MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Chicken Price: శ్రావణ మాసం వల్ల చికెన్, గుడ్లు ధరలు ఒక్కసారిగా కింద పడ్డాయి

Chicken Price: శ్రావణ మాసం వల్ల చికెన్, గుడ్లు ధరలు ఒక్కసారిగా కింద పడ్డాయి

Chicken Price: శ్రావణమాసంలో చాలా మంది మహిళలు మాంసాహారాన్ని తినరు.దీనివల్ల చికెన్, గుడ్ల ధరలపై ప్రభావం పడింది. వాటి ధరలు ఇప్పుడు బాగా తగ్గాయి. ఇప్పుడు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 17 2026, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
శ్రావణమాసంలో చికెన్ ధరలు
Image Credit : Gemini AI

శ్రావణమాసంలో చికెన్ ధరలు

పవిత్రమైన శ్రావణ మాసం ప్రారంభమైపోయింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే శ్రావణ మాసంలో అత్యధిక శాతం మహిళలు పూజలు, వ్రతాలు, ఉపవాసాలు ఆచరిస్తారు. దీనివల్ల మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉంటారు. ఇంట్లో కూడా వండేందుకు ఇష్టపడరు. దీనివల్ల మార్కెట్లలో చికెన్ వినియోగం భారీగా తగ్గిపోయింది. గత కొన్ని నెలలుగా ఆకాశాన్నంటిన ధరలు ఇప్పుడు బాగా తగ్గాయి. మార్చి నెల నుంచి ఎండల తీవ్రత, కోళ్ల దాణా ధరలు పెరిగిపోవడం, పెరిగిన డిమాండ్ కారణంగా బ్రాయిలర్ చికెన్ ధరలు దాదాపు కిలో రూ. 300 దాటాయి. అయితే శ్రావణ మాసం రాకతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయి, మార్కెట్లో మాంసం కొనుగోళ్లు బాగా తగ్గిపోయాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కిలో చికెన్ ధర ఎంత?
Image Credit : Pixabay

కిలో చికెన్ ధర ఎంత?

రిటైల్ మార్కెట్ల వివరాలను పరిశీలిస్తే, గత కొన్ని నెలలుగా కిలో రూ. 300 పైనే పలికిన స్కిన్‌లెస్ చికెన్ ధర కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే దాదాపు రూ. 60 మేర తగ్గింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర సుమారు రూ. 240 వరకు పలుకుతోంది. అదేవిధంగా విత్ స్కిన్ బ్రాయిలర్ చికెన్ ధర దాదాపు రూ. 200 కు చేరుకుంది. కేవలం చికెన్ మాత్రమే కాకుండా కోడిగుడ్ల ధరల్లోనూ భారీ మార్పు కనిపించింది. గతంలో డజను గుడ్ల ధర రూ. 96 నుంచి రూ. 100 వరకు ఉండగా, ప్రస్తుతం మార్కెట్లో అది రూ. 80 కి పడిపోయింది. చికెన్ వినియోగం తగ్గడంతో పౌల్ట్రీ వ్యాపారులు కోళ్ల నిల్వలను త్వరగా విక్రయించుకోవడానికి ధరలను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Related Articles

Related image1
మనదేశంలో మొబైల్ నంబర్లలో 10 అంకెలే ఎందుకుంటాయి? దీని వెనుక భారీ గణిత లెక్కలు
Related image2
Miracle Drink: జీలకర్ర, వాము, సోంపు కలిపి నెల రోజులు తాగి చూడండి.. మీరు ఎలా మారిపోతారంటే
33
మరి మటన్ ధరలు?
Image Credit : Pixabay

మరి మటన్ ధరలు?

చికెన్, గుడ్ల ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ, మటన్,నాటుకోడి ధరలలో పెద్దగా మార్పు కనిపించడం లేదు. మార్కెట్లో కిలో మటన్ ధర ఇప్పటికీ రూ. 850 పైనే కొనసాగుతోంది. ఇక నాటుకోళ్ల లభ్యత తక్కువగా ఉండటం వల్ల లైవ్ నాటుకోడి కిలో ధర దాదాపు రూ. 750 వద్దే స్థిరంగా కొనసాగుతోంది. శ్రావణ మాసం మొత్తం భక్తులు శాకాహారానికే ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి, ఈ నెల పూర్తయ్యే వరకు మార్కెట్లో చికెన్‌కు డిమాండ్ తక్కువగానే ఉండే అవకాశం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Price Hike: వారం మొదట్లోనే పసిడి ధరల మోత..కొనాలనుకునేవారికి భారీ షాక్
Recommended image2
అత్యంత చౌకైన రీఛార్జ్ ప్లాన్ ఇదే.. నెల‌కు రూ. 180తో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్
Recommended image3
Post Office: అస‌లు అలాగే ఉంటుంది, ప్ర‌తీ నెల మీ అకౌంట్‌లో రూ. 5500 వ‌డ్డీ ప‌డుతుంది
Related Stories
Recommended image1
మనదేశంలో మొబైల్ నంబర్లలో 10 అంకెలే ఎందుకుంటాయి? దీని వెనుక భారీ గణిత లెక్కలు
Recommended image2
Miracle Drink: జీలకర్ర, వాము, సోంపు కలిపి నెల రోజులు తాగి చూడండి.. మీరు ఎలా మారిపోతారంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved