MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Business
  • ఏంటీ.. రూ.24.8 లక్షల కోట్ల లావాదేవీలా? అది కూడా ఒక్క నెలలో.. యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో కొత్త రికార్డ్

ఏంటీ.. రూ.24.8 లక్షల కోట్ల లావాదేవీలా? అది కూడా ఒక్క నెలలో.. యూపీఐ ట్రాన్సాక్షన్స్ లో కొత్త రికార్డ్

UPI Transactions: దేశ వ్యాప్తంగా జరుగుతున్న యూపీఐ ట్రాన్సాక్షన్స్ రోజురోజుకు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఒక్క మార్చి నెలలో రూ.24.8 లక్షల కోట్ల విలువైన యూపీఐ లావాదేవీలు జరిగాయంటే ప్రజలు డిజిటల్ టెక్నాలజీ ట్రాన్సాక్షన్స్ ని ఎంతలా వినియోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కొత్త ఏడాదిలో డిజిటల్ ఇండియా రెట్టింపు వేగంతో దూసుకుపోతోంది. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 02 2025, 05:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

యూపీఐ ఎప్పుడూ రికార్డులు కొడుతూనే ఉంది. 2025 మార్చి నెలలో రూ.24.8 లక్షల కోట్ల విలువైన డబ్బులు చేతులు మారాయి. అది కూడా 1,830 కోట్ల లావాదేవీలకే ఇన్ని రూ.లక్షల కోట్లు మార్పిడి జరగడం నిజంగా రికార్డే. గత ఏడాది ఇదే టైంలో జరిగిన లావాదేవీలతో పోలిస్తే ఇది 36% ఎక్కువ. డబ్బు విలువ కూడా 25% పెరిగింది. దీన్ని బట్టి ఇండియా డిజిటల్ లావాదేవీల్లో ఎంత వేగంగా డవలప్ అవుతోందో అర్థం చేసుకోవచ్చు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ ఏడాది అంటే 2025 ఫిబ్రవరి నెలలో దాదాపు రూ.22 లక్షల కోట్ల విలువైన 1,611 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇదే పెద్ద రికార్డు అనుకుంటే మార్చి నెలలో మరో రూ.రెండు లక్షల కోట్లు ట్రాన్సాక్షన్స్ జరగడం అద్భుతమైన విషయం. ఈ లెక్కన మార్చి నెలలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ప్రకారం ఇప్పుడు రోజుకు సగటున 59 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయన్న మాట.

అంటే ప్రతి సెకనుకు 6,800 లావాదేవీలను యూపీఐ హ్యాండిల్ చేస్తోంది. ఈ లెక్కన రోజువారీ లావాదేవీల విలువ రూ.79,910 కోట్లు.

35

గతంలో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగిన నెలలను గమనిస్తే అక్టోబర్ 2024లో ఒక నెలలోనే ఎక్కువ లావాదేవీలు జరిగాయి. అప్పుడు రూ.23.5 లక్షల కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. పండుగల సీజన్ కావడంతో ఆన్‌లైన్ అమ్మకాలు బాగా జరగడం వల్ల ఇంత ఎక్కువ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 

45

యూపీఐ ట్రాన్సాక్షన్స్ లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది

లావాదేవీల సంఖ్య పరంగా జనవరి 2025లో 1,700 కోట్ల లావాదేవీలు జరిగాయి. 2025 ఆర్థిక సంవత్సరం మొత్తానికి యూపీఐ లావాదేవీలు మొత్తం 18,586 కోట్లు కాగా, దీని విలువ రూ.260.5 లక్షల కోట్లుగా లెక్క తేలింది. 

ఇది కూడా చదవండి అంతరిక్షంలో పుట్టగొడుగులు పెంచితే ఎలా ఉంటుంది? ఎలాన్ మస్క్ కొత్త ప్రయోగం

55

యూపీఐ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూస్తే షాక్ అవుతారు

2024 ఆర్థిక సంవత్సరంలో 13,113 కోట్ల లావాదేవీలలో రూ.200 లక్షల కోట్ల డబ్బులు చేతులు మారాయి. దీంతో పోలిస్తే 2025లో బాగా పెరిగింది. లావాదేవీల సంఖ్య 41% పెరిగింది. వాటి విలువ 30% పెరిగింది. ఇంత వేగంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరగడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇది నిజంగా అద్భుతమైన విషయం. ట్యాక్సులు ఎగ్గొట్టకుండా, నిజాయతీగా లావాదేవీలు జరుగుతుండటం వల్ల దేశం కూడా వేగంగా డవలప్ అవుతుందనడంలో సందేహం లేదు. 

 

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: భారీగా కుప్పకూలిన వెండి..నేల చూపులు చూస్తున్న పసిడి...మార్కెట్ లో ఎలా ఉందంటే?
Recommended image2
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image3
సెకండ్ హ్యాండ్ కార్ కొంటున్నారా? ఏది కొనాలి, ఎక్కడ కొనాలి, ఏమేం చెక్ చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved