- Home
- Automobile
- Cars
- TATA Punch: రూ. 6 లక్షలకే కళ్లు చెదిరే కారు.. ఫీచర్లు తెలిస్తే ఎగిరిగంతేస్తారు
TATA Punch: రూ. 6 లక్షలకే కళ్లు చెదిరే కారు.. ఫీచర్లు తెలిస్తే ఎగిరిగంతేస్తారు
TATA Punch: భారత ఆటో మొబైల్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న టాటా తాజాగా మార్కెట్లోకి కొత్త కారును తీసుకొచ్చింది. ఫేస్‌లిఫ్ట్ పేరుతో తీసుకొచ్చిన ఈ కారులో కళ్లు చెదిరే ఫీచర్లను అందించారు.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్
టాటా మోటార్స్ భారత మార్కెట్‌లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ అప్డేటెడ్ మోడల్ ప్రారంభ ధర రూ.5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. జనవరి 13 నుంచి దేశవ్యాప్తంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. మైక్రో SUV విభాగంలో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన పంచ్‌కు ఇది కీలకమైన అప్గ్రేడ్‌గా చెబుతున్నారు. ఈ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ ఎక్స్‌టర్, నిస్సాన్ మాగ్నైట్, రెనో కైగర్, మహీంద్రా XUV 3XO వంటి కార్లతో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ నేరుగా పోటీ పడనుంది.
హైలైట్‌గా నిలుస్తోన్న ఎక్స్‌టీరియర్
కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ లుక్ పరంగా మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. పంచ్ ఈవీ నుంచి ప్రేరణ పొందిన డిజైన్ ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది. రీడిజైన్ చేసిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్, కొత్త డీఆర్‌ఎల్స్ ముందు భాగానికి ఫ్రెష్ లుక్ ఇస్తాయి. స్పోర్టీ బంపర్స్, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్, అప్‌డేటెడ్ ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ వాహనానికి ప్రీమియం ఫీల్‌ను తీసుకొచ్చాయి. ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, రియర్ వాష్ వైపర్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇంటీరియర్ ఫీచర్లు, టెక్నాలజీపై ఫోకస్
ఇంటీరియర్ పరంగా టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ పూర్తిగా అప్‌డేట్ అయింది. ఇందులో 26.03 సెంటీమీటర్ల పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ అందించారు. 17.8 సెంటీమీటర్ల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డ్రైవర్‌కు అవసరమైన సమాచారం స్పష్టంగా చూపిస్తుంది.
360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆటో డిమ్మింగ్ IRVM వంటి ఫీచర్లు ఈ సెగ్మెంట్‌లో అరుదుగా కనిపించే అదనపు లాభాలు. ఈ మార్పులు కారును మరింత ఆధునికంగా మారుస్తున్నాయి.
భద్రత విషయంలో మరోసారి టాటా స్టాండర్డ్
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ప్రధాన బలం భద్రతే. ఈ మోడల్ భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగంలో 32 పాయింట్లకు గాను 30.58 పాయింట్లు రావడం విశేషం.
ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16 పాయింట్లలో 14.71 పాయింట్లు, సైడ్ మూవబుల్ బారియర్ టెస్ట్‌లో 16 పాయింట్లలో 15.87 పాయింట్లు సాధించింది. పిల్లల భద్రతకు సంబంధించిన చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49 పాయింట్లకు గాను 45 పాయింట్లు రావడం కుటుంబ వినియోగదారులకు మరింత భరోసాను ఇస్తుంది. 6 ఎయిర్‌బ్యాగులు స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.
ఇంజిన్ ఆప్షన్లు, వేరియంట్లు ఎవరి కోసం సరైన కారు?
టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్, 1.2 లీటర్ ఐటర్బో పెట్రోల్ ఇంజిన్, సీఎన్‌జీ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. మొత్తం ఆరు వేరియంట్లు మార్కెట్లోకి వచ్చాయి. మొదటిసారి కారు కొనాలనుకునే వారు, చిన్న కుటుంబాలు, సేఫ్టీకి అధిక ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులకు ఇది సరైన ఎంపికగా మారింది. సరసమైన ధరలో బలమైన నిర్మాణం, ఆధునిక ఫీచర్లు, విశ్వసనీయ టాటా బ్రాండ్ కలయికతో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ తన సెగ్మెంట్‌లో మరోసారి బెంచ్‌మార్క్‌గా నిలుస్తోంది.

