MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • UPI : ఏప్రిల్ 1 నుండి ఈ మొబైల్స్ లో ఫోన్ పే, గూగుల్ పే పనిచేయవు... మీరు కూడా చెక్ చేసుకొండి

UPI : ఏప్రిల్ 1 నుండి ఈ మొబైల్స్ లో ఫోన్ పే, గూగుల్ పే పనిచేయవు... మీరు కూడా చెక్ చేసుకొండి

UPI Service ఏప్రిల్ 1 నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. దీంతో ఆర్థిక పరమైన అనేక విషయాల్లో కీలక మార్పులు ఉండనున్నాయి. అందులో భాగంగానే యూపిఐ సేవల్లో కూడా కీలక పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. 

3 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 28 2025, 11:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
UPI Service

UPI Service

UPI Service : ఆధునిక టెక్నాలజీ పుణ్యాన బ్యాంకుల చుట్టూ తిరిగే పని తప్పింది. UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్) రాకతో ఇప్పుడు అన్ని ఆర్థిక లావాదేవీలు స్మార్ట్ ఫోన్ ద్వారానే జరిగిపోతున్నాయి. కేవలం బ్యాంకింగ్ సేవలే కాదు కరెంట్, వాటర్ బిల్లు వంటివి కూడా ఇంట్లో కూర్చునే చెల్లిస్తున్నారు. ఇలా యూపిఐ ఆధారంగా పనిచేసే ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం వంటి యాప్స్ ను ఇప్పుడు ప్రతిఒక్కరు వాడుతున్నారు. రూపాయి నుండి లక్షల రూపాయల వరకు ఎలాంటి పేమెంట్స్ అయినా ఈ యాప్స్ నుండే ఈజీగా జరిగిపోతున్నాయి. 

అయితే మరో మూడ్రోజుల్లో ఆర్థిక సంవత్సరం మారనుండటంతో యూపిఐ రూల్స్ లో కూడా కొన్ని మార్పులు జరుగుతున్నాయి. ఏప్రిల్ 1 నుండి కొన్ని ఫోన్ల నెంబర్లకు ఈ యూపిఐ సేవలు నిలిచిపోనున్నాయి. ఇలా ఎందుకు నిలిపివేస్తున్నారు? ఇందులో మీ ఫోన్ నెంబర్ కూడా ఉందా? తిరిగి యూపిఐ సేవలు పొందాలంటే ఏం చేయాలి? ఇక్కడ తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
UPI Service

UPI Service

ఆ ఫోన్ నెంబర్లకు యూపిఐ సేవలు బంద్ : 

ప్రస్తుతం చాలా ఆర్థిక లావాదేవీలు ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి.  భారీగా ఆర్థిక లావాదేవీలుంటూనే బ్యాంకుకు వెళ్లడం లేదంటే నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్నారు. మిగతా లావాదేవీల కోసం యూపిఐ ఆధారితంగా పనిచేసే ఫోన్ పే, గూగుల్ పే వంటివి వాడుతున్నారు. కూరగాయల బండి నుండి లగ్జరీ హోటల్స్ వరకు ప్రతిచోట ఆన్ లైన్ పేమెంట్స్ యాప్స్ ఉపయోగించే సౌకర్యం ఉంది. కాబట్టి చాలామంది డబ్బులను వెంటపెట్టుకెళ్లడం మరిచిపోయారు... పేమెంట్స్ యాప్ నే ఉపయోగిస్తున్నారు. 

ఇలా ఆన్ లైన్ లోనే ఆర్థిక లావాదేవీలు పెరిగిపోవడం ద్వారా సైబర్  నేరాలు కూడా పెరిగిపోయాయి. మనకు తెలియకుండానే మన అకౌంట్లోని డబ్బులు కొట్టేసే ముఠాలు పెరిగిపోయాయి. దీంతో అప్రమత్తమైన నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ఫోన్ నెంబర్లకు యూపిఐ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించారు.  

