- Home
- Sports
- Cricket
- Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని 5 మ్యాచ్‌లు ఇవే..
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని 5 మ్యాచ్‌లు ఇవే..
ఛాంపియన్స్ ట్రోఫీ మొదలవ్వడానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీల్లో మరుపురాని 5 మ్యాచ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఛాంపియన్స్ ట్రోఫీలో మరుపురాని 5 మ్యాచ్‌లు
ఇండియా vs సౌతాఫ్రికా (2002)
2002లో జరిగిన ఇండియా vs సౌతాఫ్రికా ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియా బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ తన ఆఫ్ స్పిన్‌తో ఆటను మలుపు తిప్పాడు. కొలంబోలో సౌతాఫ్రికాపై ఉత్కంఠభరిత విజయంతో ఇండియాను 2002 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు తీసుకెళ్లాడు.
సెహ్వాగ్ హాఫ్ సెంచరీతో ఇండియా 261/9 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో సౌతాఫ్రికా 200/3తో మంచి ఫామ్ లో ఉన్న సమయంలో సెహ్వాగ్ ఆఫ్ స్పిన్ ఆటను మార్చింది. మార్క్ బౌచర్, జాక్ కాలిస్, లాన్స్ క్లూస్నర్ వంటి కీలక ఆటగాళ్లను ఔట్ చేసి ఇండియాను గెలిపించాడు.
వెస్టిండీస్ vs ఇంగ్లాండ్
వెస్టిండీస్ vs ఇంగ్లాండ్ (2004)
2004 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఇంగ్లాండ్ 217 పరుగులు చేసింది. వెస్టిండీస్ 8 వికెట్లకు 80 పరుగులతో కష్టాల్లో పడింది. చివరి రెండు వికెట్లతో 81 పరుగులు చేయాల్సి ఉంది.
అయితే అదే సమయంలో కోర్ట్నీ బ్రౌన్, ఇయాన్ బ్రాడ్‌షా అద్భుత భాగస్వామ్యంతో 71 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. వెస్టిండీస్ 7 బంతులు మిగిలి ఉండగానే తొలి ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది.
సౌతాఫ్రికా vs ఇంగ్లాండ్
సౌతాఫ్రికా vs ఇంగ్లాండ్ (2009)
2009 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ 323 పరుగులు చేసింది. ఓవైస్ షా 89 బంతుల్లో 98, ఇయాన్ మోర్గాన్ 34 బంతుల్లో 67 పరుగులు చేశారు. సౌతాఫ్రికా 301/9కే ఆలౌట్ అయింది.
ఈ సమయంలో జేమ్స్ అండర్సన్, స్టూవర్ట్ బ్రాడ్ చెరో 3 వికెట్లు తీసి సౌతాఫ్రికాను ఓడించారు. సౌతాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ సెంచరీ (134 బంతుల్లో 141) వృధా అయింది.
న్యూజిలాండ్ vs శ్రీలంక
న్యూజిలాండ్ vs శ్రీలంక (2013)
2013లో న్యూజిలాండ్ 1 వికెట్ తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్ లో శ్రీలంక 138 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ 80/6తో కష్టాల్లో పడింది. కానీ నాథన్ మెకల్లమ్ (32), టిమ్ సౌథీ (13) మెరుపులు మెరిపించి జట్టును గెలిపించారు. 36.4 ఓవర్లలో 9 వికెట్లకు న్యూజిలాండ్ గెలిచింది.
ఇండియా vs పాకిస్తాన్
ఇండియా vs పాకిస్తాన్ ఫైనల్ (2017)
2017లో ది ఓవల్‌లో జరిగిన ఇండియా పాకిస్తాన్ ఫైనల్‌ను ఎవరూ మర్చిపోలేరు. పాకిస్తాన్ 338 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ సెంచరీ (106 బంతుల్లో 114)తో భారీ స్కోర్ ను సాధించాడు.
అయితే టీమిండియా ఆ సమయంలో 30 ఓవర్లలో 158కే ఆలౌట్ అయి 180 పరుగుల తేడాతో ఓడిపోయింది. పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. ఇదే చివరి ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ మ్యాచ్ లో మహ్మద్ ఆమీర్, హసన్ అలీ చెరో 3 వికెట్లు తీశారు.
కాగా ప్రస్తుతం జరుగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా సత్తా చాటడం ఖాయమని. ఈసారి ట్రోఫీ మనదేనని టీమిండియా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.