MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Tata EV Discounts: టాటా ఈవీ కొనాలనుకునే వారికి పండగే.. ఏకంగా రూ. 3.35 లక్షల వరకు తగ్గింపు !

Tata EV Discounts: టాటా ఈవీ కొనాలనుకునే వారికి పండగే.. ఏకంగా రూ. 3.35 లక్షల వరకు తగ్గింపు !

Tata EV Discounts : టాటా మోటార్స్ తమ ఈవీ కార్లపై రూ. 3.35 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. నెక్సాన్, పంచ్, హారియర్, కర్వ్, టియాగో కార్లపై భారీ ఆఫర్లు ఇచ్చింది. ఆ వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 06 2026, 10:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
టాటా ఈవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. హారియర్, కర్వ్, నెక్సాన్‌లపై భారీ ఆఫర్లు !
Image Credit : Gemini

టాటా ఈవీలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. హారియర్, కర్వ్, నెక్సాన్‌లపై భారీ ఆఫర్లు !

టాటా మోటార్స్ ఇటీవల మార్కెట్లోకి సరికొత్త సియెర్రా ఈవీ (Sierra EV) కారును లాంచ్ చేసి తన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఈ నేపథ్యంలో జూలై నెలకు గానూ టాటా మోటార్స్ తన ఈవీ పోర్ట్‌ఫోలియోపై భారీ డిస్కౌంట్లను అనౌన్స్ చేసింది.

సేల్స్ పెంచడంతో పాటు అమ్ముడుపోకుండా మిగిలిపోయిన పాత స్టాక్ క్లియర్ చేయడం కోసం ఈ ఆఫర్లను తీసుకొచ్చింది. అయితే ఈ డిస్కౌంట్లు అన్ని కార్లపై ఒకేలా లేవు. ఇందులో క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, ఇంటర్వెన్షన్ బోనస్, లాయల్టీ బోనస్ వంటివి కలిసి ఉన్నాయి. మీ సమీపంలోని టాటా డీలర్‌షిప్‌ను సందర్శిస్తే ఖచ్చితమైన ఆఫర్ల వివరాలు తెలుస్తాయి. ఏ కారుపై ఎంత ఆఫర్ ఉందో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నెక్సాన్ ఈవీపై రూ. 50,000 వరకు ఆఫర్
Image Credit : tata motors

నెక్సాన్ ఈవీపై రూ. 50,000 వరకు ఆఫర్

టాటా మోటార్స్ కార్లలో అత్యధికంగా అమ్ముడయ్యే మోడల్స్‌లో నెక్సాన్ ఈవీ ఒకటి. అందుకే దీనిపై కంపెనీ తక్కువ డిస్కౌంట్ ఇస్తోంది. నెక్సాన్ ఈవీ సేల్స్ మరింత పెంచడానికి అన్ని వేరియంట్లపై రూ. 50,000 వరకు టోటల్ డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రూ. 15,000 క్యాష్ డిస్కౌంట్ ఉండగా.. మిగిలిన రూ. 35,000 వరకు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్ రూపంలో అందుతోంది.

36
టియాగో ఈవీపై రూ. 1.45 లక్షల వరకు తగ్గింపు
Image Credit : our own

టియాగో ఈవీపై రూ. 1.45 లక్షల వరకు తగ్గింపు

టాటా మోటార్స్ ఇటీవలే టియాగో ఈవీని సరికొత్త ఫేస్‌లిఫ్ట్ రూపంలో, ఇంటీరియర్ మొత్తాన్ని మార్చేసి మార్కెట్లోకి తెచ్చింది. అయితే, ఫేస్‌లిఫ్ట్‌కు ముందు వచ్చిన పాత మోడల్ పై కంపెనీ ఏకంగా రూ. 1.45 లక్షల వరకు భారీ డిస్కౌంట్లను ఇస్తోంది. ఇందులో అన్ని మీడియం రేంజ్ వేరియంట్లపై రూ. 40,000 క్యాష్ డిస్కౌంట్‌తో కలిపి మొత్తం రూ. 65,000 వరకు బెనిఫిట్స్ వస్తాయి. ఇక లాంగ్ రేంజ్ వేరియంట్ల విషయానికి వస్తే.. ట్రిమ్ ఆధారంగా రూ. 1 లక్ష వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్/స్క్రాపేజ్ బోనస్, రూ. 50,000 ఇంటర్వెన్షన్ బెనిఫిట్ లభిస్తాయి.

