- Home
- Business
- UPI Alert: ఏప్రిల్ 1 నుంచి సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడ్డట్టే.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంల యాప్ లు సేఫ్
UPI Alert: ఏప్రిల్ 1 నుంచి సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడ్డట్టే.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంల యాప్ లు సేఫ్
UPI Alert: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ(Unified Payments Interface) సేవలో ఏప్రిల్ 1, 2025 నుంచి ఒక కొత్త మార్పు రాబోతుంది. ఈ చర్య వల్ల సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అమలులోకి రానున్న మార్పేంటి? దాని వల్ల ఉపయోగాల గురించి వివరంగా తెలుసుకుందాం.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన ప్రకటన ప్రకారం చాలా కాలంగా వాడుకలో లేని మొబైల్ నంబర్లు, బ్యాంక్ ఖాతాలకు లింక్ అయి ఉంటే వాటిని యూపీఐ సేవ నుంచి తొలగిస్తారు. అంటే పని చేయని నంబర్ తో ఉన్న ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే వంటి యాప్‌ల ద్వారా ఇకపై మీరు డబ్బులు పంపలేరు.
సైబర్ నేరాలు కంట్రోల్ చేయడానికే..
ఈ నిర్ణయం తీసుకోవడానికి ముఖ్య కారణం.. సైబర్ నేరాలు పెరిగిపోవడమే. చాలా కాలంగా వాడని నంబర్లను స్కామర్లు ఉపయోగించే అవకాశం ఉందని, దీని వల్ల టెక్నికల్ సమస్యలు వచ్చి, మోసాలకు దారి తీయొచ్చని NPCI హెచ్చరించింది. ఇంకో విషయం ఏంటంటే... సాధారణంగా కొంత కాలం నిరుపయోగంగా ఉన్న మొబైల్ నంబర్లను టెలికాం కంపెనీలు వేరేవాళ్లకు ఇస్తుంటాయి. అవి గాని మోసగాళ్ల చేతికి అందితే వాటిని వాడుకుని బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు కొట్టేసే అవకాశం ఉందని NPCI తెలిపింది.
యూజర్లకు సూచన
యూపీఐ సేవలను మీరు కొనసాగించాలనుకుంటే మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేసిన మొబైల్ నంబర్ పనిచేస్తుందో లేదో చూసుకోండి. మీ టెలికాం కంపెనీకి కాల్ చేసి, మీ నంబర్ స్టేటస్ తెలుసుకోండి. చాలా కాలంగా రీఛార్జ్ చేయకుండా లేదా వాడకుండా ఉంటే వెంటనే రీఛార్జ్ చేసి వాడుకలోకి తీసుకురండి. లేదా మీ బ్యాంక్ ఖాతాలో కొత్త మొబైల్ నంబర్ లింక్ చేయండి. దీని ద్వారా సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి అవకాశం లభిస్తుంది.
బ్యాంకులు, యూపీఐ యాప్‌లకు ఆర్డర్
పనిచేయని మొబైల్ నంబర్ల రికార్డులను వారానికి ఒకసారి చెక్ చేయమని బ్యాంకులకు, యూపీఐ యాప్‌లకు ఇప్పటికే NPCI ఆర్డర్ వేసింది. దీనివల్ల వాడుకలో ఉన్న నంబర్లు మాత్రమే బ్యాంక్ ఖాతాలకు లింక్ అయి ఉంటాయి. దీనివల్ల సైబర్ నేరాలు, టెక్నికల్ సమస్యలు తగ్గుతాయని అధికారులు అనుకుంటున్నారు.
హెచ్చరిక
యూపీఐ యాప్‌ను వాడుతూ ఉండాలంటే మీ మొబైల్ నంబర్‌ను వెంటనే చెక్ చేసుకోండి. ఏప్రిల్ 1, 2025 లోపు మీరు ఈ పని చేయకపోతే మీ యూపీఐ సేవ ఆగిపోతుంది.
ఇది కూడా చదవండి: ఈ కార్డు మీ దగ్గర ఉంటే ఆన్‌లైన్ మోసాలకు చెక్ పడ్డట్టే