స్మార్ట్‌వాచ్‌తో సిగరెట్ మానేయొచ్చా? షాకింగ్ విషయాలు ఇవిగో
మీరు స్మోకింగ్ కి అడిక్ట్ అయిపోయారా? సిగరెట్ తాగడం మానాలన్నా చేయలేకపోతున్నారా? అయితే ఈ స్మార్ట్ వాచ్ పెట్టుకోండి. సిగరెట్ అంటేనే మీకు అసహ్యం కలిగేలా చేస్తుంది ఈ స్మార్ట్ ఫోన్. ఈ విషయాన్ని బ్రిస్టల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు. పూర్తి వివరాలను ఇక్కడ చూద్దాం రండి.
ప్రపంచవ్యాప్తంగా కోట్లది మంది పొగ తాగే అలవాటుకు బానిసలయ్యారు. పొగ తాగడం మన శరీరానికి హాని కలిగించడమే కాకుండా మన చుట్టూ ఉన్నవారిని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ప్రతిరోజూ పొగ తాగడం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొంతమంది పొగ తాగడం మానేయాలనుకున్నా మానేయలేకపోతున్నారు.
ఇప్పుడు పొగ తాగడం మానేయడానికి స్మార్ట్‌వాచ్ సరిపోతుందని బ్రిస్టల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. స్మార్ట్‌వాచ్ ఎలా పొగ తాగడాన్ని ఆపుతుందో తెలుసుకుందాం రండి.
బ్రిస్టల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు స్మార్ట్‌వాచ్‌లలో ఒక వ్యక్తి పొగ తాగేటప్పుడు చేసే చేతి కదలికలను గుర్తించే మోషన్ సెన్సార్ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసి అధ్యయనం చేశారు.
వారి అధ్యయనం ప్రకారం రోజూ సిగరెట్ కాల్చే వారు, పొగ తాగడం మానేయడానికి ప్రయత్నిస్తున్న వారు, కుడి చేతిని ఉపయోగించి పొగ తాగేవారు ఇలా 18 రకాల వ్యక్తులను ఎంపిక చేసి వారిపై పరిశోధన చేశారు. రెండు వారాల పాటు ప్రతిరోజూ వారు స్మార్ట్‌వాచ్ ధరించారు. ఆ తర్వాత పరిశోధకులు స్మార్ట్‌వాచ్‌లోని మోషన్ సెన్సార్‌ల ద్వారా వారు పొగ తాగే సంజ్ఞలను గుర్తించగల అల్గారిథమ్‌ను అభివృద్ధి చేశారు.
ఇది కూడా చదవండి: 2025లో AI ప్రపంచాన్ని షేక్ చేయనుందా? మీరు ఊహించని మార్పులు రాబోతున్నాయ్
అధ్యయనంలో పాల్గొన్నవారు సిగరెట్ తాగే ప్రతిసారీ వారి చేతి కదలికల ఆధారంగా స్మార్ట్‌వాచ్ సాఫ్ట్‌వేర్ వాటిని గుర్తించి, స్క్రీన్‌పై హెచ్చరికను జారీ చేస్తుంది. అలాగే హెచ్చరిక నోటిఫికేషన్‌ను కూడా పంపుతుంది. ప్రతిసారీ సిగరెట్ తాగడానికి చేయి ఎత్తినప్పుడు, స్మార్ట్‌వాచ్ సాఫ్ట్‌వేర్ ద్వారా దానిని గుర్తించి వైబ్రేషన్ ఇస్తుంది.
దీని ద్వారా సిగరెట్ తాగేవారు దానిని గ్రహించి ఆ సమయంలో సిగరెట్ తాగడాన్ని వాయిదా వేస్తారు. ఇలా ప్రతిసారీ స్మార్ట్‌వాచ్ హెచ్చరిక చేసినప్పుడు పొగ తాగే అలవాటును మానేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని బ్రిస్టల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు.
పొగ తాగేటప్పుడు చేసే చేతి కదలికల ఆధారంగా స్మార్ట్‌వాచ్‌లు స్క్రీన్‌పై హెచ్చరికలు జారీ చేస్తాయి. ''మీరు ఇప్పటికే సిగరెట్ తాగడం ఆపేశారు. మళ్లీ ప్రారంభించొద్దు. మీ ఆరోగ్యం దెబ్బతింటే మీ కుటుంబ సభ్యులు బాధపడతారు. పొగ తాగడం మానేస్తేనే ఆరోగ్యంగా ఉంటారు.'' ఇలాంటి ఆత్మవిశ్వాస నినాదాలు కూడా స్మార్ట్ వాచ్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.
అయితే ఈ అధ్యయనంలో కొన్ని తప్పుడు ఫలితాలు కూడా వచ్చాయి. అంటే చేతిలో సిగరెట్ లేకుండా పొగ తాగినట్లుగా సంజ్ఞ చేసినా స్మార్ట్‌వాచ్ హెచ్చరిక చేస్తుందని అధ్యయనంలో పాల్గొన్న కొందరు కంప్లయింట్ చేశారు. ఈ తప్పులను సరిదిద్ది ఈ అధ్యయనానికి ఆచరణాత్మక రూపం ఇచ్చే పనిలో పరిశోధకులు ప్రస్తుతం బిజీగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: రూ.5000 నోటు వస్తుందా? RBI ఏం చెప్పిందో తెలుసా?