MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Business
  • Today Gold Rate In Hyderabad: బంగారం ధరల్లో మళ్లీ ట్విస్ట్, ఇప్పుడు కొనాలా? వద్దా?

Today Gold Rate In Hyderabad: బంగారం ధరల్లో మళ్లీ ట్విస్ట్, ఇప్పుడు కొనాలా? వద్దా?

Today Gold Rate In Hyderabad: ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు బంగారం ధరలు ఇప్పటికే 20 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. భారతదేశంలో బంగారం కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా సంప్రదాయం, భద్రమైన పెట్టుబడిగా కూడా భావిస్తారు.

2 Min read
Author : Nandini Arava
Published : Mar 11 2026, 12:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గందరగోళంలో కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు
Image Credit : Getty

గందరగోళంలో కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు

గత నెల రోజుల రికార్డులు చూస్తే బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకాయి. ఫిబ్రవరి నెలలో తులం బంగారం ఏకంగా రూ.లక్షా 80వేలకు చేరింది. వెండిఅయితే రూ. 4 లక్షలు దాటేసింది. ఆ తర్వాత నుంచి వాటిలో ఎప్పటికప్పుడు మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఒకసారి అమాంతం పెరిగితే...మరోసారి ధరలు పడిపోతున్నాయి. అసలే శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొనుగోలుదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయానికి ఉన్న రేటు మధ్యాహ్నానానికి ఉండటంతో...దీంతో గందరగోళం నెలకొంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,63,310
Image Credit : Getty

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,63,310

అయితే బంగారం ధరల్లో ఇవాళ కొద్దిపాటి మార్పులు జరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.930 పెరిగి రూ.1,63,310కి చేరింది. రెండురోజుల్లో రూ.1630 పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.850 ఎగబాకి రూ.1,49,700 పలుకుతోంది. అటు వెండి స్థిరంగా కొనసాగుతోంది. నిన్ననే రూ.10వేలు పెరిగి రూ. 3లక్షలకు చేరుకుంది.

35
ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో స్వల్ప తేడాలు
Image Credit : Getty

ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో స్వల్ప తేడాలు

అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రం బంగారం ధరల్లో స్వల్ప తేడాలు ఉంటున్నాయి. స్థానిక డిమాండ్, ట్యాక్సులు, మార్కెట్ పరిస్థితుల ప్రభావంతో ధరలు మారుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో మాత్రం మేలిమి బంగారం ధర రూ.1,63,310 వద్ద కొనసాగుతోంది.

45
హుర్మూజ్ వద్ద పరిస్థితి మారితే ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం
Image Credit : Getty

హుర్మూజ్ వద్ద పరిస్థితి మారితే ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం

క్రూడ్ ఆయిల్ మార్కెట్‍లో జరిగిన పరిణామాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇరాన్‍లో ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించడంతో కొంత ఊరట కలిగించింది. అయితే మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గలేదు. ఒకవేళ హర్మూజ్ జలసంధి వద్ద మళ్లీ పరిస్థితి మారితే మాత్రం బంగారం ధరలు ఆకాశాన్ని తాకే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

55
గ్లోబల్ ట్రెండ్‍ను గమనించి కొనుగోలు చేయడం మంచిదని సూచన
Image Credit : Getty

గ్లోబల్ ట్రెండ్‍ను గమనించి కొనుగోలు చేయడం మంచిదని సూచన

బంగారం ఎక్కడ ఎలా ఉన్నా....ధరల ప్రభావం భారత్‍లో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి అంశం భారతీయులకు గోల్డ్ తోనే ముడిపడి ఉంటుంది. చిన్న శుభకార్యమైనా బంగారం ఉండాల్సిందే. అలాంటిది ఇప్పుడున్న ధరలు చూసి హడలిపోతున్నారు. ఆడపిల్లల తండ్రులు మరింత బెంబేలెత్తిపోతున్నారు. అయితే ఇప్పుడు బంగారం కొనాలా లేదా అన్నది ప్రస్తుత పరిస్థితుల్లో గ్లోబల్ ట్రెండ్‍ను గమనించి కొనుగోలు చేయడం మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gautam Adani Success Story: రైలు ఫ్లోర్‌పై నిద్రించిన 21 ఏళ్ల యువకుడు.. రూ.10.45 లక్షల కోట్లకు అధిపతిగా ఎలా మారాడు?
Recommended image2
Gold Price Hike: బంగారం కొనాలనుకుంటున్నారా? ఈరోజు ధరల పెరుగుదల చూస్తే షాకే
Recommended image3
మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా.? అయితే ఉచితంగా రూ. 10 ల‌క్ష‌ల ఇన్సూరెన్స్ ఉన్న‌ట్లే. ఎలాగంటే.?
Related Stories
Recommended image1
US-Iran War :ఈ రాత్రికి అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బాంబు దాడి..? అసలు నిజమేంటి..?
Recommended image2
Gold Rate Today: పసిడి కొనేవారికి గుడ్‍న్యూస్...దిగొచ్చిన ధరలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved