- Home
- Business
- అత్యంత చౌకైన రీఛార్జ్ ప్లాన్ ఇదే.. నెలకు రూ. 180తో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్
అత్యంత చౌకైన రీఛార్జ్ ప్లాన్ ఇదే.. నెలకు రూ. 180తో రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్
Recharge plan: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌పై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. సాధారణంగా 365 రోజుల వ్యాలిడిటీ ఇచ్చే రూ.2,399 ప్లాన్ వ్యాలిడిటీని 412 రోజుల వ్యాలిడిటీకి పెంచారు. అదనంగా 47 రోజులు ఉచితంగా లభిస్తాయి.

365 రోజుల ప్లాన్‌కు ఇప్పుడు 412 రోజుల వ్యాలిడిటీ
బీఎస్ఎన్ఎల్ రూ.2,399 ప్లాన్‌ను సాధారణంగా ఏడాది పాటు ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రత్యేక ఆఫర్ కింద రీఛార్జ్ చేస్తే మొత్తం 412 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అదనంగా 47 రోజులు రావడంతో మరోసారి రీఛార్జ్ చేయాల్సిన అవసరం మరింత ఆలస్యమవుతుంది. ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12, 2026 మధ్య ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే వారికి ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
ప్లాన్‌లో లభించే ప్రయోజనాలు ఇవే
ఈ ప్లాన్‌తో యూజర్లకు దేశవ్యాప్తంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. అలాగే రోజుకు 100 ఉచిత SMSలు, రోజుకు 2GB హైస్పీడ్ డేటా, 2 జీబీ పూర్తయిన తర్వాత 40 kbps వేగంతో అన్‌లిమిటెడ్ డేటా పొందొచ్చు. ఆఫర్ కాలంలో రీఛార్జ్ చేస్తే అదనంగా 47 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు.
నెలకు ఎంత పడుతుందంటే.?
ఈ ప్లాన్‌ను నెలవారీ ఖర్చుతో పోలిస్తే మరింత ఆదా అవుతుంది. సాధారణ 365 రోజుల వ్యాలిడిటీ ప్రకారం నెలకు సుమారు రూ.200 మాత్రమే పడుతుంది. అయితే 412 రోజుల ఆఫర్ వ్యాలిడిటీ ప్రకారం నెలకు సగటున రూ.175 వరకు మాత్రమే అవుతుంది. రోజువారీ ఖర్చు కూడా కేవలం రూ.5.82 మాత్రమే పడుతుంది. ప్రతి నెల విడిగా రీఛార్జ్ చేసుకునే వారితో పోలిస్తే, ఈ ప్లాన్ తీసుకుంటే ఎక్కువ కాలం టెన్షన్ లేకుండా సేవలను ఉపయోగించుకోవచ్చు.
ఈ ఆఫర్ ఎవరికి బాగా ఉపయోగపడుతుంది?
తరచూ రీఛార్జ్ చేయడం ఇష్టంలేని వారికి, తక్కువ ఖర్చుతో ఏడాదికిపైగా మొబైల్ సేవలు ఉపయోగించాలనుకునే వారికి ఈ ప్లాన్ మంచి ఎంపికగా చెప్పవచ్చు. ముఖ్యంగా BSNL 4G సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉన్న యూజర్లు ఈ ఆఫర్‌ను ఉపయోగించుకుంటే అదనపు 47 రోజుల ప్రయోజనం పొందవచ్చు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా యూజర్లకు ప్రత్యేక ఆఫర్‌గా BSNL ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. సెప్టెంబర్ 12, 2026లోపు రీఛార్జ్ చేసుకుంటే మాత్రమే ఈ అదనపు వ్యాలిడిటీ వర్తిస్తుంది.

