MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • Zomato: మాజీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జొమాటో సీఈవో, ఊహించని స్పందన

Zomato: మాజీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన జొమాటో సీఈవో, ఊహించని స్పందన

Zomato: జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ చేసిన ఒక్క ప్రకటనతో ఆయనకు ఏకంగా 8000 మెయిల్స్ వచ్చాయి. గతంలో తనతో ఉద్యోగం చేసిన వారికి మళ్లీ తన కంపెనీలో జాబ్ చేసే అవకాశాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు. దీనికి వేల మంది స్పందించారు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 12 2026, 04:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తిరిగి ఉద్యోగం ఇస్తా
Image Credit : Getty

తిరిగి ఉద్యోగం ఇస్తా

జొమాటో ఓనర్ దీపిందర్ గోయల్ ఎవరూ చేయని పనిచేశాడు. ఆ పనికి అతను ఊహించని విధంగా స్పందన వచ్చింది. ఆయన చేసిన ప్రకటన వ్యాపార ప్రపంచంలో, ముఖ్యంగా స్టార్టప్ రంగంలో కొత్త చర్చకు దారితీసింది. తన కంపెనీలో గతంలో పనిచేసిన ప్రతిభావంతులైన ఉద్యోగులు తిరిగి రావాలని ఆయన సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ఈమెయిల్ ఐడీని కూడా కూడా షేర్ చేశారు. ఈ ప్రకటన చేసిన కొన్ని రోజుల్లోనే భారీ స్పందన వచ్చింది. కేవలం ఒక వారం రోజుల్లో దాదాపు 8,000 ఈమెయిల్స్ వచ్చాయని సమాచారం. అన్ని మెయిల్స్ రావడం చూసి తానే ఆశ్చర్యపోయినట్లు దీపిందర్ గోయల్ చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నాలుగు వేల మాజీ ఉద్యోగులు
Image Credit : Getty

నాలుగు వేల మాజీ ఉద్యోగులు

వచ్చిన ఈమెయిల్స్‌లో సుమారు 4,000 మంది మాజీ ఉద్యోగులవి ఉన్నాయి. ఇక మిగిలిన 4,000 మంది కొత్తగా కంపెనీలో చేరాలని ఆసక్తి చూపిన వారు ఉన్నట్టు దీపిందర్ గోయల్ తెలిపారు.ముఖ్యంగా పాత ఉద్యోగులు పంపిన ఈమెయిల్స్ చదువుతూ ఉంటే ఎంతో భావోద్వేగానికి లోనవుతున్నాయని ఆయన అన్నారు. వారు కంపెనీ ఎదుగుదల రోజుల్లో ఎదుర్కొన్న కష్టాలు, కలిసి పనిచేసిన అనుభవాలు, ఆ రోజుల జ్ఞాపకాలను వివరంగా రాశారని.. అవి చదువుతుంటే ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. ఈ మెయిల్స్ చదివినప్పుడు కంపెనీ ప్రారంభ దశలో జరిగిన అనేక విషయాలు మళ్లీ గుర్తొస్తున్నాయని ఆయన అన్నారు.

Related Articles

Related image1
Gold Chains: 10 గ్రాములలో వచ్చే గోల్డ్ చైన్ డిజైన్లు
Related image2
Gold History: ప్రపంచంలోనే మొదట బంగారు నగలు ధరించింది ఎవరు?
34
తానే స్వయంగా చదువుతూ
Image Credit : Getty

తానే స్వయంగా చదువుతూ

అంత పెద్ద సంఖ్యలో ఈమెయిల్స్ రావడంతో వాటన్నింటినీ చదవడం చాలా కష్టంగా మారిందని దీపిందర్ గోయల్ చెప్పారు. కొన్ని మెయిల్స్‌లో ఉన్న విషయాలను తన హెచ్ఆర్ టీమ్ పూర్తిగా అర్థం చేసుకోలేకపోతోందని, అందుకే తానే చాలా మెయిల్స్‌ను స్వయంగా చదువుతున్నానని చెప్పారు. అంతేకాకుండా గతంలో నేరుగా తనతో కలిసి పనిచేసిన వారు మెయిల్ రిప్లై కోసం ఎదురుచూడవద్దని... తన ఫోన్ నంబర్ వెతికి నేరుగా వాట్సాప్‌లో మెసేజ్ చేయాలని కూడా ఆయన సూచించారు. ఒక పెద్ద కంపెనీ వ్యవస్థాపకుడు ఇలా ఓపెన్‌గా చెప్పడం సోషల్ మీడియాలో రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

44
ఎంత మందికి ఉద్యోగాలు?
Image Credit : Getty

ఎంత మందికి ఉద్యోగాలు?

దీపిందర్ గోయెల్ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తూ స్పందించగా, మరికొందరు దీపిందర్ గోయల్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించుకుంటున్నారు. ముఖ్యంగా స్టార్టప్ రంగంలో లేఆఫ్స్ జరుగుతున్న ఈ సమయంలో పాత ఉద్యోగులను తిరిగి ఉద్యోగంలోకి ఆహ్వానించడం మంచి సంకేతమేనని చెబుతున్నారు. కంపెనీతో అనుబంధం ఉన్నవారిని గౌరవించడం, వారి అనుభవాన్ని మళ్లీ ఉపయోగించుకోవాలనుకోవడం మంచి నిర్ణయం అని వ్యాపార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈమెయిల్స్ పంపిన ఎంత మందికి ఉద్యోగం దక్కుతుందో చూడాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Today: బంగారం ధర మళ్లీ రికార్డు కొట్టబోతోందా? స్థిరంగానే ఉన్నా.. అసలు టెన్షన్ ఇప్పుడే
Recommended image2
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image3
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Related Stories
Recommended image1
Gold Chains: 10 గ్రాములలో వచ్చే గోల్డ్ చైన్ డిజైన్లు
Recommended image2
Gold History: ప్రపంచంలోనే మొదట బంగారు నగలు ధరించింది ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved