Top Safest Cars: క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించిన టాప్ 5 సేఫ్టీ కార్లు ఇవే!
Top 5 Safest Cars in India 2025: 'భారత్ NCAP' (Bharat New Car Assessment Programme) టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ పొందిన టాప్ 5 కార్లు ఇవే.

టాప్ 5 సేఫ్టీ కార్లు
Top 5 Safest Cars in India 2025: నేడు భారతీయ కస్టమర్లు కారు కొనుగోలు చేసేటప్పుడు భద్రతకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 2023లో 'భారత్ NCAP' (Bharat New Car Assessment Programme)ప్రారంభించింది. ఇది గ్లోబల్ NCAP ప్రమాణాల ఆధారంగా భారత మార్కెట్‌లో అమ్మకానికి ఉన్న కార్ల భద్రతా ప్రమాణాలను పరీక్షించి స్టార్ రేటింగ్‌లను ఇస్తోంది. ఈ ఇందులో హై రేటింగ్ పొందిన కార్లను అత్యంత భద్రత కలిగిన కార్లుగా గుర్తిస్తారు. ఇంతకీ అత్యధిక రేటింగ్ పొందిన టాప్ 5 కార్స్ ఏంటో ఓ లూక్కేద్దాం.
1. టాటా హారియర్ ఈవీ (Tata Harrier EV)
టాటా హారియర్ EV అనేది టాటా మోటార్స్ నుంచి వచ్చిన లేటెస్ట్ ఎలక్ట్రిక్ SUV. ఇది జూన్ 2025లో భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇది AOP స్కోర్‌లో 32/32 మార్కులు సాధించిన వెహికల్ కావడం విశేషం. ఈ కారు సేప్టీ ఫీచర్స్ చూస్తే.. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు (రిమైండర్‌తో), ESC (Electronic Stability Control), ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, ఇతర లేటెస్ట్ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఈ ఫీచర్స్ తో టాటా హారియర్ EV మార్కెట్‌లోనే అత్యంత భద్రత కలిగిన ఎలక్ట్రిక్ SUVలలో ఒకటిగా నిలుస్తోంది.
2. మహీంద్రా ఎక్స్ ఈవీ 9 ఈ ( Mahindra XEV 9e)
మహీంద్రా XEV 9e అనేది BE 6తో పాటు భారత్ NCAP టెస్టులో 5 స్టార్ రేటింగ్‌ను పొందిన మరో ప్రీమియం ఎలక్ట్రిక్ కారు. ఈ జాబితాలో 32/32 స్కోర్ సాధించిన తొలి వాహనం ఇది. దీని టాప్-ఎండ్ వేరియంట్ ‘ప్యాక్ త్రీ’ టెస్ట్‌కు లోనైంది. ఈ రేటింగ్ కేవలం టెస్ట్ వేరియంట్‌కి మాత్రమే కాకుండా, XEV 9e మొత్తం వేరియంట్ లైనప్‌కి వర్తిస్తుంది. ఇది కోపే-స్టైల్ ఎలక్ట్రిక్ SUVగా ఆకట్టుకుంటుంది.
ఇక భద్రతా విషయానికి వస్తే.. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, వెనుక డిస్క్ బ్రేక్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)వంటి ఫీచర్లు బేస్ వేరియంట్ అయిన ప్యాక్ వన్ నుండే అందించబడుతున్నాయి. ఈ ఫీచర్స్ తో ఈ కారు భద్రత పరంగా అత్యుత్తమంగా నిలిచింది.
3. మహీంద్రా బీఈ 6 ( Mahindra BE 6)
BE 6 అనేది మహీంద్రా నుంచి వచ్చిన తొలి ఎలక్ట్రిక్ SUVలలో ఒకటి. జనవరి 2025లో భారత్ NCAP టెస్టులో ఈ కారు 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఈ రేటింగ్ మొత్తం వేరియంట్ లైనప్‌కు వర్తించుతుంది. భద్రత పరంగా BE 6 చాలా బెస్ట్ . ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ కెమెరా, సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి. అలాగే డ్రైవర్ అలర్ట్‌నెస్ కోసం డ్రైవర్ స్లీప్ డిటెక్షన్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇవి డ్రైవింగ్ సమయంలో భద్రతను మరింతగా మెరుగుపరుస్తాయి.
4. టాటా పంచ్ ఈవీ (Tata Punch EV)
భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా పంచ్ EV 5-స్టార్ రేటింగ్ పొందింది. భారత్ NCAP టెస్ట్ ఎదుర్కొన్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి , స్మాల్ సెగ్మెంట్‌లో అత్యధిక భద్రతా స్కోర్‌ను సాధించిన కారుగా నిలిచింది. ఈ కారులో ఎన్నో భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ప్రధానంగా ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్( ESP), హిల్ హోల్డ్ కంట్రోల్ ఉన్నాయి. అదేవిధంగా ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు, వెనుక పార్కింగ్ సెన్సార్లు , టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి పలు సెప్టీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ ఈ కారును మోస్ట్ సేప్టీ కారుగా మార్చాయి.
5. మహీంద్రా థార్ రాక్స్ ( Mahindra Thar Roxx)
మహీంద్రా థార్ రాక్స్ SUV ది బెస్ట్ వెహికల్. నవంబర్ 2024లో జరిగిన భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో మహీంద్రా థార్ రాక్స్ కు 5 స్టార్ రేటింగ్ లభించింది, ఇది అన్ని వేరియంట్‌లకు వర్తిస్తుంది. థార్ రాక్స్ ప్రామాణికంగా పలు భద్రతా లక్షణాలతో వస్తుంది. వీటిలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ప్యాసింజర్ సీట్ ఎయిర్‌బ్యాగ్‌కు కట్-ఆఫ్ స్విచ్, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు ఉన్నాయి. అలాగే అన్ని సీట్లకు మూడు-పాయింట్ల సీట్‌బెల్ట్‌లు, సీట్‌బెల్ట్ రిమైండర్‌లు కూడా ఉంటాయి. ఇంకా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)వంటి ఫీచర్స్ వాహనం నడిపేటప్పుడు అదనపు భద్రతను కల్పిస్తాయి. థార్ రాక్స్ AX5L, AX7L ట్రిమ్‌లలో ADAS టెక్నాలజీ ఉంది. ఇది అధునాతన డ్రైవింగ్ సహాయ వ్యవస్థలు అందిస్తుంది.