MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Today Gold Rate: మళ్లీ ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. మధ్యతరగతి కుటుంబాలపై భారం..ఒత్తిడిలో ఆర్థిక వ్యవస్థ

Today Gold Rate: మళ్లీ ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. మధ్యతరగతి కుటుంబాలపై భారం..ఒత్తిడిలో ఆర్థిక వ్యవస్థ

Today Gold Rate: బంగారం కొంటున్నారా? అయితే పసిడి ప్రియులకు 2 రోజుల నుంచి షాకులు తగులుతున్నాయి. ఇవాళ కూడా నిరాశే ఎదురైంది. రెండో రోజు పసిడి భారీగా పెరగడంతో మార్కెట్లో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్‍లో ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Nandini Arava
Published : May 07 2026, 11:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి
Image Credit : iSTOCK

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, డాలర్ మారకం విలువల్లో మార్పులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి ప్రభావంతో దేశీయ మార్కెట్లో గోల్డ్ రేట్లు మరింత ఎగబాకాయి. ముఖ్యంగా హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు మరోసారి పెరుగుదల నమోదైంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,52,460
Image Credit : iSTOCK

10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,52,460

ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.330 పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,52,460 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.300 ఎగిసి ప్రస్తుతం రూ.1,39,750 వద్ద ట్రేడవుతోంది. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న ఈ ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి.

35
కొనుగోలుదారులకు కాస్త ఊరట
Image Credit : iSTOCK

కొనుగోలుదారులకు కాస్త ఊరట

ఇక వెండి ధరల విషయానికి వస్తే, ఇవాళ మాత్రం ఎటువంటి మార్పు కనిపించలేదు. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,75,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా వెండి ధరల్లో కూడా భారీ హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ, ఇవాళ మాత్రం ధర స్థిరంగా ఉండటం కొనుగోలుదారులకు కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పొచ్చు.

45
మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం
Image Credit : Getty

మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో బంగారం ధరలు ఇలా పెరగడం మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం మోపుతోంది. సాధారణంగా ఈ కాలంలో గోల్డ్ కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి. కానీ వరుసగా పెరుగుతున్న ధరల కారణంగా చాలా మంది కొనుగోలుదారులు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందనే భయంతో ఇప్పుడే కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.

55
గోల్డ్‌కు డిమాండ్
Image Credit : Getty

గోల్డ్‌కు డిమాండ్

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై ఉన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గుచూపుతున్న నేపథ్యంలో గోల్డ్‌కు డిమాండ్ పెరుగుతోందని చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. స్థానిక పన్నులు, జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలను బట్టి స్వల్ప మార్పులు ఉండొచ్చని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులను బట్టి బంగారం ధరల్లో మరింత మార్పులు చోటు చేసుకునే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Crash: గోల్డ్ రేట్లు దిగొచ్చాయి.. వినాయక చవితి వేళ బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త
Recommended image2
Stock Market : ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండనుంది? ఏ అంశాలు ప్రభావితం చేయనున్నాయి?
Recommended image3
Post Office TD: ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ ఇన్‌క‌మ్‌.. పోస్టాఫీస్‌లో అద్భుత‌మైన ప‌థ‌కం
Related Stories
Recommended image1
Gold Earrings: 3 గ్రాముల్లో వచ్చే స్టోన్ గోల్డ్ ఇయర్ రింగ్స్.. ఇవిగో
Recommended image2
Today Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధరలు..బిగ్ షాక్‍లో ఇన్వెస్టర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved