MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Careers
  • Free IAS IPS Coaching : ఖర్చులకు నెలనెలా డబ్బులిచ్చిమరీ ఫ్రీగా సివిల్స్ కోచింగ్.. మీ కలెక్టర్ కలను నిజం చేసుకొండి

Free IAS IPS Coaching : ఖర్చులకు నెలనెలా డబ్బులిచ్చిమరీ ఫ్రీగా సివిల్స్ కోచింగ్.. మీ కలెక్టర్ కలను నిజం చేసుకొండి

మీరు ఐఎఎస్, ఐపిఎస్ సాధించాలని కల కంటున్నారా? అయితే మీకోసమే ఈ సమాచారం. రూపాయి ఖర్చు లేకపోగా స్టైఫండ్ రూపంలో డబ్బులు తీసుకుంటూ ఉచితంగా సివిల్స్ కోచింగ్ పొందే అద్భుత అవకాశం తెలుగు యువతకు వచ్చింది.

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 15 2026, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు యువతకు బంపరాఫర్.. ఫ్రీగా సివిల్స్ కోచింగ్
Image Credit : Gemini AI

తెలుగు యువతకు బంపరాఫర్.. ఫ్రీగా సివిల్స్ కోచింగ్

Free Civils Coaching : చాలామంది యువతీయువకులు ఉన్నతమైన కలలు కంటుంటారు... కానీ వాటిని సాకారం చేసుకునేందుకు అనేక అడ్డంకులు ఎదురవుతుంటాయి. కొందరికి ఆర్థిక కష్టాలు, మరికొందరికి ఇంకేదో కష్టం... వీటన్నింటిని దాటుకుంటేనే కల నిజమయ్యేది. చిన్నచిన్న కలలు నెరవేర్చుకునేందుకే ఇబ్బందులు తప్పవు... అలాంటిది దేశంలోనే అత్యున్నతస్థాయి కలెక్టర్, ఎస్పీ వంటి ఉద్యోగాలను సాధించాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్విసెస్ ఎగ్జామ్ లో ర్యాంకు సాధించడం మామూలు విషయం కాదు. అయితే సామాన్య, నిరుపేద విద్యార్థులు సరైన కోచింగ్ లేక, ఆర్థిక ఇబ్బందులతో సివిల్స్ కలను సాకారం చేసుకోలేకపోతున్నారు. ఇలాంటివారికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోంది... బిసి స్కడీ సర్కిల్స్ ద్వారా ఉచిత కోచింగ్ తో పాటు ఆర్థిక సాయం అందిస్తోంది. 

తాజాగా యూపిఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2027 కోసం సన్నద్దమయ్యే యువతీయువకుల ఫ్రీ కోచింగ్ ఇచ్చేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. మీరు అర్హులయితే ఫ్రీగా కోచింగ్, ఆర్థిక సాయం, ఇతర సదుపాయాలు పొందవచ్చు... ఏ ఇబ్బందులు లేకుండా సివిల్స్ కు ప్రిపేర్ అయ్యి మీ కలెక్టర్, పోలీస్ కలను నిజం చేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉచిత సివిల్స్ కోచింగ్ దరఖాస్తు, సెలెక్షన్ ప్రాసెస్ వివరాలు
Image Credit : Gemini AI

ఉచిత సివిల్స్ కోచింగ్ దరఖాస్తు, సెలెక్షన్ ప్రాసెస్ వివరాలు

తెలంగాణ బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బిసి స్డడీ సర్కిల్స్ లో ఉచిత సివిల్స్ కోచింగ్ క్లాసులు వచ్చే నెల (ఆగస్ట్ 2026) లో ప్రారంభం కానున్నాయి. ఈ కోచింగ్ కోసం అర్హులైన యువతీయువకుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు... పూర్తి వివరాలతో జూలై 15న నోటిఫికేషన్ విడుదలయ్యింది.

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 17-07-2026

దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ : 07-08-2026

తెలంగాణ స్టడీ సర్కిల్ అధికారిక వెబ్ సైట్ https://tgbcstudycircle.cgg.gov.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

హాల్ టికెట్ల డౌన్‌లోడ్ : 13-08-2026 నుంచి ప్రారంభం

స్క్రీనింగ్ టెస్ట్ : 16-08-2026

ఫలితాలు : 19-08-2026

ధ్రువపత్రాల పరిశీలన : 21-08-2026 నుంచి

సివిల్స్ కోచింగ్ తరగతుల ప్రారంభం : 24-08-2026

Related Articles

Related image1
Government Jobs : గట్టిగా ట్రై చేస్తే నెలకు రూ.1,27,050 జీతంతో ఓ సర్కార్ నౌకరీ మీదే.. టిజిపిఎస్సి జాబ్ నోటిఫికేషన్ ఫుల్ డిటెయిల్స్
Related image2
Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. నెలకు రూ.50,000 శాలరీతో గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్స్ రిక్రూట్మెంట్
35
ఉచిత సివిల్స్ కోచింగ్ వివరాలు, అభ్యర్థులకు కల్పించే సౌకర్యాలు
Image Credit : Gemini AI

ఉచిత సివిల్స్ కోచింగ్ వివరాలు, అభ్యర్థులకు కల్పించే సౌకర్యాలు

తెలంగాణ తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ (TGBCESDTC) లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) –2027 ఉచిత శిక్షణ పొందాలనుకునే యువతీయువకులు హైదరాబాద్ లో ఉండాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు ఈ కోచింగ్ 2026 ఆగస్టు 24 నుంచి 2027 వరకు సాగుతుంది... సైదాబాద్ లోని స్టడీ సర్కిల్ కార్యాలయంలో క్లాసులు నిర్వహిస్తారు.

ఒక్కో బ్యాచ్ లో మొత్తం 150 మంది అభ్యర్థులకు సివిల్స్ శిక్షణ అందించనున్నారు. ఇందులో100 మందిని ఓపెన్ కేటగిరీ ద్వారా ఎంపికచేస్తారు... అంటే వీరికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. మిగతా 50 మందిని ప్రిలిమ్స్ అర్హత పొందిన అభ్యర్థుల నుంచి ఎంపిక చేస్తుంది తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్.

ఎంపికైన అభ్యర్థులకు కల్పించే సౌకర్యాలు

  • ఉచిత సివిల్స్ కోచింగ్ కొనసాగినంతకాలం నెలకు రూ.5,000 స్టైపెండ్ (ప్రభుత్వ నిబంధనల మేరకు) ఇస్తారు.
  • ఒకేసారి రూ.5,000 పుస్తక భృతి (బుక్స్ కొనేందుకు)
  • గ్రంథాలయ సౌకర్యం
  • నిపుణుల ద్వారా ప్రత్యేక శిక్షణ
  • స్టడీ మెటీరియల్, మాక్ టెస్టులు, మార్గదర్శకత్వం
45
బిసి స్టడి సర్కిల్ లో ఉచిత కోచింగ్ పొందాలంటే అర్హతలు
Image Credit : Gemini AI

బిసి స్టడి సర్కిల్ లో ఉచిత కోచింగ్ పొందాలంటే అర్హతలు

ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం

గ్రామీణ ప్రాంతాల అభ్యర్ధులకు : రూ.1.50 లక్షలలోపు

పట్టణ ప్రాంతాల అభ్యర్ధులకు : రూ.2.00 లక్షలలోపు

తప్పకుండా తెలంగాణ నివాసి అయి ఉండాలి.

భారతీయ పౌరుడై ఉండాలి.

ఉద్యోగం చేస్తూ ఉండకూడదు.. అంటే నిరుద్యోగి అయివుండాలి.

ఇతర ప్రభుత్వ సంక్షేమ శాఖల ద్వారా ఇలాంటి ఉచిత కోచింగ్ పొంది ఉండకూడదు

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2027 నిబంధనల ప్రకారం వయోపరిమితి ఉండాలి.

55
ఫ్రీ సివిల్స్ కోచింగ్ కు సంబంధించి మరింత సమాచారం కోసం సంప్రదించండి
Image Credit : Getty

ఫ్రీ సివిల్స్ కోచింగ్ కు సంబంధించి మరింత సమాచారం కోసం సంప్రదించండి

ఆసక్తి గల అభ్యర్థులు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ డా. మామిడి హరికృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. మరి మీరు సివిల్ సర్విసెస్ ఎగ్జామ్-2027 కోసం సన్నద్దం అవుతుండి, అన్ని అర్హతలు కలిగివుంటే బిసి స్టడీ సర్కిల్ లో ఫ్రీగా కోచింగ్ పొందవచ్చు.

ఈ ఉచిత సివిల్స్ కోచింగ్ కు సంబంధించి మరింత సమాచారం కోసం ''టిజి బిసి స్టడి సర్కిల్, రోడ్ నెంబర్ 8, లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్-500059' కార్యాలయంలో సంప్రందించండి. లేదా ఫోన్ నెంబర్ 040-24071178 లేదా మొబైల్ ఫోన్ 7780359322 కు కాల్ చేయండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Free Education: ఉచిత విద్యను అందించే దేశాలు.. ఇక్కడ ఫ్రీగా చదువుకోవచ్చని మీకు తెలుసా?
Recommended image2
Indian IT jobs Australia vs Switzerland: మనోళ్లకు జాబ్స్, లైఫ్ సెటిల్‌మెంట్ కోసం ఏ దేశం బెస్ట్?
Recommended image3
TG Police Recruitment 2026: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్ ఎంత? జీతం, క్వాలిఫికేషన్, నెగెటివ్ మార్కింగ్ ఫుల్ డీటైల్స్
Related Stories
Recommended image1
Government Jobs : గట్టిగా ట్రై చేస్తే నెలకు రూ.1,27,050 జీతంతో ఓ సర్కార్ నౌకరీ మీదే.. టిజిపిఎస్సి జాబ్ నోటిఫికేషన్ ఫుల్ డిటెయిల్స్
Recommended image2
Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. నెలకు రూ.50,000 శాలరీతో గవర్నమెంట్ ఆఫీసర్ జాబ్స్ రిక్రూట్మెంట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved