QR Code PAN Card: ఆన్ లైన్ మోసాలు ఎంతలా పెరిగిపోయాయంటే మన అనుమతి లేకుండానే మన బ్యాంకు అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు. ఇంతకు ముందు ఓటీపీలైనా వచ్చేవి ఇప్పుడు అవి కూడా అవసరం లేకుండా డబ్బులు కాజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ దగ్గర ఈ కార్డు గాని ఉంటే ఆన్ లైన్ లో మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేరు. ఆ కార్డు గురించి తెలుసుకుందాం రండి.
ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఎంత భద్రతా విధానాలు అమలు చేస్తున్నా స్కామర్లు కొత్త దారుల్లో ప్రజలను దోచేస్తున్నారు. అందుకే ఇటీవల PAN 2.0 పేరుతో కొత్త పాన్ కార్డులను జారీ చేయడం ప్రారంభించింది. కొత్తగా పాన్ కార్డుకు అప్లై చేస్తే దానిపై క్యూఆర్ కోడ్ ప్రింట్ చేసి జారీ చేస్తారు. పాత పాన్ కార్డు ఉన్న వారు కొత్తది కావాలనుకుంటేనే అప్లై చేయొచ్చు. కొత్తది తీసుకోకపోయినా పాత పాన్ కార్డు యధావిధిగా పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
మోసాలకు చెక్ పెట్టడానికి కేంద్రం చర్యలు
ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అయితే పాత పాన్ కార్డును క్యూఆర్ కోడ్ తో అప్ డేట్ చేయించుకుంటే ఆన్ లైన్ మోసాలకు చెక్ పడ్డట్టేనని కేంద్రం ప్రభుత్వం చెబుతోంది. ఎందుకంటే క్యూఆర్ కోడ్ అంత స్ట్రాంగ్ భద్రతను అందిస్తుందని చెబుతున్నారు.
QR కోడ్ తో మోసాలకు అడ్డుకట్ట
QR కోడ్ కలిగిన పాన్ కార్డులలో వ్యక్తిగత సమాచారం చాలా భద్రంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పాన్ కార్డుకు QR కోడ్ యాడ్ చేయడం వల్ల అనేక మోసాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్రం చెబుతోంది. ఎందుకంటే QR కోడ్ లో సమాచారం ఎన్‌క్రిప్ట్ అయి ఉంటుంది. క్యూఆర్ కోడ్ ఉన్న పాన్ కార్డు ను కాపీ చేయడం కూడా కష్టమే.
QR కోడ్ ఉండటం వల్ల నకిలీ PAN కార్డులు తయారు చేయడం మోసగాళ్లకు కష్టమే. అందుకే మోసాలు జరగడానికి మాక్సిమం చాన్స్ ఉండదు. వ్యక్తిగత సమాచారానికి భద్రత కల్పించడమే లక్ష్యంగా మోడీ సర్కార్ PAN 2.0 ను తీసుకొచ్చింది. దీని కోసం రూ.1,435 కోట్లు కేటాయించింది. ఈ PAN కార్డు అప్డేషన్ పూర్తిగా ఉచితంగా చేస్తున్నారు.
క్యూఆర్ కోడ్ పాన్ కార్డ్ కోసం ఇలా అప్లై చేయండి
ఇప్పటికే మీ దగ్గర పాత పాన్ కార్డు ఉంటే దాన్ని యథావిధిగా ఉపయోగించుకోవచ్చు. కాని మీ వ్యక్తిగత సమాచారం మరింత భద్రంగా ఉండాలని మీరు కోరుకుంటే క్యూఆర్ కోడ్ ఉన్న కొత్త పాన్ కార్డు కోసం అప్లై చేసుకోండి. దీనికోసం మీరు గూగుల్ లో NDSL(National Securities Depository Limited) అని టైప్ చేసి ఎన్డీఎస్ఎల్ అఫీషియల్ వెబ్ సైట్ లో కొత్త పాన్ కార్డ్ కోసం అప్లై చేయండి. దీని కోసం ప్రత్యేకంగా డబ్బులు ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. కాని పాన్ కార్డ్ డెలివరీ ఛార్జీ కింద రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. QR కోడ్ ఉన్న పాన్ కార్డును మీరు ఎక్కడ ఉపయోగించినా నకిలీ తయారు చేయడానికి ఉపయోగపడవు.