November Born: నవంబర్ నెలలో జన్మించిన వ్యక్తుల బలాలు, బలహీనతలు ఇవే
November Born: సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి నెలలో జన్మించిన వ్యక్తికి భిన్నమైన స్వభావం ఉంటుంది. నవంబర్ నెల ప్రారంభమవుతోంది. కాబట్టి ఈ నెలలో జన్మించే మనుషుల వ్యక్తిత్వం, బలాలు, బలహీనతల గురించి తెలుసుకుందాం.

నవంబర్ నెలలో జన్మించినవారి వ్యక్తిత్వం
న్యూమరాలజీ ప్రకారం ప్రతి నెలలో జన్మించిన వ్యక్తుల స్వభావం విభిన్నంగా ఉంటుంది. వారు పుట్టిన సమయాన్ని బట్టి వారి జీవితం ఆధారపడి ఉంటుంది. అయితే పుట్టిన నెల కూడా వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని సంఖ్యాశాస్త్రం చెబుతుంది. పుట్టిన నెల ఆ వ్యక్తి త్వంపై ఇష్టా యిష్టాలపై ప్రభావం చూపిస్తుందని వివరిస్తుంది. నవంబర్ నెలలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారో, వారి లక్షణాలు ఏంటో, వారి అదృష్ట సంఖ్య, అదృష్ట అదృష్ట రంగు గురించి తెలుసుకుందాం.
కెరీర్ గురించి
నవంబర్లో జన్మించిన వారు కుజుడు, బృహస్పతి కలయిక ప్రభావం వీరిపై ఉంటుంది. ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునే లక్షణం వీరికి ఉంటుంది. వీరి అనుబంధాలు,కెరీర్ కూడా విజయవంతంగా సాగుతాయి. నవంబర్ నెలలో జన్మించిన వ్యక్తులకి తెలివితేటలు అధికంగా ఉంటాయి. ఎవరినైనా మాటలతో కట్టిపడేయగలరు.
తప్పకుండా విజయం
నవంబర్లో జన్మించిన వ్యక్తులు చాలా చురుకుగా ఉంటారు. వీరికి సోమరితనం అంటేనే తెలియదు. ఏదైనా పని ప్రారంభిస్తే అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టరు. పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. కష్టపడి పని చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు.
బలాలు ఇవే
నవంబర్ నెలలో జన్మించిన వారి మాట తీరు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వారు మాటలతోనే ఎదుటివారిని కట్టి పడేస్తారు. అలాగే వీరికి స్నేహితులు ఎక్కువ. స్నేహితులతో వీరు చాలా ప్రేమగా ఉంటారు. వీరు ఇచ్చే సలహాలు కూడా అద్భుతంగా ఉంటాయి. ఒక వ్యక్తి పరిస్థితిని అంచనా వేసి వారు సలహా ఇవ్వగలరు. ఆ సలహా ఖచ్చితంగా ఎదుటివారికి ఉపయోగపడుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తిత్వం వీరికి ఉంటుంది. నవంబర్లో జన్మించిన వారికి మిగతా నెలలో జన్మించిన వారు సాటిరారు. వీరు ఏ విషయంలోనే వెనక్కి తగ్గరు.
వీరి బలహీనత ఇదే
ఇక నవంబర్ నెలలో జన్మించిన వారి అతి పెద్ద బలహీనత మొండితనం. వారు చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ముండిగా ఉంటారు. వారు ఎవరితోనైనా అనుబంధం ఏర్పరచుకుంటే లేదా ఎవరినైనా ఇష్టపడినా, ఏ వస్తువునైనా ఇష్టపడినా దాన్ని జీవితాంతం వదిలిపెట్టరు. వీరికి ఎంత త్వరగా కోపం వస్తుందో.. అంత త్వరగా కోపం తగ్గిపోతుంది. ఇక ఈ నెలలో జన్మించిన వారికి ఊదా రంగు కలిసి వస్తుంది. అలాగే గులాబీ, తెలుపు రంగులు కూడా అదృష్ట రంగులగానే చెప్పుకోవాలి. ఇక లక్కీ నెంబర్ విషయానికి వస్తే 11 సంఖ్య వీరికి ఎంతో మంచిది.