చాలాకాలంగా ఉపయోగించని ఫోన్ నెంబర్లకు యూపిఐ సేవలు నిలివేయాలంటూ బ్యాంకులు, సర్వీస్ ప్రొవైడర్లకు ఎన్పిసిఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏప్రిల్ 1 నుండి యాక్టివ్ లో లేని లేదా ఎక్కువకాలం వాడకుండా ఉన్న ఫోన్ నెంబర్లకు ఫోన్ పే, గూగుల్ పే వంటి ఆన్ లైన్ పేమెంట్ సేవలను నిలిపివేయనున్నాయి బ్యాంకులు. ఆర్థిక మోసాలను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది ఎన్పిసిఐ. 

చాలాకాలంగా ఉపయోగించకుండా ఉండే ఫోన్ నంబర్లను ఇన్ యాక్టివ్ చేస్తాయి సర్వీస్ ప్రొవైడర్స్. తర్వాత ఇదే ఫోన్ నంబర్ ను మరో కస్టమర్ కు కేటాయిస్తాయి. దీంతో గతంలో ఈ నెంబర్ ద్వారా ఉపయోగించిన యూపిఐ సేవలు వారి చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. బ్యాంక్ లావాదేవీల వివరాలు, ఓటిపిలు కూడా వేరేవారి చేతిలోకి వెళతాయి. దీంతో మోసాలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి వినియోగంలో లేని ఫోన్ నెంబర్లకు యూపిఐ సేవలను నిలిపివేయాలని నిర్ణయించారు. 

33
Phome Pe, Google Pay

Phome Pe, Google Pay

యూపిఐ సేవలు బంద్ అయ్యే నెంబర్ల జాబితాలో మీ నంబర్ ఉందో లేదో ఎలా తెలుసుకోవడం?

మీరు కూడా చాలాకాలంగా ఏవయినా ఫోన్ నంబర్లు ఉపయోగించడంలేదా? కానీ ఆ నంబర్ తోనే యూపిఐ యాక్టివేట్ లో ఉందా? అయితే ఈ నంబర్ కు ఏప్రిల్ 1 నుండి యూపిఐ సేవలు నిలిచిపోతాయి. ఇప్పటికే మీ నంబర్ కు యూపిఐ సేవలు నిలిపివేయనున్నట్లు మెసేజ్ వచ్చివుంటుంది. దీంతో మీరు అప్రమత్తం కావాల్సి ఉంటుంది. 

యూపిఐ సేవలు నిలిచిపోకుండా వుండాలంటే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. మెసేజ్ వచ్చాక కూడా ఎలాంటి స్పందన లేకపోతే ఆ నంబర్ కు యూపిఐ సేవలు నిలిపివేస్తారు. దీంతో ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపే అవకాశం ఉండదు. 

బ్యాంకు నుండి మీకు ఆర్థిక లావాదేవీలు, ఇతర వివరాలకు సంబంధించిన మెసేజ్ లు వస్తున్నాయంటే మీ ఫోన్ నంబర్ యాక్టివ్ లో ఉన్నట్లే. ఇలాంటి నంబర్లు కలిగినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇలాంటి నంబర్లకు కూడా యూపిఐ సేవలు నిలిచిపోతే వెంటనే బ్యాంకును సంప్రదించండి లేదంటే బ్యాంక్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి విషయం చెప్పండి. మీ సమస్య పరిష్కారం అవుతుంది. 

మొత్తంగా ఏప్రిల్ 1 నుండి కొన్ని ఫోన్ నెంబర్లకు మాత్రమే యూపిఐ సేవలు నిలిచిపోతాయి... కాబట్టి ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వినియోగంలో లేని నంబర్లపై మాత్రమే చర్యలు తీసుకుంటారు... యాక్టివ్ గా ఉండే నంబర్లకు యధావిధిగానే యూపిఐ సేవలు అందుబాటులో ఉంటాయి... ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ఎప్పటిలాగే పనిచేస్తాయి. 


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
భారత దేశం
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
BLS Polymers IPO: మొదటి రోజే ఇన్వెస్టర్లకు నోట్ల వర్షం.. ఈ ఐపీఓ 65% లాభాలతో ధమాకా ఎంట్రీ
Recommended image2
Most Expensive Water Bottle: రూ. 50 లక్షల వాటర్ బాటిల్.. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నీళ్ళను నీతా అంబానీ తాగేది నిజమేనా?
Recommended image3
ITR Filing 2026: 60 ఏళ్లు వచ్చినా ఆగట్లేదు.. యంగ్ ఇండియా స్టైలే వేరు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved