బుర్రపాడు.. టైప్ సీ ఛార్జర్‌తో రీఛార్జ్ చేసుకునే బ్యాటరీలు.. ధర ఎంతంటే.?
Batteries: రీఛార్జ్ బ్యాటరీల గురించి మనకు తెలిసిందే. సాధారణంగా ఈ బ్యాటరీలను రీఛార్జ్ చేయడానికి ప్రత్యేకంగా ఒక మిషిన్ ఉంటుంది. అలా కాకుండా బ్యాటరీలను నేరుగా టైప్ సీ ఛార్జర్‌తో ఛార్జింగ్ చేస్తే భలే ఉంటుంది కదూ.

టైప్ సీ పోర్ట్‌తో ఛార్జింగ్
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఈ బ్యాటరీల పేరు Portronics Lithius Cell. ఇది Type-C ద్వారా నేరుగా చార్జ్ అయ్యే AA రీచార్జ్‌బుల్ బ్యాటరీ. దీనికి వేరే ఛార్జర్ అవసరం లేదు. బిల్ట్-ఇన్ USB Type-C పోర్ట్‌తో సులభంగా, ఎప్పుడైనా చార్జ్ చేసుకోవచ్చు. ఇది ఆధునిక గాడ్జెట్లకు సరిపోయేలా డిజైన్ చేశారు.
బ్యాటరీ సామర్థ్యం, పనితీరు
ఈ బ్యాటరీలో 1.5V / 1480mAh (2220mWh) లిథియం అయాన్ సెల్ ఉంటుంది. ఇది స్థిరమైన పవర్‌ను అందిస్తుంది. ఎక్కువసేపు బ్యాకప్ అందిస్తుంది. కెమెరాలు, గేమింగ్ కంట్రోలర్లు, రిమోట్లు వంటి పవర్ ఎక్కువగా అవసరమయ్యే పరికరాలకు ఇది బాగా సరిపోతుంది.
ఫాస్ట్ ఛార్జింగ్, స్థిరమైన అవుట్‌పుట్
ఈ బ్యాటరీలు DC 5V/0.5A ఇన్‌పుట్ ద్వారా వేగంగా చార్జ్ అవుతాయి. DC 1.5V/2A అవుట్‌పుట్ ఇస్తుంది. దీంతో వైర్లెస్ కీబోర్డ్, మౌస్, టార్చ్, ఎలక్ట్రిక్ బ్రష్ వంటి పరికరాలలో పవర్ సప్లై నిలకడగా ఉంటుంది. చార్జింగ్ సమయం తక్కువ, పనితీరు ఎక్కువగా ఉంటుంది.
భద్రత, స్మార్ట్ ప్రొటెక్షన్
ఈ బ్యాటరీలో ముఖ్యమైన రక్షణ వ్యవస్థలు ఉన్నాయి:
Over-Current Protection – ఎక్కువ కరెంట్ వచ్చినా రక్షిస్తుంది
Over-Discharge Protection – పూర్తిగా డిశార్జ్ కాకుండా కాపాడుతుంది
ఈ ఫీచర్లు బ్యాటరీ ఆయుష్షును పెంచుతాయి. అలాగే మీ గ్యాడ్జెట్లను సురక్షితంగా ఉంచుతాయి.
లో సెల్ఫ్ డిశ్చార్జ్
బ్యాటరీని వాడకపోయినా ఇది 80% వరకు ఛార్జ్‌ను నెలల తరబడి నిలుపుకుంటుంది. అందువల్ల ఇది వాడుకోవడానికి సిద్దంగా ఉంటుంది. ఇది సాధారణ AA బ్యాటరీలతో పోల్చితే చాలా మెరుగ్గా పనిచేస్తాయి. వీటిని రిమోట్, టార్చ్, వైర్లెస్ మౌస్, కీబోర్డ్, కెమెరా, అలారం క్లాక్, కార్ రిమోట్లు, వాల్ క్లాక్‌లు వంటి వాటిలో ఎంచక్కా ఉపయోగించుకోవచ్చు. ధర విషయానికొస్తే అమెజాన్ లో ఈ బ్యాటరీ అసలు ధర రూ. 599గా ఉండగా 25 శాతం డిస్కౌంట్ తో రూ. 449కే లభిస్తోంది.

