UPI Payment: UPI పేమెంట్ సడన్‌గా ఆగిపోతే టెన్షన్ పడొద్దు. ఈ 8 ట్రిక్స్‌తో మీ డబ్బు సేఫ్
UPI Payment: UPI ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఒక్కోసారి సడన్ గా సర్వర్ డౌన్ అవుతుంది. దీంతో పేమెంట్ ప్రాసెస్ సగంలో ఉండగా ఆగిపోతుంది. అలాంటి పరిస్థితి మీకు ఎదురైతే టెన్షన్ పడకండి. మీ డబ్బు సేఫ్ గా ఉండటానికి ఈ టిప్స్ పాటించండి.

దేశవ్యాప్తంగా UPI ట్రాన్సాక్షన్స్ విపరీతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్న చిన్న దుకాణాల్లో కూడా ఫోన్ పే, గూగుల్ పే లాంటి యాప్స్ ఉపయోగించి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేస్తున్నారు. డిజిటల్ మనీ లావాదేవీలు నిర్వహించడంలో దేశ ప్రజలు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నారని కేంద్ర ప్రభుత్వ మంత్రులే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క రూపాయి నుంచి రూ.లక్షల్లో ట్రాన్సాక్షన్స్ కూడా యూపీఐ ద్వారా చేసేస్తున్నారు. డబ్బులు పంపడం, తీసుకోవడం ఇంత సులవైపోయినా అప్పుడప్పుడూ యూపీఐ సర్వర్ మోరాయిస్తుంటుంది. అలాంటప్పుడు డబ్బులు పోతాయేమోనని భయపడకండి. డబ్బులు సేఫ్ గా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
1. నెట్‌వర్క్ కనెక్షన్ చెక్ చేయండి
కొన్నిసార్లు ఇంటర్నెట్ స్లోగా ఉండటం లేదా ఆగిపోవడం వల్ల UPI ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. అలా జరిగితే వైఫై లేదా మొబైల్ డేటాను రీసెట్ చేయండి. లేదా వేరే నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవ్వండి.
2. యాప్‌ను రిఫ్రెష్ లేదా రీస్టార్ట్ చేయండి
పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, వంటి యాప్‌లలో కొన్నిసార్లు టెక్నికల్ సమస్యలు వస్తాయి. యాప్‌ను క్లోజ్ చేసి మళ్లీ ఓపెన్ చేయండి. అవసరమైతే లాగౌట్ చేసి మళ్లీ లాగిన్ అవ్వండి.
3. UPI యాప్‌ను అప్‌డేట్ చేయండి
పాత వెర్షన్ యాప్‌లలో బగ్స్ ఉండవచ్చు. కంగారు పడకుండా ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ కి వెళ్లి యాప్‌ను అప్‌డేట్ చేయండి.
4. వేరే UPI యాప్ నుంచి ట్రై చేయండి
ఒక యాప్‌లో సమస్య ఉంటే, BHIM, Amazon Pay వంటి ఇతర యాప్‌లను ఉపయోగించండి. లేదా మీ బ్యాంక్ UPI IDతో లింక్ అయిన ఏదైనా ఇతర యాప్‌ను ఇన్స్టాల్ చేయండి.
5. బ్యాంక్ సర్వర్ స్టేటస్ చెక్ చేయండి
కొన్నిసార్లు మీ బ్యాంక్ వైపు నుండి కూడా సమస్య ఉండవచ్చు. మీ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ లేదా సోషల్ మీడియాలో అప్‌డేట్‌లను చూడండి.
6. కస్టమర్ సర్వీస్ సహాయం తీసుకోండి
UPI ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు సర్వీస్ ఆగిపోయి డబ్బు కట్ అయితే వెంటనే కస్టమర్ కేర్‌ను సంప్రదించండి. యాప్‌లోని హెల్ప్ లేదా సపోర్ట్ సెక్షన్‌లో కంప్లైంట్ చేయండి.
7. పేమెంట్ ఫెయిల్ అయిన స్క్రీన్ షాట్ తీసుకోండి
పేమెంట్ ఫెయిల్ అయినా డెబిట్ మెసేజ్ వస్తే, ప్రూఫ్ అవసరం. అందుకే ట్రాన్సాక్షన్ స్క్రీన్ షాట్ తీసి బ్యాంక్‌తో పాటు యాప్‌కు పంపండి.
8. వెయిట్ చేసి మళ్లీ ట్రై చేయండి
యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే డబ్బు సాధారణంగా 24-48 గంటల్లో తిరిగి వస్తుంది. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంటే కాసేపు ఆగి మళ్లీ ట్రై చేయండి.
ఇది కూడా చదవండి టీవీలు, ఫోన్లు కొనాలంటే వెంటనే కొనేయండి. చైనాపై ట్రంప్ పన్నుల మోత.. ధరలు ఎంత పెరుగుతాయంటే..?