- Home
- Technology
- Tech News
- Recharge Plan: ఖతర్నాక్ రీఛార్జ్ ప్లాన్... 55 రూపాయలతో 1000కిపైగా లైవ్ టీవీ ఛానల్స్
Recharge Plan: ఖతర్నాక్ రీఛార్జ్ ప్లాన్... 55 రూపాయలతో 1000కిపైగా లైవ్ టీవీ ఛానల్స్
Recharge Plan: రిలయన్స్ జియో తన మొబైల్ వినియోగదారుల కోసం మరో కొత్త వినోద ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కేవలం రూ.55తో లభించే జియోటీవీ ప్రో ప్యాక్ ద్వారా 30 రోజుల పాటు 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లను మొబైల్‌లోనే వీక్షించవచ్చు.

రూ.55 ప్లాన్‌లో ఏమేం లభిస్తాయి?
ఈ కొత్త జియోటీవీ ప్రో ప్యాక్ ధర రూ.55. ప్లాన్ యాక్టివేట్ అయిన తర్వాత 30 రోజుల పాటు జియోటీవీ యాప్‌లో 1,000కు పైగా లైవ్ టీవీ ఛానళ్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో 150కిపైగా ప్రీమియం ఛానళ్లు కూడా ఉన్నాయి. వినోదం, సినిమాలు, వార్తలు, పిల్లల కార్యక్రమాలు, లైఫ్‌స్టైల్, ప్రాంతీయ ఛానళ్లు ఇలా అనేక విభాగాలకు చెందిన కంటెంట్‌ను ఒకే ప్లాన్‌లో వీక్షించే అవకాశం ఉంటుంది.
ఏయే ఛానళ్లు అందుబాటులో ఉంటాయి?
ఈ ప్లాన్‌లో జియోస్టార్, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్, సన్ టీవీ నెట్‌వర్క్, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, ఈటీవీ నెట్‌వర్క్‌కు చెందిన పలు ప్రముఖ ఛానళ్లు ఉన్నాయి. స్టార్ ప్లస్ హెచ్‌డీ, కలర్స్ హెచ్‌డీ, సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ హెచ్‌డీ, సోనీ ఎస్‌ఏబీ హెచ్‌డీ, డిస్కవరీ, అనిమల్ ప్లానెట్‌తో పాటు తెలుగు సహా పలు ప్రాంతీయ భాషల ఛానళ్లు కూడా ఇందులో లభిస్తాయి. అయితే జియోస్టార్, సోనీ గ్రూప్‌కు చెందిన స్పోర్ట్స్ ఛానళ్లు ఈ ప్యాక్‌లో భాగం కావు.
ప్లాన్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి?
వినియోగదారులు ముందుగా రూ.55 జియోటీవీ ప్రో ప్యాక్‌తో రీఛార్జ్ చేసుకోవాలి. అనంతరం జియోటీవీ యాప్‌ను ఓపెన్ చేసి తమ జియో మొబైల్ నంబర్‌తో లాగిన్ అయితే వెంటనే సేవలు ప్రారంభమవుతాయి. దీనికి ప్రత్యేకంగా మరో యాక్టివేషన్ ప్రక్రియ అవసరం లేదు. జియో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులిద్దరూ ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో లేని ప్రయోజనాలు
ఈ రీఛార్జ్ పూర్తిగా వినోద సేవల కోసం మాత్రమే రూపొందించారు. ఇందులో వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్ లేదా డేటా ప్రయోజనాలు ఉండవు. సేవలను వినియోగించాలంటే యాక్టివ్ జియో మొబైల్ కనెక్షన్ తప్పనిసరి. ఒక జియోటీవీ అకౌంట్‌ను ఒక మొబైల్‌తో మాత్రమే ఉపయోగించవచ్చు.
ఎక్కడ రీఛార్జ్ చేసుకోవచ్చు?
రూ.55 జియోటీవీ ప్రో ప్యాక్ ప్రస్తుతం మైజియో యాప్, జియో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ జియో రీఛార్జ్ కేంద్రాల్లో అందుబాటులో ఉంది. వినియోగదారులు ముందుగానే ఒకటి కంటే ఎక్కువసార్లు ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు. ఒక ప్యాక్ గడువు ముగిసిన తర్వాత తదుపరి ప్యాక్ స్వయంచాలకంగా అమల్లోకి వస్తుంది.

