MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Business
  • Gold Price: బంగారం మళ్లీ పతనమైంది...పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధ మంటలు..ఈసారి మరింత పతనం తప్పదా?

Gold Price: బంగారం మళ్లీ పతనమైంది...పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధ మంటలు..ఈసారి మరింత పతనం తప్పదా?

Gold Price: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధం మంటలు రాజుకోవడంతో గోల్డ్ మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. ఒక్కరోజులోనే తులం బంగారం ధర దాదాపు వెయ్యి రూపాయలు పడిపోయింది. అసలు యుద్ధానికి, బంగారం ధరకు సంబంధం ఏంటి? 

2 Min read
Author : Nandini Arava
Published : Jun 29 2026, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు
Image Credit : iSTOCK

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు

ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం మొదలైతే... దాని ప్రభావం కేవలం ఆ దేశాలకే పరిమితం కాదు. స్టాక్ మార్కెట్ల నుంచి చమురు వరకు... చమురు నుంచి బంగారం వరకు... ప్రతి రంగంపైనా దాని ప్రభావం కనిపిస్తుంది. ఇప్పుడు మరోసారి పశ్చిమాసియా ఉద్రిక్తంగా మారుతోంది. కాల్పుల విరమణపై ఆశలు కనిపించినా, పరిస్థితులు మళ్లీ మారిపోయాయి. తాజా దాడులు, ప్రతిదాడులతో అంతర్జాతీయ మార్కెట్లు అప్రమత్తమయ్యాయి. ఈ పరిణామాలు బంగారం ధరలపైనా స్పష్టంగా ప్రభావం చూపిస్తున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బంగారం ధరలపై ఒత్తిడి
Image Credit : iSTOCK

బంగారం ధరలపై ఒత్తిడి

సాధారణంగా యుద్ధం జరిగితే బంగారం ధరలు పెరుగుతాయని చాలా మంది అనుకుంటారు. కానీ ఈసారి పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. ముడి చమురు ధరలు పెరిగే అవకాశం, డాలర్ బలపడే అంచనాలు, పెట్టుబడిదారుల వ్యూహాల్లో మార్పులు... ఇవన్నీ కలిసి బంగారం ధరలపై ఒత్తిడిని తీసుకొచ్చాయి. 

Related Articles

Related image1
Gold Hike: 3 రోజుల పతనం తర్వాత షాకిచ్చిన బంగారం..ఇప్పుడు కొనాలా?వద్దా?
Related image2
Gold Price Hike: బంగారం కొనేముందు ఇవి తప్పక తెలుసుకోండి..ఈరోజు బిగ్ షాక్ ఇచ్చిన పసిడి, సిల్వర్
34
చమురు సరఫరాపై ఆందోళనలు
Image Credit : X

చమురు సరఫరాపై ఆందోళనలు

అంతర్జాతీయంగా చమురు సరఫరాపై ఆందోళనలు పెరగడంతో మార్కెట్లు కదులుతున్నాయి. చమురు ఖరీదు పెరిగితే ద్రవ్యోల్బణం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో అమెరికా డాలర్ బలపడే పరిస్థితి ఏర్పడుతుంది. డాలర్ బలపడితే సాధారణంగా బంగారం కొనుగోలు కొంత మందగిస్తుంది. అదే ఇప్పుడు ధరలు తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 

44
రూ.1,43,020కు చేరిన బంగారం
Image Credit : Getty

రూ.1,43,020కు చేరిన బంగారం

హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.930 తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ.1,43,020కు చేరుకుంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాములకు రూ.850 తగ్గడంతో ప్రస్తుతం ధర రూ.1,31,100 వద్ద కొనసాగుతోంది. అయితే వెండి పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. బంగారం ధరలు తగ్గినా వెండి ధరల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద ట్రేడవుతోంది.

ఇక ముందున్న రోజుల్లో బంగారం ధరలు ఎలా ఉంటాయనేది పూర్తిగా అంతర్జాతీయ పరిణామాలపైనే ఆధారపడి ఉంటుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగితే ఒకరకమైన ప్రభావం ఉండొచ్చు. మరోవైపు చమురు ధరలు, అమెరికా డాలర్, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు కూడా బంగారం ధరల దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మారనున్నాయి. 

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price hike: రూ.20వేలు తగ్గిన వెండి...మరోసారి పెరిగిన పసిడి...గ్రాము ఎంతంటే?
Recommended image2
Subhash Chandra: రూ. 22,000 కోట్ల బాకీ రూ. 6 కోట్లకు క్లియర్ ! జీ సుభాష్ చంద్ర కేసులో ఏం జరిగింది?
Recommended image3
Gold: బంగారం, వెండి మాత్రమే మిమ్మల్ని కాపాడతాయి.. అసలు సంగతి చెప్పిన రాబర్ట్ కియోసాకి !
Related Stories
Recommended image1
Gold Hike: 3 రోజుల పతనం తర్వాత షాకిచ్చిన బంగారం..ఇప్పుడు కొనాలా?వద్దా?
Recommended image2
Gold Price Hike: బంగారం కొనేముందు ఇవి తప్పక తెలుసుకోండి..ఈరోజు బిగ్ షాక్ ఇచ్చిన పసిడి, సిల్వర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved