- Home
- Sports
- Cricket
- ఇండియా మ్యాచులకు రూ.2500, వేరే మ్యాచులకు రూ.1000... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి టికెట్ల రేట్లు ఇవే...
ఇండియా మ్యాచులకు రూ.2500, వేరే మ్యాచులకు రూ.1000... వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి టికెట్ల రేట్లు ఇవే...
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అక్టోబర్ 5న అహ్మదాబాద్‌లో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ, నవంబర్ 19న మళ్లీ అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌తోనే ముగియనుంది..

దేశంలోని 10 నగరాల్లో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి సంబంధించిన టికెట్లు, ఆగస్టు 10 నుంచి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులోకి రాబోతున్నాయి... ఇ-టికెట్ ఎంట్రీ లేదని జై షా ప్రకటించడంలో ఆన్‌లైన్‌లో టికెట్ కొనుగోలు చేసినా, దాని ప్రింట్ అవుట్‌తో స్టేడియానికి రావాల్సి ఉంటుంది.
ఒక్కో స్టేడియానికి ఒక్కో విధమైన రేట్లలో టికెట్లు అందుబాటులో ఉండబోతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో లీగ్ మ్యాచులకు టికెట్లు రూ. 1500 నుంచి ప్రారంభం అవుతాయి...
సెమీ ఫైనల్ మ్యాచులకు రూ.2500 నుంచి టికెట్లు అందుబాటులో ఉండబోతున్నాయి. ఇండియా ఆడే లీగ్ మ్యాచులకు కనీస టికెట్ ధర రూ.1500- రూ.2500 నుంచి ప్రారంభం అవుతుంది. గరిష్టంగా రూ.40,000- రూ.45000 వరకూ వీఐపీ టికెట్లు అందుబాటులో ఉండబోతున్నాయి..
ఇండియా ఆడని మ్యాచులకు మాత్రం రూ.1000 నుంచే టికెట్లు అందుబాటులో ఉండబోతున్నాయి. అంటే హైదరాబాద్‌లో జరిగే 3 మ్యాచులు చూడాలంటే రూ.1000 ఉంటే సరిపోతుంది.
హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక, పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్, న్యూజిలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచులు జరగబోతున్నాయి...
లీగ్ మ్యాచులతో పోలిస్తే సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచులకు టికెట్ ధరలు ఎక్కువగా ఉండబోతున్నాయి. అహ్మదాబాద్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌కి ఇండియా అర్హత సాధిస్తే బ్లాక్‌లో టికెట్ ధరలు లక్షల రూపాయలు పలుకుతాయి..
ఇప్పటికే అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో జరగాల్సిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్, రీషెడ్యూల్ చేయబోతున్నట్టు సమచారం. అక్టోబర్ 15న దసరా నవరాత్రి ఉత్సవాలు మొదలుకాబోతున్నందున అక్టోబర్ 14న ఇండో-పాక్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.