిస్ హెడ్ 37 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్లతో 66 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ సిక్సర్ల వర్షం కురిపించాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ కేవలం 55 బంతుల్లో 141 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అభిషేక్ 14 ఫోర్లు, 10 సిక్సర్లు బాదాడు.

అభిషేక్ శర్మ అద్భుతమైన ఆట వరుస ఓటములతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును అద్భుత విజయం సాధించేలా చేసింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ పలు రికార్డులు బద్దలు కొట్టాడు.

అభిషేక్ శర్మ ఈ మ్యాచ్‌లో కేవలం 40 బంతుల్లో సెంచరీ చేశాడు, ఇది ఐపీఎల్‌లో ఒక భారతీయుడి మూడవ వేగవంతమైన సెంచరీ, మొత్తంగా ఐపిఎల్ చరిత్రలోనే ఇది ఐదవ వేగవంతమైనది.

 

34
అభిషేక్ శర్మ రికార్డులు

అభిషేక్ శర్మ రికార్డులు

అభిషేక్ శర్మ తన ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు కొట్టాడు. ఇది ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో ఒక భారతీయ ఆటగాడికి రెండవ అత్యధిక సిక్సర్లు. ఒక ఇన్నింగ్స్‌లో భారతీయ ఆటగాడు కొట్టిన అత్యధిక సిక్సర్లు 11. ఐపీఎల్ 2010లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నప్పుడు రాజస్థాన్ రాయల్స్‌పై మురళి విజయ్ 127 పరుగులలో 11 సిక్సర్లు నమోదు చేశాడు. అభిషేక్ దూకుడు చూసి ఈ రికార్డు బద్దలవుతుంది అందరూ అనుకున్నారు. కానీ అతడు రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

44
అభిషేక్ శర్మ రికార్డులు

అభిషేక్ శర్మ రికార్డులు

అంతేకాకుండా అభిషేక్ శర్మ ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన 3వ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. పంజాబ్ కింగ్స్‌పై వేగవంతమైన సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా రికార్డు సాధించాడు. అభిషేక్ శర్మ చేసిన 141 పరుగులే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు చేసిన అత్యధిక పరుగులు. 193.84 స్ట్రైక్ రేట్‌తో ఆడిన అతను టి20 క్రికెట్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాడిగా రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
హైదరాబాద్
క్రీడలు
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved