MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Diwali Gold Buying: దీపావళికి బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టపోతారు

Diwali Gold Buying: దీపావళికి బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టపోతారు

Diwali Gold Buying: దీపావళి లాంటి పండుగలకు బంగారం కొనడం సహజమే. మనదేశంలో ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయం. అయితే ఇప్పుడు పసిడి రేట్లు పెరగడంతో కొద్దిగా కొనాలన్నా ఖర్చే. మరి బంగారం కొనాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారా? అయితే ఇది చూడండి.

2 Min read
Author : Nandini Arava
Published : Sep 29 2026, 03:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బంగారం కొనేటప్పుడు ఇది తెలుసుకోండి
Image Credit : AI

బంగారం కొనేటప్పుడు ఇది తెలుసుకోండి

దీపావళి లాంటి పండుగలకు బంగారం కొనడం సహజమే. మనదేశంలో ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయం. అయితే ఇప్పుడు పసిడి రేట్లు పెరగడంతో కొద్దిగా కొనాలన్నా ఖర్చే. చాలామంది నగలు కొనడాన్ని ఒక పొదుపుగా, ఇంటి అవసరంగా చూస్తారు. కానీ ఇప్పుడు బంగారం ధరలు మండిపోతున్నాయి. పాత రోజుల్లాగా భారీగా ఖర్చు చేయడం అందరికీ సాధ్యం కావడం లేదు. అందుకే ఒకేరోజు పెద్ద మొత్తంలో బంగారం కొనే బదులు, మీ బడ్జెట్‌కు తగ్గట్టు ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పండుగ హడావిడిలో కొనేటప్పుడు, కేవలం బంగారం ధర మాత్రమే కాకుండా అదనపు ఛార్జీలను కూడా మీరు తప్పక లెక్కేసుకోవాలి. ఆఫర్లు చూసి మోసపోకండి. చెక్ చేసుకుని వెళ్లండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎక్స్ ట్రా ఖర్చు
Image Credit : Asianet News

ఎక్స్ ట్రా ఖర్చు

మీరు బంగారు నగలు కొనేటప్పుడు కేవలం బంగారం ధర మాత్రమే చెల్లించరు. తరుగు, మజూరీతో పాటు జీఎస్టీ కూడా పడుతుంది. దీనివల్ల అసలు ధర కంటే మీరు కట్టే మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. నగల డిజైన్, పనితనం, షాపును బట్టి ఈ ఛార్జీలు మారుతుంటాయి. అందుకే జేబులో డబ్బులు పెట్టుకుని షాపుకు వెళ్లే ముందే.. బంగారం ధర, తరుగు, మజూరీ, పన్నుల వివరాలను విడివిడిగా అడిగి తెలుసుకోండి. అప్పుడే మీ జేబులోంచి ఎంత డబ్బు పోతుందో మీకు క్లారిటీ వస్తుంది.

35
ఒకేసారి కొనకండి
Image Credit : our own

ఒకేసారి కొనకండి

బంగారం కొనాలంటే ఒకేరోజు పెద్ద మొత్తంలో కొనాల్సిన అవసరం లేదు. కొద్దికొద్దిగా చిన్న మొత్తాల్లో కొనుక్కుంటే ధరల హెచ్చుతగ్గుల టెన్షన్ ఉండదు. చేతిలో బంగారం ఉండాలనుకునే వాళ్లు నగలకు బదులుగా హాల్‌మార్క్ ఉన్న బంగారు నాణేలు లేదా బిస్కెట్లు కొనడం గురించి ఆలోచించవచ్చు. వీటిపై నగల లాగా తరుగు, మజూరీ ఛార్జీలు పడవు. అయితే కొనేముందు షాపు వాళ్లు వేసే ఛార్జీలు, స్వచ్ఛత, హాల్‌మార్క్, తిరిగి అమ్మితే ఎంత వస్తుందనే విషయాలను మీరు కచ్చితంగా చెక్ చేసుకోవాలి.

45
బంగారంలో పెట్టుబడి
Image Credit : our own

బంగారంలో పెట్టుబడి

బంగారాన్ని ఒక పెట్టుబడిగా చూసేవాళ్లు కేవలం నగలే కొనాల్సిన పనిలేదు. గోల్డ్ ఈటీఎఫ్‌ల (Gold ETFs) ద్వారా కూడా మీరు పెట్టుబడి పెట్టొచ్చు. కొన్ని స్కీమ్స్‌లో నెలకు రూ.500 లేదా రూ.1,000 లాంటి చిన్న మొత్తాలతో సిప్ (SIP) చేసే సదుపాయం ఉంటుంది. దీనివల్ల ఇంట్లో బంగారాన్ని దాచుకునే రిస్క్ తప్పుతుంది. అయితే ఇలాంటి పెట్టుబడులకు మార్కెట్ రిస్క్, ఛార్జీలు, నిబంధనలు ఉంటాయి. కాబట్టి డబ్బులు పెట్టేముందు వాటి గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి. అందరికీ ఒకే పద్ధతి సెట్ అవ్వదు, మీ అవసరానికి తగ్గట్టు సరైన దాన్ని ఎంచుకోండి.

55
బంగారు నగలు కొనేవారు
Image Credit : our own

బంగారు నగలు కొనేవారు

ఈ దీపావళికి మీరు బంగారం కొనాలని ప్లాన్ చేసుకుంటే, ముందుగా మీ బడ్జెట్ ఎంత ఉందో లెక్కేసుకోండి. నగల డిజైన్ చూసి మురిసిపోయే బదులు, దానికి మొత్తం ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకేసారి ఎక్కువ డబ్బులు పెట్టే బదులు, అవసరాన్ని బట్టి కొద్దిగా కొనడం లేదా ఇతర గోల్డ్ స్కీమ్స్‌లో పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించండి. ముఖ్యంగా బంగారం ధరలు మండిపోతున్న ఈ టైమ్‌లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి ఛార్జీని బేరీజు వేసుకున్నాకే కొంటే మీ జేబుకు చిల్లు పడకుండా ఉంటుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Post Office: ప్ర‌ధాని మోదీ కూడా ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెడుతున్నారు.. మీరు కూడా ట్రై చేస్తారా.?
Recommended image2
LPG New Rules October 1: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుండి కొత్త రూల్స్
Recommended image3
Gold price Fall: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్...మూడో రోజు బంగారం ధరలకు బ్రేక్..దిగొచ్చిన గోల్డ్
Related Stories
Recommended image1
Divorce Survey: విడాకుల తర్వాత మెమోరీస్ దాచుకుంటున్నారట.. మాజీ భాగస్వాములతో హద్దులపై కొత్త సర్వే
Recommended image2
Gold price Fall: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్...మూడో రోజు బంగారం ధరలకు బ్రేక్..దిగొచ్చిన గోల్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved