గిన్నిస్ రికార్డ్స్‌లోకెక్కిన ఇండియాలోని ట్రైన్ రూట్ ఎక్కడుందో తెలుసా?
ఇండియాలో ఇంత అందమైన, అద్భుతమైన ట్రైన్ రూట్ ఉందని చాలా మందికి తెలియదు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ ట్రైన్ రూట్ దారిలో కనిపించే ప్రకృతి అందాల వల్ల ఈ రూట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఇంత స్పెషల్ ట్రైన్ రూట్ ఎక్కడుంది. అక్కడికి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం రండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
భూతల స్వర్గం అని వినే ఉంటారు కదా.. ఈ ట్రైన్ రూట్ లో ప్రయాణిస్తే మీరు కచ్చితంగా ఆ అనుభూతిని పొందుతారు. ఎందుకంటే ఆ రూట్ లో కనువిందు చేసే సుందర దృశ్యాలు, కొండలు, లోయలు, అడవులు, మంచు పర్వతాలు, జలపాతాలు ఇలా ఒకటేమిటి. అన్ని రకాల వాతావరణాలను ఇక్కడే చూడొచ్చు.
అయితే ఈ ట్రైన్ జర్నీని మీరు డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో చేసొస్తే మైమరచిపోతారు. ఈ మూడు నెలలు ఆ రూట్ అంతా మంచుతో చాలా అందంగా కనిపిస్తుంది. ఇంత అందమైన ప్రదేశం ఎక్కడుందో తెలుసా?
ఈ ట్రైన్ రూట్ హర్యానాలోని కల్క నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా వరకు ఉంది. 96 కి.మీ. దూరం ఉండే ఈ ట్రైన్ రూట్ అద్భుతమైన ప్రకృతి అందాలను మనకు పరిచయం చేస్తుంది.
ఈ ట్రైన్ జర్నీలో మీరు 20 స్టేషన్స్ ని కవర్ చేయొచ్చు. 103 సొరంగాలు(టన్నెల్స్)లోంచి ట్రైన్ వెళుతుంది. 912 లోయలు, 969 వంతెనలను ఆ ట్రైన్ దాటుకుంటూ వెళుతుంది. ఈ దారిలో ఎన్నో కొండలు, లోయలు, అడవులు కనిపిస్తాయి. దీన్ని బట్టి ఈ ట్రైన్ జర్నీ ఎంత అందంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఈ ట్రైన్ రూట్ ని ఇండియన్ రైల్వేస్ క్రౌన్ అంటారు. ఈ ట్రైన్ రూట్ ని 2008లో UNESCO గుర్తించింది.
హర్యానాలోని కల్క నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లా వరకు ఉన్న ఈ ట్రైన్ రూట్ ని 1903లో ఇండియన్ రైల్వే ప్రారంభించింది.
ఇక్కడికి వెళ్లాలంటే ముందుగా మీరు డిల్లీ చేరుకోవాలి. డిల్లీ వరకు మీరు ట్రైన్ లేదా విమానంలో చేరుకొని అక్కడి నుంచి కల్క టౌన్ కి చేరుకోవచ్చు. లేదా డిల్లీ నుంచి డైరెక్ట్ సిమ్లా వెళ్లి అక్కడి నుంచి కల్క కు ట్రైన్ జర్నీ చేయొచ్చు.