46
పంచ్ ఈవీ పాత మోడల్‌పై రూ. 1.45 లక్షల వరకు బెనిఫిట్స్
Image Credit : TATA MOTORS

పంచ్ ఈవీ పాత మోడల్‌పై రూ. 1.45 లక్షల వరకు బెనిఫిట్స్

టాటా మోటార్స్ ఈ ఏడాది ప్రారంభంలోనే పంచ్ ఈవీని అప్‌డేట్ చేసింది. దీంతో సేల్స్ పెంచేందుకు, పాత స్టాక్ క్లియర్ చేసేందుకు ఈ పాత మోడల్ పై క్రేజీ ఆఫర్లను ప్రకటించింది. పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ వేరియంట్లపై గరిష్ఠంగా రూ. 1.45 లక్షల వరకు ప్రయోజనాలు అందుకోవచ్చు, ఇందులో రూ. 1.1 లక్షల భారీ క్యాష్ డిస్కౌంట్ కూడా ఉంది. ఇక మీడియం రేంజ్ వేరియంట్లపై ట్రిమ్స్‌ను బట్టి రూ. 1.25 లక్షల వరకు మొత్తం బెనిఫిట్స్ లభిస్తుండగా, అందులో రూ. 90,000 వరకు క్యాష్ డిస్కౌంట్ రూపంలోనే అందుతుంది.

56
హారియర్ ఈవీపై రూ. 2.75 లక్షల భారీ ఆఫర్
Image Credit : tatamotors

హారియర్ ఈవీపై రూ. 2.75 లక్షల భారీ ఆఫర్

టాటా కంపెనీకి చెందిన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ కారు హారియర్ ఈవీపై ఏకంగా రూ. 2.75 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. కానీ ఈ లిస్ట్‌లోని మిగతా కార్లలా కాకుండా, జూలై నెలకు గానూ హారియర్ ఈవీపై ఎలాంటి డైరెక్ట్ క్యాష్ డిస్కౌంట్లు లేవు. దీనికి బదులుగా రూ. 1 లక్ష వరకు ఇంటర్వెన్షన్ బెనిఫిట్, రూ. 1 లక్ష వరకు లాయల్టీ బోనస్, అలాగే రూ. 75,000 వరకు స్క్రాపేజ్ లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తున్నారు.

66
కర్వ్ ఈవీపై అత్యధికంగా రూ. 3.35 లక్షల డిస్కౌంట్
Image Credit : Official website

కర్వ్ ఈవీపై అత్యధికంగా రూ. 3.35 లక్షల డిస్కౌంట్

టాటా ఈవీ కార్లన్నింటిలోకి ఎప్పుడూ అత్యధిక డిస్కౌంట్లు పొందే కారు ఏదైనా ఉందంటే అది కర్వ్ ఈవీ మాత్రమే. ఈ సారి కూడా దీనిపై రికార్డు స్థాయిలో రూ. 3.35 లక్షల వరకు ఆఫర్ ప్రకటించారు. అయితే ఈ భారీ డిస్కౌంట్లు మే 2026లో వచ్చిన ఎక్స్ సిరీస్ అప్‌డేట్‌కు ముందున్న కర్వ్ ఈవీ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తాయి. కర్వ్ ఈవీపై ఇచ్చే క్యాష్ డిస్కౌంట్ విలువ మాత్రమే రూ. 3 లక్షల వరకు ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
ఆటోమొబైల్
భారతీయ ఆటోమొబైల్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Saving Tips: మీ జీతంలో ఎంత దాస్తున్నారు? సేవింగ్ చేసేవాళ్లలో మీరు ఏ కేటగిరీ?
Recommended image2
Gold Price Hike: అమెరికా ఎన్నికల తర్వాత మారిన మార్కెట్ లెక్కలు.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు
Recommended image3
Kavya Maran: రూ. 26000 కోట్ల ఆస్తికి ఏకైక వారసురాలు.. SRH పాప వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
Related Stories
Recommended image1
Mallela Theertham: నల్లమల అడవుల్లో బాహుబలి రేంజ్ వాటర్ ఫాల్స్.. మల్లెల తీర్థం రూట్ మ్యాప్ ఇదే
Recommended image2
Digital India Super Apps: మీ మొబైల్‌లో తప్పక ఉండాల్సిన ప్రభుత్వ యాప్స్‌ ఇవీ.. వీటితో పనులన్నీ ఈజీ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved