అయితే ఇంజనీర్ లేదా డాక్టర్.. ఇంటర్ తర్వాత వేరే దారే లేదా అనేవారికి ఇదే సమాధానం.
After Inter: ఇంటర్ కాగానే అయితే బీటెక్ లేదా ఎంబీబీఎస్ వైపు మొగ్గు చూపుతారు. కానీ క్రియేటివ్ కెరీర్ కోసం చూస్తున్న విద్యార్థుల కోసం ఫ్యాషన్ డిజైనింగ్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని మీకు తెలుసా.? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫ్యాషన్ డిజైనర్ అంటే ఎవరు?
ఫ్యాషన్ డిజైనర్ అంటే కొత్త దుస్తుల నమూనాలు రూపొందించే వ్యక్తి. మొదటగా స్కెచ్‌ల రూపంలో డిజైన్ తయారు చేస్తారు. తరువాత వాటిని దుస్తులుగా తయారుచేస్తారు. ఫ్యాషన్ డిజైనర్ పనిలో భాగంగా కొత్త డ్రెస్ డిజైన్లు రూపొందించడం, మార్కెట్‌లో ట్రెండ్స్ పరిశీలించడం, సరైన ఫ్యాబ్రిక్, మెటీరియల్ ఎంపిక చేయడం, కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు డిజైన్లు తయారు చేయడం, ఫ్యాషన్ షోలు, ఫ్యాషన్ వీక్స్ వంటి ఈవెంట్స్‌ను ఫాలో అవడం వంటి చేయాలి. క్రియేటివ్ ఆలోచనలు ఉన్నవారికి ఈ రంగం మంచి అవకాశాలు ఇస్తుంది.
మంచి ఫ్యాషన్ డిజైనర్ కావాలంటే అవసరమైన స్కిల్స్
ఈ రంగంలో ముందుకు వెళ్లాలంటే కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలు ఉండాలి. డ్రాయింగ్, స్కెచింగ్ స్కిల్స్ ఉండాలి.
డిజైన్లను ముందుగా స్కెచ్ రూపంలో తయారు చేయాలి. అందుకే డ్రాయింగ్ మీద కొంత అవగాహన అవసరం.
క్రియేటివిటీ, ఊహాశక్తి:
కొత్తగా ఆలోచించడం, ప్రత్యేకమైన స్టైల్స్ రూపొందించడం ఫ్యాషన్ డిజైనర్‌కు చాలా ముఖ్యం.
ఫ్యాబ్రిక్స్ గురించి అవగాహన:
కాటన్, సిల్క్, డెనిమ్, లీనెన్ వంటి ఫ్యాబ్రిక్స్ ఎలా ఉంటాయి? ఏ డ్రెస్‌కు ఏ ఫ్యాబ్రిక్ సరిపోతుంది? అనే విషయం తెలుసుకోవాలి.
ఫ్యాషన్ ట్రెండ్స్ పై ఆసక్తి:
మార్కెట్‌లో ప్రస్తుతం ఏ స్టైల్ ట్రెండ్‌లో ఉంది అనే విషయం తెలుసుకుంటూ ఉండాలి.
డిజైన్ సాఫ్ట్‌వేర్ నైపుణ్యం:
CAD, Adobe Illustrator, Photoshop వంటి సాఫ్ట్‌వేర్ ఉపయోగించడం చాలా అవసరం.
ఇంటర్ తర్వాత ఫ్యాషన్ డిజైన్ చదవడానికి అర్హత
ఇంటర్ తర్వాత ఫ్యాషన్ డిజైన్ కోర్సుల్లో చేరేందుకు సాధారణంగా ఈ అర్హతలు ఉంటాయి.
* గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్ (10+2) పూర్తి చేయాలి
* చాలా కాలేజీల్లో కనీసం 50% మార్కులు అవసరం.
* కొన్ని ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశ పరీక్షలు కూడా ఉంటాయి
* పీజీ కోర్సులు చేయాలంటే ముందుగా డిగ్రీ పూర్తిచేయాలి.
ఇంటర్ తర్వాత ఫ్యాషన్ డిజైన్ కోర్సులు
ఫ్యాషన్ డిజైన్ రంగంలో ఇంటర్ తర్వాత చదవడానికి అనేక కోర్సులు ఉన్నాయి.
డిగ్రీ కోర్సులు
బీఎస్‌సీ ఫ్యాషన్ డిజైన్ – 3 సంవత్సరాలు
బీడీఎస్ ఫ్యాషన్ డిజైన్ – 4 సంవత్సరాలు
బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ – 4 సంవత్సరాలు
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ – 3 సంవత్సరాలు
బీఏ(Hons) ఫ్యాషన్ డిజైన్ – 3 సంవత్సరాలు
బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ అప్పిరియల్ డిజైన్ – 3 సంవత్సరాలు
స్పెషలైజేషన్ కోర్సులు
* BDes టెక్ట్స్‌టైల్ డిజైన్
* BDes అక్సెసరీ డిజైన్.
* BDes జువెలరీ డిజైన్.
* BDes కింట్‌వెయిర్ డిజైన్.
* BDes ఫ్యాషన్ కమ్యూనికేషన్
డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు
* డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైన్ – 1 సంవత్సరం
* అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైన్ – 2 సంవత్సరాలు
* డిప్లొమా ఇన్ జువెలరీ డిజైన్ – 1 సంవత్సరం
* సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఫ్యాషన్ డిజైన్ – 6 నెలలు నుండి 1 సంవత్సరం
ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు ఫ్యాషన్ హౌసెస్, గార్మెంట్ కంపెనీలు, బుటిక్‌లు, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈ-కామర్స్ బ్రాండ్స్ వంటి రంగాల్లో పని చేయవచ్చు.
ఫ్యాషన్ డిజైనర్ జీతం ఎంత ఉంటుంది?
ఫ్యాషన్ డిజైనర్ జీతం అనుభవం, పని చేసే కంపెనీ, బ్రాండ్ మీద ఆధారపడి ఉంటుంది.
* ఎంట్రీ లెవెల్ (0–2 సంవత్సరాలు) అయితే నెలకు సుమారు రూ. 25,000 నుంచి రూ. 40,000 మధ్య ఉంటుంది.
* మిడ్ లెవెల్ (3–6 సంవత్సరాలు) అయితే నెలకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంటుంది.
* సీనియర్ డిజైనర్ (7 సంవత్సరాల తర్వాత) అయితే నెలకు రూ. లక్ష నుంచి రూ. 2.5 లక్ష లవరకు ఉంటుంది.
* ప్రముఖ బ్రాండ్లు లేదా సెలబ్రిటీ డిజైనర్లు ఏకంగా నెలకు రూ. 5 లక్షల వరకు కూడా సంపాదించే వారున్నారు.

