- Home
- Business
- Business Ideas : కేవలం పిల్లులతో రూ.20 లక్షలు సంపాదించవచ్చా..! ఈ కొత్త బిజినెస్ ఏంటో తెలుసా..?
Business Ideas : కేవలం పిల్లులతో రూ.20 లక్షలు సంపాదించవచ్చా..! ఈ కొత్త బిజినెస్ ఏంటో తెలుసా..?
ఏమిటీ… కేవలం పిల్లులకు ఫుడ్ పెట్టి లక్షలకు లక్షలు సంపాదించవచ్చా. ఇది ఎలా సాధ్యమో ఓ చైనా యువకుడు చేసి చూపించాడు. ఇండియాలో ఇలాంటి బిజినెస్ లు వర్కౌంట్ అవుతాయా..?

ఇది సరికొత్త బిజినెస్...
పిల్లులకు తిండి పెట్టడమూ ఓ వ్యాపారమేనా అని చులకనగా చూడకండి. ఈ వ్యాపారం ఎవరినైనా లక్షాధికారిని చేస్తుందని ఎప్పుడైనా ఊహించారా? కానీ ఇదే జరిగింది. చైనా స్ప్రింగ్ ఫెస్టివల్ (చైనీస్ న్యూ ఇయర్) టైంలో ఓ యువకుడు దీన్ని నిజం చేసి చూపించాడు. అతను కేవలం పిల్లులకు ఆహారం అందించడం, వాటి బాగోగులు చూసుకుని ఏకంగా 1,60,000 యువాన్లు (సుమారు 20 లక్షల రూపాయలు) సంపాదించాడు. ఈ స్టోరీ షాంఘై నగరంలో నివసించే హువాన్ కాంగ్‌ది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ఈ వార్తను మొదట ప్రచురించింది. పండగల సమయంలో ప్రొఫెషనల్ పెట్ కేర్ సర్వీస్‌లకు డిమాండ్ ఎంత వేగంగా పెరుగుతోందో ఈ సంపాదన చూపిస్తోంది.
పెట్ కేర్ సర్వీస్‌లకు డిమాండ్ ఎందుకు పెరుగుతోందా..?
చైనాలో స్ప్రింగ్ ఫెస్టివల్ అతిపెద్ద పండగ. మన దగ్గర సంక్రాంతికి ఊళ్లకు వెళ్లినట్లు, ఈ సమయంలో లక్షలాది మంది తమ సొంతూళ్లకు వెళ్తారు లేదా టూర్లకు వెళుతుంటారు. అప్పుడు వారి పెంపుడు జంతువులు ఇళ్లలో ఒంటరిగా మిగిలిపోతాయి. ఇక్కడే హోమ్ విజిట్ పెట్ కేర్ అవసరం మొదలవుతుంది.
హువాన్ కాంగ్, అతని నలుగురు సభ్యుల బృందం ఈసారి పండక్కి బయటకు వెళ్లకుండా షాంఘైలోనే ఉండి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. పండగకు 20 రోజుల ముందు నుంచి, పండగ తర్వాత వరకు దాదాపు 2,000 ఇళ్లకు వెళ్లి పిల్లుల బాగోగులు చూసుకున్నారు. వీటిలో దాదాపు 1,000 విజిట్లను హువాన్ ఒక్కడే చేశాడు.
ఉదయం 3 నుంచి రాత్రి 11 వరకు పని...
- పండగ సమయంలో హువాన్ కాంగ్ షెడ్యూల్ చాలా బిజీగా ఉండేది.
- ఉదయం 3 గంటలకు పని మొదలుపెట్టేవాడు.
- రోజంతా వరుసగా ఇళ్లకు వెళ్లేవాడు.
- రాత్రి 10 లేదా 11 గంటల వరకు పనిచేసేవాడు.
- రోజుకు కేవలం 3–4 గంటలు మాత్రమే నిద్రపోయేవాడు.
తన అత్యంత బిజీ రోజున, అతను 55 ఆర్డర్లను పూర్తి చేశాడు. హాలిడే ట్రావెల్ డిమాండ్ సమయంలో పెట్ కేర్ సర్వీస్ ఎంత అవసరమో ఇది తెలియజేస్తోంది.
కేవలం ఆహారం పెట్టడమే పనా?
ప్రతి విజిట్ సుమారు 10 నుంచి 15 నిమిషాలు ఉంటుంది. ఈ సమయంలో అతను..
- లిట్టర్ బాక్స్ శుభ్రం చేస్తాడు.
- ఆహారం, నీళ్లు నింపుతాడు.
- పిల్లి ఆరోగ్యాన్ని చెక్ చేస్తాడు.
- ఇంట్లోని కిటికీలు, ఎలక్ట్రికల్ వస్తువులను చూస్తాడు.
- చెత్తను బయట పడేస్తాడు.
యజమానులు అడిగితే, ఎలాంటి అదనపు ఛార్జీ లేకుండా మందులు వేయడం లేదా గోళ్లు కత్తిరించడం కూడా చేస్తాడు. ఈ నమ్మకమే అతని పెట్ కేర్ బిజినెస్ మోడల్‌కు అతిపెద్ద బలం.
1,60,000 యువాన్ల సంపాదన...
మొత్తం ఆర్డర్లలో 80% కంటే ఎక్కువ మంది కస్టమర్లు పండక్కి తమ సొంతూళ్లకు వెళ్లినవారే. సుమారు 10% మంది ఆఫ్-పీక్ సీజన్‌లో ప్రయాణించే కస్టమర్లు. చాలామంది కస్టమర్లు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అతని సేవలను తీసుకుంటారు. చైనాలో పెట్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఈ కథ స్పష్టంగా చూపిస్తుంది. పెద్ద నగరాల్లో ప్రజలు తమ పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. వాటి సంరక్షణ కోసం నమ్మకమైన సేవలను కోరుకుంటున్నారు.
భారత్‌లో కూడా ఇలాంటి క్యాట్ ఫీడింగ్ బిజినెస్ నడుస్తుందా?
ఈ ప్రశ్న ఇప్పుడు చాలా మంది మదిలో మెదులుతోంది. భారతదేశంలోని పెద్ద నగరాల్లో కూడా ప్రొఫెషనల్ క్యాట్ ఫీడింగ్ సర్వీస్‌ను ప్రారంభించవచ్చా? పండగలు, సెలవుల్లో ప్రజలు బయటకు వెళ్లినప్పుడు ఈ మోడల్ విజయవంతం కావచ్చు. చైనాకు చెందిన ఈ కథ కేవలం 20 లక్షల రూపాయలు సంపాదించడం గురించే కాదు, మారుతున్న జీవనశైలితో హోమ్ విజిట్ పెట్ సర్వీస్ ఒక పెద్ద, నమ్మకమైన వ్యాపారంగా ఎలా మారుతుందో చూపిస్తుంది.

