- Home
- Business
- మహిళలు ఇలా చేస్తే మీరే మహా రాణులు.. ఇంట్లో నుంచే నెలకు రూ. 25 వేలు సంపాదించే అవకాశం
మహిళలు ఇలా చేస్తే మీరే మహా రాణులు.. ఇంట్లో నుంచే నెలకు రూ. 25 వేలు సంపాదించే అవకాశం
Business Ideas: మారిన ఆర్థిక అవసరాల నేపథ్యంలో మహిళలు కూడా సంపాదిస్తున్నారు. అయితే మహిళలు ఉద్యోగాలు మాత్రమే కాకుండా ఇంట్లో ఉంటూనే మంచి వ్యాపారాలు చేసే అవకాశం ఉంది. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హోమ్ బేస్డ్ ఫుడ్ బిజినెస్
ఉన్న ఊరిలో ఉంటూనే తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల మంచి వ్యాపారం హోమ్‌మేడ్ ఫుడ్స్ తయారీ. ఇంట్లోనే పచ్చళ్లు, కారం పొడులు, స్నాక్స్, పిండి వంటలు తయారు చేసి అమ్మితే నెలకు రూ.30,000 వరకు సంపాదించవచ్చు. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో ఈ వ్యాపారం మంచి డిమాండ్‌లో ఉంటుంది.
వ్యాపారం ఎలా ప్రారంభించాలి?
మొదట మీరు తయారు చేయగల కొన్ని పదార్థాలతోనే వ్యాపారం మొదలు పెట్టాలి. ఉదాహరణకు ఆవకాయ పచ్చడి, కారం పొడి, పల్లీల పొడి, మురుకులు, పిండి వంటలు వాటిని తయారు చేయొచ్చు. ప్రారంభంలో మీ ఊరిలోని కిరాణా షాపులు, టీ దుకాణాలు, చిన్న హోటళ్లు, పరిచయస్తులకు విక్రయించడం ప్రారంభించాలి. తర్వాత వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకోవచ్చు.
ఆదాయం ఎలా ఉంటుంది.?
సరైన ప్లాన్‌తో నెలకు రూ.30,000 సంపాదించవచ్చు. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండగ సమయాల్లో ఎక్కువగా ఆర్డర్లు వస్తాయి. అలాగే మీరు తయారు చేసిన పిండి వంటలను నేరుగా ఇంట్లోనే హోల్‌సేల్ ధరలకు విక్రయించుకునే అవకాశం కూడా ఉంటుంది. రోజుకు రూ. 1500 అమ్ముడు పోయినా మొత్తం రూ. 45 వేల ఆదాయం వస్తుంది. ఖర్చులన్నీ పోయినా నెలకు రూ. 20 నుంచి రూ. 30 వేల వరకు ఆదాయం పొందొచ్చు.
ఈ వ్యాపారం లాభాలు
ఈ వ్యాపారంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇంట్లోనే చేయవచ్చు, మహిళలకు అనుకూలం, తక్కువ పెట్టుబడి, నష్టం తక్కువగా ఉంటుంది. రోజూ డబ్బు వస్తుంది. ఉన్న ఊరిలోనే సంపాదించుకోవచ్చు. మంచి రుచి, నాణ్యత ఉంటే కస్టమర్లు స్థిరంగా ఉంటారు.
త్వరగా విజయవంతం కావడానికి చిట్కాలు
మొదట నాణ్యత మీద దృష్టి పెట్టాలి. పెద్ద ఎత్తున కాకుండా చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో విక్రయించాలి. రూ. 10 నుంచి రూ. 50ల మధ్యే ఉండేలా చూసుకోవాలి. సోషల్ మీడియాను వాడుకోవాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పేజీని క్రియేట్ చేసి ప్రమోట్ చేయాలి. వాట్సాప్‌లో కూడా ఆర్డర్లు స్వీకరించేలా ఏర్పాట్లు చేసుకోవాలి.

