Top 10 Billionaires: రూ.33 లక్షల కోట్ల ఆస్తి.. కేవలం 10 మంది వద్దే ఉంది. వారెవరంటే..
Top 10 Billionaires: ఇండియాలో 2025 సంవత్సరానికి కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ సుమారు రూ.50 లక్షల కోట్లు. కాని మీకు తెలుసా? మన దేశంలోనే కేవలం 10 మంది వద్ద ఉన్న ఆస్తి రూ.33 లక్షల కోట్లు. అంటే దేశ బడ్జెట్ లో సుమారు మూడు వంతల ధనం ఆ పది మంది వద్దే ఉందన్న మాట. ఆ కుబేరులు ఎవరు? టాప్ ఉన్న వారెవరు? తదితర వివరాలు తెలుసుకుందాం రండి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఇండియా ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్కిల్ ఉంటే డబ్బు వేగంగా సంపాదించే ఉపాధి మార్గాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు రంగాలు అనేక ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. రోడ్డు, రైల్వే, విమానం, సముద్రయానం, ట్రావెల్, ఇలా అనేక రంగాల్లో ప్రైవేటు కంపెనీలు పెట్టుబడులు పెడుతూ ప్రజలకు ఉపాధి కల్పించడం ద్వారా ఆయా కంపెనీలు రూ.లక్షల కోట్లు సంపాదిస్తున్నాయి. ఇలా కొన్ని ప్రపంచ దిగ్గజ కంపెనీలుగా కూడా ఎదిగాయి. అలాంటి టాప్ కంపెనీలను నిర్వహిస్తున్న 10 మంది వ్యక్తుల వద్ద ఆస్తి విలువ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఇండియాలో టాప్ 10 బిలియనీర్ల వద్ద ఉన్న ఆస్తి మొత్తం కలిపితే ఇండియా వార్షిక బడ్జెట్ లో మూడో వంతు ఉంటుంది. హురున్ సంస్థ 2025 ఏడాది గాను విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆ వివరాల ప్రకారం భారతదేశంలో టాప్ 10 సంపన్నులు, వారి ఆదాయాలు తెలుసుకుందాం రండి.
హురున్ సంస్థ విడుదల చేసిన జాబితా ప్రకారం ఇండియాలో నంబర్ 1 స్థానంలో రిలయన్స్ సంస్థల అధినేత ముకేష్ అంబానీ కొనసాగుతున్నారు. ఆయన నిర్వహిస్తున్న వివిధ కంపెనీల ఆస్తి విలువ సుమారు రూ.8.6 లక్షల కోట్లు.
రెండో స్థానంలో అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ ఉన్నారు. 2025 సంవత్సరంలో ఆయన ఆస్తి విలువ సుమారు రూ.8.4 లక్షల కోట్లు.
మూడో స్థానంలో రోష్ని నాడార్ నిలిచారు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ద్వారా వారు సంపాదించిన ఆస్తి విలువ సుమారు రూ.3.5 లక్షల కోట్లు.
సన్ ఫార్మా కంపెనీ అధినేత దిలీప్ సంఘ్ని హురున్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి విలువ సుమారు రూ.2.5 లక్షల కోట్లు.
విప్రో కంపెనీ అధినేత అయిన అజీమ్ ప్రేమ్ జీ ఈ లిస్టులో 5వ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి విలువ సుమారు రూ.2.2 లక్షల కోట్లు.
రూ.2 లక్షల కోట్ల ఆస్తితో బిర్లా కంపెనీ టాప్ 6 స్థానంలో ఉంది. ఈ కంపెనీ అధినేత కేఎం బిర్లా.
సైరస్ పూనావాలా ఈ జాబితాలో 7 వ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి విలువ కూడా రూ.2 లక్షల కోట్లు.
బజాజ్ కంపెనీ అధినేత అయిన నీరజ్ బజాజ్ రూ.1.6 లక్షల కోట్ల ఆస్తితో ఈ లిస్టులో 8వ స్థానంలో ఉన్నారు.
టాప్ 9 వ స్థానంలో రవి జైపూరియా ఉన్నారు. ఆయన ఆస్తి విలువ రూ.1.4 లక్షల కోట్లు.
డిమార్ట్ అధినేత అయిన రాధాకిషన్ దమానీ టాప్ 10 స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి విలువ సుమారు రూ.1.4 లక్షల కోట్లు.
వీరందరి ఆస్తి విలువ కలిపితే దాదాపుగా ఇండియా వార్షిక బడ్జెట్ లో మూడో వంతు ఉండటం విశేషం.
ఇది కూడా చదవండి నెలకు రూ.900 కడితే రూ.కోటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ సూపర్ పాలసీకి ఎలా అప్లై చేయాలంటే..?