Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Business
  • WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్: వేరే వాళ్ల స్టేటస్ ను మీరు రీపోస్ట్ చేయొచ్చు. ఎలాగంటే..

WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్: వేరే వాళ్ల స్టేటస్ ను మీరు రీపోస్ట్ చేయొచ్చు. ఎలాగంటే..

WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే యూజర్లు పోస్టు చేసిన స్టేటస్‌లను మళ్లీ ఫార్వర్డ్ చేసుకునే వీలుగా ‘రీపోస్ట్’ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని గురించి డీటైల్డ్ సమాచారం ఇక్కడ ఉంది. 

Naga Surya Phani Kumar | Published : May 14 2025, 12:12 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్ అకౌంట్ కచ్చితంగా ఉంటుంది. ఫోన్లు, మెసేజ్ లు పోయి ఇప్పుడు కొత్తగా వాట్సాప్ కాల్స్, గ్రూప్ కాల్స్, గ్రూప్ చాటింగ్ అంటూ కొత్త విధానాల్లో కాంటాక్ట్ లో ఉంటున్నారు. వాట్సాప్ వచ్చిన తర్వాత మెసేజ్ లు చూసుకోవడం, చేసుకోవడం మానేశారు. ఇప్పుడంతా వాట్సాప్ లోనే జరిగిపోతున్నాయి. మెసేజ్ లు మొదలుకొని ఫోటోలు, వీడియోలు కూడా వాట్సాప్ లోనే షేర్ చేసుకుంటున్నారు. 

25
Asianet Image

వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తీసుకొస్తోంది. కేవలం మెసేజ్ యాప్ లా మొదలైన వాట్సాప్ ఆడియో కాల్స్, వీడియో కాల్స్, మనీ ట్రాన్సాక్షన్స్ కూడా అనుమతి ఇస్తోంది. ఇప్పుడు పరిచయం చేసిన కొత్త ఫీచర్ కూడా చాలా సింపుల్, ఉపయోగకరమైంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

 

Related Articles

UPI: డ‌బ్బులు లేక‌పోయినా ఫోన్‌పే, గూగుల్ పే చేయొచ్చు.. ఎలాగో తెలుసా.?
UPI: డ‌బ్బులు లేక‌పోయినా ఫోన్‌పే, గూగుల్ పే చేయొచ్చు.. ఎలాగో తెలుసా.?
కేవలం 5.8 mm మందం ఉన్న ఫోన్ చూశారా? ఫీచర్స్ అదుర్స్
కేవలం 5.8 mm మందం ఉన్న ఫోన్ చూశారా? ఫీచర్స్ అదుర్స్
35
Asianet Image

ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఇతరులు షేర్ చేసిన స్టేటస్‌లను తాము తిరిగి తమ స్టేటస్‌‍గా పోస్ట్ చేసుకునే అవకాశం కలుగుతుంది. అయితే ఇది పూర్తిగా యూజర్ అనుమతిపై ఆధారపడి ఉంటుంది. అదేంటంటే స్టేటస్‌ను పోస్ట్ చేసిన వ్యక్తి ‘Allow Sharing’ అనే ఆప్షన్‌ను ఆన్ చేసినపుడే ఈ ఫీచర్ పనిచేస్తుంది.

45
Asianet Image

ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్‌లో స్టేటస్ షేరింగ్ చాలా సింపుల్ అవుతుంది. ఇప్పుడు ఒకరు పెట్టిన స్టేటస్‌ను నచ్చినవారు, తమ ఫ్రెండ్స్‌తో మళ్లీ షేర్ చేసుకునే వీలుండటం వల్ల సమాచారాన్ని త్వరగా స్ప్రెడ్ చేయవచ్చు.

ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. త్వరలోనే ఇది అన్ని యూజర్లకు విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం ఇది మాత్రమే కాంటాక్ట్‌ల మధ్య షేరింగ్‌కు పరిమితమవుతుంది. అంటే మీ కాంటాక్ట్స్‌లో ఉన్నవారే స్టేటస్‌ను రీపోస్ట్ చేసుకునే వీలుంది.
 

55
Asianet Image

ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే రీపోస్ట్ చేయాలంటే మీరు ఆ స్టేటస్ చూసే సమయంలోనే "Allow Sharing" ఆప్షన్‌ను ఆన్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ స్టేటస్‌ను మళ్లీ రీపోస్ట్ చేయలేరు.

ఈ ఫీచర్ ద్వారా స్టేటస్‌ల వినియోగం మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ తరచూ తన యూజర్ ఎక్స్‌పీరియెన్స్ మెరుగుపరచేందుకు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. 

వాట్సాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లో అప్డేట్ చేసి, ఈ ఫీచర్ అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.


 

Naga Surya Phani Kumar
About the Author
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది. Read More...
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Top Stories