- Home
- Business
- Vande Bharat: వందే భారత్ రైళ్లలో మీరు వద్దన్నా భోజనం పెడతారు, ఫుడ్ సప్లైలో కొత్త మార్పులు
Vande Bharat: వందే భారత్ రైళ్లలో మీరు వద్దన్నా భోజనం పెడతారు, ఫుడ్ సప్లైలో కొత్త మార్పులు
Vande Bharat: వందే భారత్ రైళ్లకు ప్రజాదరణ పెరుగుతోంది. అందుకే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి రైల్వే శాఖ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఫుడ్ సప్లై చేసే విషయంలో కొత్త మార్పులు చేసింది. అవేంటో వివరంగా తెలుసుకుందాం రండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
భారతదేశంలో ట్రైన్ ట్రాన్స్ పోర్ట్ చాలా ముఖ్యమైన రవాణా సాధనం. లాంగ్ టూర్ వెళ్లే వారు కచ్చితంగా రైళ్లలో వెళ్లడానికే ప్రయత్నం చేస్తారు. దీనికి కారణం రైళ్లలో కల్పించే సౌకర్యాలు. ఇంట్లో ఉండి చేసే అన్ని రకాల పనులు రైళ్లలో ప్రయాణిస్తూ చేసేయొచ్చు. నిద్ర లేనిన తర్వాత బ్రషింగ్, స్నానం, డ్రెస్ మార్పుకొనే ఫెసిలిటీస్ ట్రైన్స్ లో లభిస్తాయి.
ఇక ఫుడ్ విషయానికొస్తే టిఫెన్స్, టీ, కాఫీ, భోజనం, స్నాక్స్ ఇలా అన్ని రకాల ఫుడ్ ట్రైన్స్ లో లభిస్తుంది. అందుకే ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. అందుకే రైళ్లలో కూడా వేర్వేరు సౌకర్యాలున్న రకరకాల రైళ్లు ఉన్నాయి. లగ్జరీ రైళ్లు, అతివేగంగా నడిచే రైళ్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, సాధారణ రైళ్లు, ఎంఎంటీఎస్, మెట్రో ఇలా రకరకాల రైళ్లు నడుస్తున్నాయి.
తేజస్, శతాబ్ది, దురంతో, రాజధాని వంటి అత్యంత వేగంతో ప్రయాణించే రైళ్లలో ఇలాంటి అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. ఇలా అత్యంత వేగంతో ప్రయాణించే రైళ్లకు పోటీగా కేంద్ర రైల్వే శాఖ వందే భారత్ రైళ్లను నడుపుతోందన్న విషయం మీకు తెలిసిందే. వేగంగా ప్రయాణించడం, గమ్యస్థానాలకు త్వరగా చేరుస్తుండటంతో వందే భారత్ రైళ్లకు దేశంలో ప్రజాదరణ పెరుగుతోంది.
ప్రస్తుతానికి దేశంలోని ప్రధాన నగరాల మధ్య వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వందే భారత్ రైళ్లలో ప్రయాణించే వారికి భోజనం అందిస్తారు. దీనికోసం టికెట్ బుకింగ్ చేసేటప్పుడే భోజనంతో సహా ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే ఇటీవల కొన్ని కొత్త మార్పులు తీసుకొచ్చారు. అవేంటో చూద్దాం రండి.
వందే భారత్ రైళ్లలో టికెట్ బుకింగ్ చేసేటప్పుడు భోజనం కావాలా వద్దా అని ఎంచుకునే అవకాశం ఉంటుంది. టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి మాత్రమే ప్రయాణంలో భోజనం అందిస్తారు. బుక్ చేసుకోని వారికి తర్వాత అడిగినా ఇవ్వరు. ఇప్పుడు ఈ రూల్ ని మార్చారు.
కొందరు టికెట్ బుకింగ్ చేసేటప్పుడు ‘భోజనం వద్దు’ అనే ఆప్షన్‌ను ఎంచుకుని భోజనం చేసే టైమ్ కి తినాలని అనిపిస్తే ఆర్డర్ తీసుకొనే వారు కాదు. ఈ విషయంపై ఐఆర్‌సీటీసీ సిబ్బంది భోజనం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి.
ప్రయాణికులు టికెట్ బుకింగ్ సమయంలో 'భోజనం వద్దు' అని ఎంచుకున్నప్పటికీ, తర్వాత ఆర్డర్ ఇస్తే రైలులోనే భోజనం అందించాలని ఐఆర్‌సీటీసీ అధికారులు, సిబ్బందికి రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
కాబట్టి ఇకపై వందే భారత్ రైలులో ప్రయాణించేవారు టికెట్ బుకింగ్ సమయంలో 'భోజనం వద్దు' అని ఎంచుకున్నా, రైలు ప్రయాణంలో సిబ్బందికి డబ్బులు ఇచ్చి భోజనం తీసుకోవచ్చు. భోజనం ఇవ్వడానికి నిరాకరించే సిబ్బందిపై ఫిర్యాదు చేయవచ్చని రైల్వే శాఖ ఈ ప్రకటనలో తెలిపింది.
గిన్నిస్ రికార్డ్స్‌లోకెక్కిన ఇండియాలోని ట్రైన్ రూట్ ఎక్కడుందో తెలుసా?