MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Automobile
  • Cars
  • Top Selling Cars: మారుతి, టాటా, నిస్సాన్ కార్ల సేల్స్ దెబ్బకి రికార్డులు బద్దలు.. నెంబర్ 1 ఎవరంటే?

Top Selling Cars: మారుతి, టాటా, నిస్సాన్ కార్ల సేల్స్ దెబ్బకి రికార్డులు బద్దలు.. నెంబర్ 1 ఎవరంటే?

Top Selling Cars: పండుగల సీజన్ ప్రారంభానికి ముందే దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ కాసుల వర్షం కురిపించింది. ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో గడిచిన సెప్టెంబర్ నెలలో ఊహించని వృద్ధి నమోదైంది. మారుతి సుజుకి, టాటా మోటార్స్, నిస్సాన్ ఇండియా రికార్డుల మోత మోగించాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Oct 09 2026, 12:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సెప్టెంబర్‌లో కార్ల అమ్మకాల మోత.. టాటా, మారుతి సుజుకి సేల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే
Image Credit : chatgpt

సెప్టెంబర్‌లో కార్ల అమ్మకాల మోత.. టాటా, మారుతి సుజుకి సేల్స్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

దేశీయ ఆటోమొబైల్ రంగానికి సెప్టెంబర్ నెల చాలా బాగా కలసివచ్చింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థలైన మారుతి సుజుకి, టాటా మోటార్స్, నిస్సాన్ ఇండియాలు తమ సేల్స్ గణాంకాలను వెల్లడించాయి. పండుగల సీజన్ ప్రారంభం కావడంతో వినియోగదారులు కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించారు. దీంతో ఈ కంపెనీల సేల్స్ గ్రాఫ్ భారీగా పైకి లేచింది. ప్రధానంగా మారుతి సుజుకి, టాటా మోటార్స్ కంపెనీలు సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఈ నెలలో ఏ కంపెనీ ఎన్ని కార్లు విక్రయించాయనే వివరాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మారుతి సుజుకి బంపర్ ధమాకా
Image Credit : maruti suzuki

మారుతి సుజుకి బంపర్ ధమాకా

భారత ఆటో మార్కెట్ లీడర్ మారుతి సుజుకి సెప్టెంబర్ నెలలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. కంపెనీ మొత్తం అమ్మకాలు 24.4 శాతం పెరిగి 2,36,013 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే సెప్టెంబర్ నెలలో కంపెనీ 1,89,665 యూనిట్లను మాత్రమే విక్రయించింది. మారుతి సుజుకి షేర్ మార్కెట్‌కు ఇచ్చిన సమాచారం ప్రకారం, దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు దాదాపు 37 శాతం పెరిగి 1,81,838 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇది 1,32,820 యూనిట్లుగా ఉంది. ఇక ఎగుమతుల విషయానికి వస్తే, కంపెనీ మొత్తం 44,219 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. గత ఏడాది ఇది 42,204 యూనిట్లుగా ఉంది.

35
టాటా మోటార్స్ రికార్డు సేల్స్
Image Credit : Gemini

టాటా మోటార్స్ రికార్డు సేల్స్

టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (TMPV) కూడా సెప్టెంబర్‌లో గట్టి పోటీ ఇచ్చింది. కంపెనీ మొత్తం అమ్మకాలు 15 శాతం పెరిగి 70,210 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కంపెనీ 60,907 వాహనాలను విక్రయించింది. ఈ మొత్తం అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) కూడా ఉన్నాయి. ఇక టాటా మోటార్స్ దేశీయ అమ్మకాలు 15 శాతం వృద్ధితో 68,810 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇవి 59,667 యూనిట్లుగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో టాటా ప్యాసింజర్ కార్ల విక్రయాలు 13 శాతం పెరిగి 1,400 యూనిట్లకు చేరాయి.

45
ఎలక్ట్రిక్ వాహనాల్లో టాటా దూకుడు
Image Credit : Asianet News

ఎలక్ట్రిక్ వాహనాల్లో టాటా దూకుడు

ఈవీ (EV) సెగ్మెంట్‌లో టాటా మోటార్స్ దూసుకుపోతోంది. దేశీయ, అంతర్జాతీయ వ్యాపారంతో కలిపి టాటా ఎలక్ట్రిక్ వాహనాల మొత్తం అమ్మకాలు సెప్టెంబర్‌లో ఏకంగా 67 శాతం పెరిగాయి. కంపెనీ 15,384 ఈవీ యూనిట్లను విక్రయించింది. గతేడాది సెప్టెంబర్‌లో ఇది కేవలం 9,191 యూనిట్లు మాత్రమే. ఆర్థిక సంవత్సరం 2026-27 రెండో త్రైమాసికం ప్యాసింజర్ వాహనాలకు సంబంధించి తమకు ఆల్ టైమ్ బెస్ట్ క్వార్టర్ అని టాటా తెలిపింది. ఈ త్రైమాసికంలో ఏకంగా 2,01,723 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇది ఏడాది ప్రాతిపదికన 40 శాతం పెరుగుదల. సెప్టెంబర్‌లో 70,000 మార్కును దాటి టాటా స్ట్రాంగ్ ముగింపు ఇచ్చింది.

55
నిస్సాన్ ఇండియా పరిస్థితి ఏంటి?
Image Credit : X/NissanMotor

నిస్సాన్ ఇండియా పరిస్థితి ఏంటి?

నిస్సాన్ మోటార్ ఇండియా సెప్టెంబర్ నెలలో మిశ్రమ ఫలితాలను చూసింది. దేశీయ మార్కెట్‌లో నిస్సాన్ హోల్‌సేల్ విక్రయాలు ఏకంగా 100 శాతం పెరిగి 3,300 యూనిట్లకు చేరాయి. సెప్టెంబర్ 2025లో కంపెనీ కేవలం 1,652 కార్లను మాత్రమే అమ్మినట్లు గురువారం సేల్స్ డేటా విడుదల చేస్తూ తెలిపింది. అయితే, ఎగుమతుల విషయంలో నిస్సాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎగుమతులు 24.2 శాతం తగ్గి 6,725 యూనిట్లకు పడిపోయాయి. గత ఏడాది ఇవి 8,873 యూనిట్లుగా ఉండేవి. ఎగుమతులు తగ్గడం వల్ల నిస్సాన్ మొత్తం విక్రయాలు 4.8 శాతం తగ్గి 10,025 యూనిట్లకు పరిమితమయ్యాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Maruti Suzuki offers: మారుతి కార్లపై మైండ్ బ్లోయింగ్ ఆఫర్లు.. ఏకంగా ₹1.36 లక్షల తగ్గింపు
Recommended image2
Best SUVs Under 8 Lakhs: 8 లక్షల లోపే 5 స్టార్ సేఫ్టీ, 21 కిమీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ ఎస్‌యూవీలు ఇవే
Recommended image3
TATA Aeris: కారుపై 20 ట‌న్నుల రాళ్లు ప‌డితే ఏమ‌వుతుంది.? వీడియో చూస్తే షాక్ అవుతారు
Related Stories
Recommended image1
Smartphone Deals: ఫ్లిప్‌కార్ట్ అమెజాన్ సేల్స్.. ఐఫోన్, శాంసంగ్ ఫోన్ల పై బిగ్ డిస్కౌంట్స్.. టాప్ 5 డీల్స్ ఇవే
Recommended image2
Hair Care Tips: హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందా? అసలు నిజమేంటి.. డాక్టర్లు ఏం చెప్తున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved