MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Business
  • Gold Prices: పసిడి ప్రియులకు ఇదే బెస్ట్ టైమ్..మళ్లీ తగ్గుముఖం పట్టిన బంగారం

Gold Prices: పసిడి ప్రియులకు ఇదే బెస్ట్ టైమ్..మళ్లీ తగ్గుముఖం పట్టిన బంగారం

Gold Prices: బంగారం ధరలు ఇప్పుడు దిగొస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, పెట్టుబడిదారుల వ్యూహాల్లో మార్పులతో మార్కెట్‌లో ఒత్తిడి కనిపిస్తోంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు స్థిరపడుతున్నాయి. బంగారంపై డిమాండ్ తగ్గి స్వల్పంగా క్షీణించాయి. 

2 Min read
Author : Nandini Arava
Published : Jun 17 2026, 11:48 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పసిడి ప్రియులకు కాస్త ఊరట
Image Credit : our own

పసిడి ప్రియులకు కాస్త ఊరట

ఇటీవలి కాలంలో బంగారం ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, శుభకార్యాలు, పెట్టుబడుల కోసం బంగారం కొనాలనుకునే వారు ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడు కాస్త ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా వరుసగా పెరిగిన పసిడి ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకున్న పరిణామాలు, పెట్టుబడిదారుల వ్యూహాల్లో మార్పులు దీనికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బంగారం మార్కెట్ లో తగ్గిన ఒత్తిడి
Image Credit : our own

బంగారం మార్కెట్ లో తగ్గిన ఒత్తిడి

ఇటీవల అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు కాస్త సాధారణ స్థితికి చేరుతున్నాయనే సంకేతాలు కనిపించడంతో బంగారం మార్కెట్‌లో ఒత్తిడి తగ్గింది. 

34
క్రమంగా దిగొస్తున్న గోల్డ్
Image Credit : our own

క్రమంగా దిగొస్తున్న గోల్డ్

అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో గత వారం రోజులుగా తీవ్ర హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ఒకవైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం పెరుగుతుందనే అంచనాలు, మరోవైపు డాలర్ పుంజుకోవడం బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా డాలర్ బలపడితే బంగారంపై పెట్టుబడులు కొంత తగ్గుతాయి. దీంతో బంగారం ధరలు కూడా క్రమంగా దిగివస్తుంటాయి. 

44
రూ.1,51,100కు చేరిన బంగారం
Image Credit : Google

రూ.1,51,100కు చేరిన బంగారం

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను విభిన్న రంగాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ పరిణామం కూడా బంగారం ధరల తగ్గుదలకు కారణమవుతోంది. అయితే దీర్ఘకాలికంగా చూస్తే బంగారం ఇప్పటికీ విశ్వసనీయ పెట్టుబడిగానే ఉందని వారు చెబుతున్నారు. ఇక దేశీయ మార్కెట్ విషయానికి వస్తే, ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గడం కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో నేడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.270 తగ్గి రూ.1,51,100 వద్ద కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.250 తగ్గి రూ.1,38,500గా నమోదైంది. ఇక 18 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.210 తగ్గి రూ.1,13,320 వద్ద ట్రేడ్ అవుతోంది. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Post Office TD: ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారెంటీ ఇన్‌క‌మ్‌.. పోస్టాఫీస్‌లో అద్భుత‌మైన ప‌థ‌కం
Recommended image2
పాలు పొంగిపోకుండా అడ్డుకునే స్మార్ట్ గ్లాస్ డిస్క్.. ఎలా పనిచేస్తుందో తెలుసా?
Recommended image3
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Related Stories
Recommended image1
Gold Price Hike: ట్రంప్ శాంతి డీల్ ఎఫెక్ట్..ఒక్కరోజులో బంగారం, వెండి ధరలకు రెక్కలు
Recommended image2
Gold Price: గోల్డ్ కొనేవారికి గుడ్ న్యూస్..పతనమైన వెండి.. పసిడి ప్రియులకు భారీ ఊరట
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved