MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Gold Price Hike: కొంపముంచిన పసిడి.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం...కొనుగోలుదారులకు షాక్

Gold Price Hike: కొంపముంచిన పసిడి.. మళ్లీ భారీగా పెరిగిన బంగారం...కొనుగోలుదారులకు షాక్

Gold Price Hike: కొన్ని రోజులుగా తగ్గిన బంగారం ధరలు..ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయి. ఈ వారం ప్రారంభంలో భారీగా తగ్గిన పసిడి బుధవారం తిరిగి పెరిగింది. సెప్టెంబర్‌లో అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి.

2 Min read
Author : Nandini Arava
Published : Sep 30 2026, 11:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పసిడి ప్రియులకు భారీ షాక్
Image Credit : chatgpt

పసిడి ప్రియులకు భారీ షాక్

బంగారం కొనాలని చూస్తున్నవారికి ఈరోజు బిగ్ షాక్ అనే చెప్పాలి. రెండు రోజులుగా తగ్గుతూ ఊరట కల్పించిన పసిడి...ఇవాళ కొంపముంచింది. వరుసగా తగ్గిన బంగారం ధరలు..ఇప్పుడు మళ్లీ పుంజుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బుధవారం 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.700 పెరిగింది. దీంతో 10 గ్రాముల పసిడి రేటు రూ.1,37,100కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాములకు రూ.770 పెరగడంతో.. ధర రూ.1,49,570కు చేరింది.

ఇక వెండి విషయానికి వస్తే.. సెప్టెంబర్ 30న రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ.2.40 లక్షలుగా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బంగారానికి కలిసి రావొచ్చు
Image Credit : Getty

బంగారానికి కలిసి రావొచ్చు

రానున్న రోజుల్లో బంగారం ధరలపై అంతర్జాతీయ నిపుణుల అంచనాలు ఆసక్తిని పెంచుతున్నాయి. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగడం, డాలర్ బలహీనపడే అవకాశం, బాండ్ యీల్డ్స్‌లో మార్పులు వంటి అంశాలు పసిడికి అనుకూలంగా మారొచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

మరోవైపు..బంగారం ధరలు ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో భారీ స్థాయికి చేరుకున్నాయి. అయితే రాబోయే ఆరు నుంచి 12 నెలల్లో ఔన్స్ బంగారం ధర 5,000 డాలర్ల స్థాయికి చేరే అవకాశం ఉందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. కేంద్ర బ్యాంకుల నుంచి బంగారం కొనుగోళ్లు పెరగడం పసిడికి కీలకంగా మారొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు సాధారణంగా సురక్షిత ఆస్తుల వైపు చూడటం కూడా బంగారానికి కలిసొచ్చే అంశంగా మారవచ్చు.

34
ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి
Image Credit : Getty

ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి

అయితే మరోవైపు చమురు ధరలు కూడా కీలకంగా మారుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు ఎక్కువకాలం అధిక స్థాయిలో కొనసాగితే.. ఇంధనాన్ని దిగుమతి చేసుకునే దేశాల ఆర్థిక వ్యవస్థలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. భారత్‌ వంటి ఇంధన దిగుమతులపై ఆధారపడే దేశాల మార్కెట్లపై దీని ప్రభావం ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఏఐ, టెక్నాలజీ వంటి రంగాల వైపు పెట్టుబడులు మళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

44
మార్కెట్లు గమనించాలి
Image Credit : Freepik

మార్కెట్లు గమనించాలి

ఒకవైపు బంగారం ధరలు ఇప్పటికే భారీ స్థాయిలో ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయ సంస్థల నుంచి మరింత పెరుగుదలపై అంచనాలు వినిపిస్తున్నాయి. అందుకే బంగారం ధర పెరుగుతుందని ఒక్కసారిగా భారీగా పెట్టుబడి పెట్టడం కంటే.. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ దశలవారీగా పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం ధరలు రోజురోజుకూ మారే అవకాశం ఉన్నందున.. కొనుగోలు చేసే ముందు మీ నగరంలోని తాజా రేటుతో పాటు మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Diwali Gold Buying: దీపావళికి బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ తప్పు చేస్తే వేలల్లో నష్టపోతారు
Recommended image2
Post Office: ప్ర‌ధాని మోదీ కూడా ఈ ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెడుతున్నారు.. మీరు కూడా ట్రై చేస్తారా.?
Recommended image3
LPG New Rules October 1: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుండి కొత్త రూల్స్
Related Stories
Recommended image1
Gold Price Crash: పసిడి ప్రియులకు బిగ్ రిలీఫ్.. రూ.2,500కు పైగా తగ్గిన బంగారం
Recommended image2
Gold price Fall: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్...మూడో రోజు బంగారం ధరలకు బ్రేక్..దిగొచ్చిన గోల్డ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved