- Home
- Business
- Health Insurance: నెలకు రూ.900 కడితే రూ.కోటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ సూపర్ పాలసీకి ఎలా అప్లై చేయాలంటే..?
Health Insurance: నెలకు రూ.900 కడితే రూ.కోటి వరకు హెల్త్ ఇన్సూరెన్స్.. ఈ సూపర్ పాలసీకి ఎలా అప్లై చేయాలంటే..?
Health Insurance: ఈ కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అందరికీ చాలా అవసరం. ప్రతి నెలా రూ.వందల్లో ప్రీమియం రూ.లక్షల్లో హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే కంపెనీలు చాలానే ఉన్నాయి. అయితే ఏకంగా రూ.కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చే పాలసీ గురించి, ఆ కంపెనీ, ప్రీమియం తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రోజుల్లో ఎప్పుడు, ఎవరికి, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ వస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇంట్లో ఉండే పెద్ద వాళ్ల దగ్గర్నుంచి చిన్న పిల్లలకు వరకు అందరూ సడన్ గా అనారోగ్యం పాలవుతున్నారు. దీనికి కల్తీ ఆహారం, వాతావరణ పరిస్థితులు, పొల్యూషన్, మారిన జీవన విధానం ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఆర్థికంగా చాలా హెల్ఫ్ చేస్తుంది. ఇప్పుడు మార్కెట్ లో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల్లో రూ.కోటి వరకు ఆర్థిక సాయం చేసే కంపెనీ ఒకటుంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియాలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలలో స్టార్ హెల్త్, నివా బుపా, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా, కేర్ హెల్త్, ఆదిత్య బిర్లా, ఇలా అనేక కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తున్నాయి. వీటిల్లో కొన్ని రూ.25 లక్షలు, రూ.50 లక్షలు కవరేజీ ఇస్తున్నాయి. అయితే నివా బుపా కంపెనీ ఏకంగా రూ.కోటి వరకు కవరేజీ ఇస్తోంది. అది కూడా తక్కువ ప్రీమియంతో ఇంత భారీ మొత్తంలో కవరేజీ ఇస్తున్న కంపెనీల్లో నివా బుపా టాప్ లో ఉంది.
నివా బుపా (Niva Bupa Health Companion) నివా బుపా కంపెనీ ఏకంగా రూ.కోటి కవరేజీ హెల్త ఇన్సూరెన్స్ పాలసీని అందిస్తోంది. దీని కోసం నెలకు రూ.900 కడితే సరిపోతుంది. వ్యక్తుల వయసు, ఆరోగ్య సమస్యలు, కవరేజీ బెనిఫిట్స్ లను బట్టి ప్రీమియం రూ.900 నుంచి రూ.1500 వరకు ఉంటుంది. అంటే సంవత్సరానికి సుమారు రూ.10,000 నుంచి రూ.18,000 వరకు ఉంటుంది.
నివా బుపా అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ పాలసీ కోసం అప్లై చేసుకోండి. లేదా పాలసీ బజార్ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు.
ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే రూ.5 లక్షల నుంచి రూ.కోటి వరకు కవరేజీ లభిస్తుంది. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు, ప్రమాదాలు, దీర్ఘకాలిక వ్యాధులకు కూడా ఈ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే.. మీరు రూ.10 లక్షల విలువైన హెల్త్ పాలసీ తీసుకుంటే అది మీరు ఈ సంవత్సరం వాడుకోకపోతే తర్వాత సంవత్సరానికి ఉపయోగపడేలా నో క్లెయిమ్ బోనస్ సదుపాయం కూడా ఉంది. ఇదే కాకుండా 10,000 లకు పైగా హాస్పిటల్స్ లో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగపడుతుంది. ఆయుష్ ట్రీట్మెంట్ వంటి ఎన్నో సౌకర్యాలు కూడా ఈ పాలసీలో కవర్ అవుతాయి.
నోట్: ఈ వివరాలు ఇంటర్నెట్ ద్వారా సంపాదించినవి. పూర్తి వివరాల కోసం నివా బుపా కంపెనీ అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.